Celebrity gossip

భర్త కనిపించడం లేదని.. ఫేస్బుక్ పోస్టు పెట్టిన సినీ నటిపై నెటిజన్లు ఫైర్..!

Babu Koilada  |  Jul 5, 2019
భర్త కనిపించడం లేదని.. ఫేస్బుక్ పోస్టు పెట్టిన సినీ నటిపై నెటిజన్లు ఫైర్..!

అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమా చూశారా? అందులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటించిన నటి ఆశా శరత్ గుర్తున్నారా..? ఆమె పాపులర్ మలయాళ నటి కూడా. ఇటీవలే ఆమె ఓ ఫేస్బుక్ పోస్టు పెట్టారు. తన భర్త కనిపించడం లేదని.. ఎవరికైనా వివరాలు తెలిస్తే దగ్గర్లోని పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

అయితే తర్వాత అది ఫేక్ పోస్టు అని నెటిజన్లకు తెలిసింది. ఆశా శరత్ తన మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆ పోస్టు పెట్టారట. ఆ సినిమాలో తన క్యారెక్టర్‌ని ఉద్దేశించి పెట్టిన పోస్టు అది. ఆ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపారు. 

అయితే నిజం తెలిసిన తర్వాత నెటిజన్లు.. ఆశా శరత్ (Asha Sharath) పై ఒక లెక్కలో మండిపడ్డారు. తమ సమయాన్ని వేస్ట్ చేసే ఇలాంటి పోస్టులు మళ్లీ పెట్టవద్దని ఆమెను హెచ్చరించారు. ఆ పోస్టులోని విషయం నిజమేనని నమ్మి.. ఓ న్యాయవాది ఆ నటికి న్యాయం చేయడం కోసం మానవహక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించారట. కానీ పోస్టు అబద్ధం అని తెలిశాక చాలా మండిపడ్డారు.

నటనతోనే కాదు.. పాటతోనూ మెప్పించిన కథానాయికలు వీరే..!

ఇంతకీ విషయం ఏమిటంటే.. ‘ఎవిడే’ (Evide) అనే మలయాళ సినిమాలో ఆశా శరత్ ఇల్లు విడిచి వెళ్లిపోయిన భర్తను కనుగొనే ఓ మహిళ పాత్రను పోషిస్తున్నారు. అదే విషయాన్ని కాస్త క్రియేటివ్‌గా చెప్పేందుకు ఫేస్బుక్‌ను వాడారు.

కానీ ఆశా శరత్ భర్త నిజంగానే కనిపించడం లేదని భావించిన నెటిజన్లు తొలుత ఆమెపై పరామర్శలు కురిపించారు. మరికొందరైతే.. ఆమె భర్తను వెతికిపెడతామని హామీ కూడా ఇచ్చారు. కానీ ఆమె పెట్టిన పోస్టు అబద్ధం అని తెలిశాక మాత్రం తిట్ల వర్షం కురిపించారు. తమ భావోద్వేగాలతో ఎప్పుడూ ఆడుకోవద్దని హెచ్చరించారు.

అయితే పరిస్థితి చేయిదాటి పోతుందని గమనించిన ఆశా శరత్.. అది కేవలం ప్రమోషనల్ వీడియో మాత్రమే అని చెబుతూ.. పోస్టు టైటిల్ కూడా మార్చారు. కానీ నెటిజన్లు ఆమెను క్షమించలేదు. పలువురు ఆమెపై పోలీసు స్టేషనులో ఫిర్యాదు కూడా చేశారు. 

అందాల నాయిక.. అభినయ దీపిక (టాలీవుడ్ తార త్రిష బర్త్‌డే స్పెషల్)

గతంలో ప్రమోషనల్ జిమ్మిక్స్‌లో భాగంగా.. నటి శోభన నటించిన ‘ఇన్నాలే’ చిత్ర నిర్మాతలు కూడా అచ్చం ఇలాంటి ఫార్ములానే ప్రయోగించారు. వారైతే ఏకంగా వార్తా పత్రికలోనే ప్రకటన ఇచ్చారు. ఓ చిన్నారి గతం మరిచిపోయిందని.. అలాగే బాగా గాయపడిందని.. ఆమె వివరాలు కావాలంటే ఫలానా ఫోన్ నెంబరుకి కాల్ చేయాలని ఆ ప్రకటనలో తెలిపారు. చాలామంది ఆ ఫోన్ నెంబరుకి కాల్ చేసి.. అది సినిమా ప్రమోషన్ జిమ్మిక్ అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అప్పుడు కూడా అచ్చం ఇలాంటి ఘటనే ఫేస్బుక్ వేదికగా జరగడం గమనార్హం. 

ఇక ఆశా శరత్ నటించిన “ఎవిడే” చిత్ర విషయానికి వస్తే.. నిన్నే విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చాయి. కెకె రాజీవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఓ మిస్టరీ డ్రామా. సంగీత విద్వాంసుడైన జకారియా (మనోజ్ జయన్) ఓ రోజు ఊరులో కనిపించకుండా పోతారు. ఆయన భార్య జెస్సీ (ఆశా శరత్) తన భర్తను వెదికే క్రమంలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొందన్నదే ఈ చిత్ర కథాంశం. స్వతహాగా మలయాళ నటి అయిన ఆశా శరత్ పలు తమిళ, తెలుగు చిత్రాలలో కూడా నటించారు. 

మన వెండితెర ముద్దుల ‘రౌడీ’ల గురించి.. ఈ విశేషాలు మీకు తెలుసా?

చీకటి రాజ్యం, భాగమతి లాంటి తెలుగు చిత్రాలలో కూడా ఆశా శరత్ నటించారు. “దృశ్యం” చిత్రంలోని పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆశా శరత్‌కు మంచి పేరును తీసుకొచ్చింది. ఆ చిత్ర కన్నడ, మలయాళ వెర్షన్స్‌లో కూడా ఆమే నటించారు. ఆమె పోషించిన పాత్రను తెలుగు రీమేక్‌లో నదియా పోషించడం గమనార్హం. నటిగా కెరీర్ ప్రారంభించక ముందు ఆశా శరత్ మంచి నాట్యకారిణిగా కూడా పేరు గాంచారు. భరతనాట్యం, కూచిపూడి, మోహిని అట్టం, కథాకళి.. ఈ నాలుగు నాట్యరీతుల్లో కూడా ఆమె సిద్ధహస్తులు.ఆమె తల్లిగారైన కళామండలం సుమతి భారతదేశంలోని ప్రముఖ క్లాసిక్ డ్యాన్సర్లలో ఒకరు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Celebrity gossip