Lifestyle

మై విలేజ్ షో ఫేమ్ “గంగవ్వ” గురించి.. ఎవ్వరికి తెలియని 10 ఆసక్తికర విషయాలు

Sandeep Thatla  |  Nov 29, 2019
మై విలేజ్ షో ఫేమ్ “గంగవ్వ” గురించి.. ఎవ్వరికి తెలియని 10 ఆసక్తికర విషయాలు

10 Interesting facts about My Village Show “Gangavva”

ఈమధ్యకాలంలో సామాన్యులు వినోదం కోసం థియేటర్‌కి వెళ్లాల్సిన అవసరం కనబడడం లేదు. కారణం ఇంట్లోనే ఉంటూ.. యుట్యూబ్, అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ అంటూ ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లలో ఎన్నో రకాల కార్యక్రమాలు చూస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారానే  యు ట్యూబ్‌లో ఓ అరవై ఏళ్ళ తెలుగు మహిళ వీక్షకులని తన నటనతో పాటు భాష, యాసలతో అద్భుతంగా ఆకట్టుకుంటోంది

“ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి.. నెలరోజులు చాలు” – నటి ‘రాశి’ ఆసక్తికర లవ్ స్టోరీ ..!

ఆమె ఎవరో కాదు – మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ. ఆమెకి యుట్యూబ్  ద్వారా వచ్చిన ఫేమ్ ఎంతంటే – తను ప్రస్తుతం సినిమా విడుదల ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా పాల్గొంటోంది. దానికి కారణం.. సినిమాల్లో కూడా దర్శక-నిర్మాతలు ఆమె చేత ప్రత్యేక పాత్రలు చేయిస్తుండడమే. ఇక సామాజిక మాధ్యమాల ద్వారా గంగవ్వ పంచుతున్న వినోదానికి గాను.. ఆమెకి ఇటీవలే పద్మమోహన అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రముఖ హాస్య నటులైన బ్రహ్మానందం, అలీలతో ఫోటోలు దిగగా.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

ఇక జనసామాన్యంలో ఇంతటి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న గంగవ్వ గురించి ఎక్కువమందికి తెలియని ఒక 10 ఆసక్తికర విషయాలు మీకోసం

* చిన్నవయసులోనే తల్లిదండ్రులని కోల్పోవడంతో.. అవ్వ, తాత పెంపకంలో పెరిగి అయిదేళ్ల వయసులోనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గంగవ్వకి….

* అలా 20 ఏళ్ళు వచ్చేసరికి నలుగురు పిల్లలకి తల్లయింది గంగవ్వ.

* తన భర్తకి ఊరిలో వ్యవసాయ రాబడి లేదని అర్ధమయి.. 50 వేల రూపాయలు అప్పు తెచ్చి.. దుబాయ్‌కి వెళ్లి ఏదైనా పని చూసుకోమని పంపించింది.

* అయితే దుబాయ్‌కి వెళ్లిన భర్త నుండి ఎటువంటి ఆర్ధిక సహాయం అందకపోగా.. ఆ సమయంలో తన చిన్న కూతురు 8 ఏళ్ళ వయసులోనే అనారోగ్యం బారిన పడి చనిపోవడం.. గంగవ్వ జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటన. 

* దుబాయ్ వెళ్లిన భర్త తిరిగి రాకపోవడం.. అలాగే కావాల్సిన ఆర్ధిక సహాయం కూడా చేయకపోవడంతో.. తానే అప్పు చేసి మరీ ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసింది గంగవ్వ.

* అమ్మయిల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం.. వ్యవసాయం చేయడానికి భూమి ఉన్నా కూడా.. పంటలు సరిగ్గా పండక పోవడంతో.. చేసేది లేక ఆ భూమిని అమ్మేసి అప్పులు అన్ని తీర్చేసింది గంగవ్వ.

ఆకాశ మేఘాల్లో విందు ఆరగించాలని ఉందా..? అయితే హైదరాబాద్‌లో ‘క్లౌడ్ డైనింగ్’ ట్రై చేసేయండి

*  ఇక దాదాపు 13 తరువాత తిరిగి ఊరికి వచ్చిన గంగవ్వ భర్త.. మరలా ఆమెని కష్టపెట్టడం మొదలుపెట్టడంతో ఆమె అసక్తురాలైంది. కొన్నిరోజుల తర్వాత మద్యానికి బానిస అయిన గంగవ్వ భర్త చనిపోవడంతో ఆమె జీవితం మళ్లీ మొదటికే వచ్చినట్లయింది.

* అలా ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగుతున్న ఆమె జీవితంలోకి వచ్చిన గంగవ్వ మేనల్లుడు.. శ్రీరామ్ శ్రీకాంత్ (మై విలేజ్ షో వ్యవస్థాపకుడు) రూపంలో తనకు ఒక దారి కనిపించింది. ఆయన చేసిన వీడియోస్‌లో అనుకోకుండా ఈమె పాత్ర హిట్ అవ్వడంతో.. తనకు ఎవరికీ రానంత పేరు రావడం జరిగింది.

* ఇక ఇప్పుడు తెలుగులో ఎక్కుమంది ప్రజల మన్ననలు పొందగలుగుతున్న సోషల్ మీడియా సెలబ్రిటీలలో కూడా గంగవ్వ ఒకరు.

* గంగవ్వ వీడియోలకి వచ్చిన క్రేజ్ దృష్ట్యా.. ఆమెని ఇప్పటికే అటు యూ ట్యూబ్, గూగుల్ సంస్థల వారు అనేక వర్క్ షాప్స్‌కి పిలిపించి ప్రత్యేకంగా  గౌరవించడం జరిగింది. తాజాగా ప్రతిష్టాత్మక పద్మామోహన్ అవార్డు సైతం ఆమెకి రావడంతో ఆమెకి ఘన సత్కారం లభించినట్లయింది.

ఇవండీ.. మన మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ గురించిన ఆసక్తికర విషయాలు

తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్న తమిళ హీరోలు & దర్శకులు ఎవరో తెలుసా…

Read More From Lifestyle