Beauty

బ్యూటీ రిజల్యూషన్స్: సులభమైన చిట్కాలతో అందం మీ సొంతం..

Lakshmi Sudha  |  Jan 16, 2019
బ్యూటీ రిజల్యూషన్స్:  సులభమైన చిట్కాలతో అందం మీ సొంతం..

కొత్త ఏడాదిలో తమని తాము మెరుగుపరచుకొనేందుకు ఎవరికి వారు కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకొంటారు. వాటిని చేరుకొనే ప్రయత్నం చేస్తారు. అయితే ఇలాంటి వాటిలో ఎక్కువగా ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. అయితే సౌందర్యానికి సంబంధించిన రిజల్యూషన్స్ తీసుకోవడానికి ఎవరూ అంత ఆసక్తి చూపించరు. కానీ కొత్త ఏడాదిలో బ్యూటీ రిజల్యూషన్స్ తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. దీనికోసం పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. రోజూ కొన్ని చిట్కాలు (Beauty Tips) పాటించడం ద్వారా 2019 పూర్తయ్యేసరికి మీరు సౌందర్య రాశిగా మారిపోతారు.

1. అందాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన చిట్కాల్లో మొదటిది.. సరిపడినంత నీటిని తాగడం. రోజుకి 8-10 గ్లాసుల నీరు తాగడం ముఖ్యం.

Image: Shutterstock

2. బ్యూటీ ప్రొడక్ట్స్ కొనడం కంటే వాటిని ఉపయోగించే విషయంలో శ్రద్ధ అవసరం.

3. తరచూ బాడీ స్క్రబ్ ఉపయోగించాలి.

4. బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ తప్పనిసరి.

5. మీది జిడ్డుచర్మమా? పొడి చర్మమా? లేదా మిశ్రమ చర్మతత్వమా? ఈ విషయం తెలుసుకొన్నప్పుడే మీకు సరిపడే సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించగలుగుతారు. కాబట్టి ముందు మీ చర్మం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

6.  పెదవులు పగిలిపోకుండా లిప్ బామ్ రాయడం తప్పనిసరి.

7.  మీ అందాన్ని కాపాడుకోవాలంటే.. చర్మానికి రోజూ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.

Image: Shutterstock

8. ఎక్స్పైరీ పూర్తయిన బ్యూటీ ఉత్పత్తులను వాడటం ఆపేయండి.

9. మీ జుట్టు తత్వాన్ని బట్టి తరచూ నూనె రాస్తూ ఉండండి.

10. అందంగా ఉండటానికి నిద్ర కూడా అవసరం. కాబట్టి తగినంత నిద్రపోవడానికి ప్రయత్నించండి.

11.తరచూ సౌందర్య ఉత్పత్తులు మార్చవద్దు. ఎప్పుడూ ఒకే రకాన్ని వాడటం మంచిది.

12. మేకప్ బ్రష్‌లను సరిగ్గా శుభ్రం చేస్తూ ఉండండి.

13. చర్మం ఆరోగ్యానికి రసాయన రహిత, సహజ మేకప్, బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగించండి.

14. మీ ఆహారంలో విటమిన్ బి, విటమిన్ ఇ ఉన్న వాటిని భాగం చేసుకోండి. ఇవి మీ చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తాయి.

15. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొంటూ ప్రశంసించుకోండి. అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అది మీ అందంలోనూ ప్రతిఫలిస్తుంది.

చూశారుగా.. ఈ చిట్కాలు ఎంత సులభంగా ఉన్నాయో.. మీరు కూడా ఇవి పాటించి మీ అందాన్ని పెంపొందించుకోండి.

Featured Image: Payal Rajput Facebook

ఇవి కూడా చదవండి

సౌందర్యాన్ని పరిరక్షించే.. పది రకాల కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్..!

కొత్త ఏడాదిలో కొత్త బ్యూటీ ప్రొడక్ట్స్… మీతో షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాం

పతంజలి ఉత్పత్తులు- వాటి ప్రయోజనాలపై మా సమీక్ష

Read More From Beauty