Fitness

జిమ్‌కి వెళ్లడం కుదరడం లేదా? అయితే ఈ వ్యాయామాలను ప్రయత్నించండి ..!

Soujanya Gangam  |  Jan 2, 2020
జిమ్‌కి వెళ్లడం కుదరడం లేదా? అయితే ఈ వ్యాయామాలను ప్రయత్నించండి ..!

7 Ways To Slim Without The Gym

మనలో చాలామంది అద్దంలో చూసుకున్నప్పుడల్లా.. కాస్తయినా బరువు తగ్గాలని (Weight Loss) భావించడం సహజం. కొత్త సంవత్సరం నుంచి ఫిట్‌గా ఉండాలని..  బరువు తగ్గాలని కూడా చాలామంది రిజల్యూషన్ పెట్టుకుంటారు. కానీ నోరూరించే ఆహారాన్ని చూస్తే మాత్రం మళ్లీ అన్నీ మర్చిపోతారు. బరువు పెరగడం సులభమే కానీ.. దాన్ని తగ్గించుకోవడం మాత్రం కష్టమే. అందుకే బరువు తగ్గడానికి జిమ్ మెంబర్ షిప్ తీసుకుంటారు.

కానీ అక్కడికి వెళ్లిన ఓ వారం లేదా పదిహేను రోజులకే.. ఆ వ్యాయామాలు చేయలేక మానేస్తుంటారు. ఒంటి నొప్పులను సాకుగా చూపించి జిమ్‌కి వెళ్లడానికే వెనుకాడతారు. అందుకే ఒకవేళ మీకు కూడా జిమ్‌కి వెళ్లడం ఇష్టం లేకపోతే.. బోర్ కొట్టకుండా కొన్ని వ్యాయామాలు చేసుకోవచ్చు. వీటి వల్ల సులువుగా బరువు తగ్గే వీలుంటుంది. ఒకవేళ బోర్ కొడితే.. ఇదే ప్రక్రియలో మరో యాక్టివిటీని చేర్చుకోవచ్చు. చిత్రమేంటంటే.. ప్రత్యేకమైన ఈ వ్యాయామాల వల్ల మీకు అసలు వ్యాయామం చేస్తున్న ఫీలింగే కలగదు. 

ఇలా చేస్తే జిమ్ అవ‌స‌రం లేకుండానే.. బ‌రువు త‌గ్గొచ్చు..

1. పరుగెత్తండి..

బరువు తగ్గేందుకు రన్నింగ్ అనేది అత్యంత సులువైన మార్గం. మీరు ఎక్కడున్నా సరే.. ప్రతి రోజూ ఉదయం స్పోర్ట్ షూస్ ధరించి, మంచి మ్యూజిక్ వింటూ అలా పరిగెడితే చాలు.. మీ బరువును మీరే సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే రోజూ కనీసం ఇరవై నిమిషాల పాటు నడిచేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మంచి ఫలితాలు పొందవచ్చు.

2. బ్రిస్క్ వాక్

పరిగెత్తడం మీ వల్ల కాకపోతే.. లేదా మీకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే నడవడానికి ప్రయత్నించండి. అరగంట పాటు వేగంగా నడవడం వల్ల.. మీరు బరువు తగ్గే వీలుంటుంది. మీ ఆరోగ్యానికి కూడా ఇది మంచిది.

3. యోగా

యోగా అనేది మనం ఎక్కడున్నా సులువుగా చేయగలిగే వ్యాయామం. దీనికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఇంట్లో లేదా పార్క్‌లో లేదా మరో చోటైనా సులువుగా దీనిని చేసే వీలుంటుంది. అయితే మ్యాట్ ఉంటే మంచిది. అప్పుడప్పుడు లేకపోయినా చేసేయొచ్చు. ఇది మీ కండరాలను స్ట్రెచ్ చేయడంతో పాటు.. మీ శరీరాన్ని టోన్ చేస్తుంది.

హార్మోన్లు మీ బ‌రువును పెంచేస్తున్నాయా? ఇలా చేసి చూడండి..

4. 7 మినిట్ వర్కవుట్

వ్యాయామం చేయడానికి చాలామందికి సమయం ఉండదు. ఇలాంటివారు కనీసం ఏడు నిమిషాల పాటు కష్టపడి.. ఈ 7 మినిట్ వర్కవుట్ చేయడం వల్ల కొవ్వు వేగంగా కరిగే వీలుంటుంది. ఇందులో భాగంగా తొలుత నిమిషం పాటు పుషప్స్.. ఆ తర్వాత మరో  నిమిషం పాటు ప్లాంక్ ట్రై చేయాలి. ఆ తర్వాత ఒక నిమిషం పాటు జంపింగ్ జాక్స్ చేశాక.. మరో నిమిషం సిటప్స్, ఇంకో రెండు నిమిషాల పాటు లెగ్ రైజెస్ చేసి.. ఆ తర్వాత స్ట్రెచింగ్ వ్యాయామం చేయాలి.

5. మెట్లెక్కండి..

మీ ఆఫీస్ నాలుగో అంతస్థులో ఉందా? రోజూ ఆఫీస్‌కి చేరుకోవడానికి మీరు లిఫ్ట్ వాడుతున్నారా? అయితే ఇప్పటి నుంచి లిఫ్ట్‌కి బదులుగా మెట్లను ఉపయోగించండి. దీనివల్ల ఎన్ని క్యాలరీలు ఖర్చవుతాయిలే..? అని అనుకోకండి. చిన్న చిన్న వ్యాయామాలే పెద్ద మార్పును తీసుకొస్తాయని గుర్తుంచుకోండి.

6. ఆటలతో..

ఆటలు ఆడడాన్ని మీ రొటీన్‌లో భాగం చేసుకుంటే చాలు.. చాలా వేగంగా.. మీకు తెలియకుండానే బరువు తగ్గే వీలుంటుంది. టెన్నిస్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్.. ఇలా ఏదో ఒక ఆటను మీ స్నేహితులతో కలిసి ఆడండి. అయితే ఇది వ్యాయామం మాదిరిగా అనిపించకుండా ఉండాలి. అప్పుడు క్యాలరీలు కూడా సులువుగా కరుగుతాయి.

7.సైకిల్ తొక్కండి.

చిన్నతనంలో మనలో చాలామందికి సైకిల్ తొక్కడం అంటే చాలా ఇష్టం. కానీ పెద్దయ్యే కొద్దీ ఈ అలవాటుకి స్వస్తి పలికేస్తాం. కానీ ఇప్పుడు మరోసారి దాన్ని ప్రారంభించండి. అప్పుడు క్యాలరీలు కరగడంతో పాటు ఎంతో ఉత్సాహం, ఆనందం కూడా మీ సొంతం అవుతుంది.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

Read More From Fitness