Celebrity Life

సినిమా కోసం.. శాకాహారిగా మారిపోయా : నయనతార

Babu Koilada  |  Nov 21, 2019
సినిమా కోసం.. శాకాహారిగా మారిపోయా : నయనతార

(Nayanthara to become vegetarian for “Mookuthi Amman” Film)

‘శ్రీరామ రాజ్యం’ చిత్రంలో బాపు దర్శకత్వంలో సీతాదేవి పాత్రలో నటించి మెప్పించిన నయనతార.. ఇటీవలే ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవి సరసన కథానాయకుడి సతీమణిగా నటించి అందరినీ మెప్పించింది. ఈ మధ్యకాలంలో ‘మూకుత్తి అమ్మన్’ అనే ఓ తమిళ చిత్రానికి కూడా  సైన్ చేసింది ఈ అమ్మడు. ఆర్ జే బాలాజీ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఓ భక్తి రస ప్రధాన చిత్రం కావడంతో.. ఈ సినిమా కోసం శాకాహారిగా మారిపోయిందట నయనతార. అంతే కాదు.. దేవీ దీక్షలో కూడా పాల్గొంటుందట. 

న‌య‌న‌తార ఒక్క‌రే కాదు.. వీరంతా డ్యుయెల్‌ రోల్స్‌లో అద‌ర‌గొట్టిన వారే..!

కన్యాకుమారి ప్రాంతంలో  కొలువైన భవాని అమ్మవారికి మరో పేరే ‘మూకుత్తి అమ్మన్’. ఆ అమ్మవారి మహాత్యాన్ని కథాంశంగా ఎంచుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. అలాగే యూనిట్ మొత్తం ఎంతో నిష్టతో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుండడం విశేషం. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆర్ జే బాలాజీ తమిళంలో ఎన్నో సినిమాలలో నటించారు. దేవీ, స్పైడర్, ఇండియన్ 2 చిత్రాలు అందులో ప్రముఖమైనవి. బాలాజీ, నయనతార ఇండస్ట్రీలో మంచి స్నేహితులు కూడా. నయన్‌ను బాలాజీ ఎప్పుడూ ‘తంగచ్చి’ అని పిలుస్తుంటారట. అంటే చిట్టి చెల్లెలు అని తెలుగులో అర్థం. 

మన అభి’నయన’తార నటించిన.. టాప్ 5 మేటి చిత్రాలు ఇవే..!

ఇక నయనతార విషయానికి వస్తే.. ఇటీవలే అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘బిగిల్’ చిత్రంలో ఆమె నటించింది. ఇదే చిత్రం ‘విజిల్’ పేరుతో తెలుగులో డబ్ చేయబడి.. ఇక్కడ కూడా హిట్ చిత్రంగా నిలిచింది. అలాగే రజనీకాంత్ చిత్రం ‘దర్బార్‌’లోనూ.. అలాగే మిలింద్ రావ్ దర్శకత్వంలో వస్తున్నా ‘నేత్రికన్’ చిత్రంలో కూడా నటిస్తోంది నయన్. ఈ సంవత్సరం తమిళ, తెలుగు భాషలలో కలిపి 7 చిత్రాలలో నటించింది నయన్. అందులో విశ్వాసం, ఐరా, లవ్ యాక్షన్ డ్రామా, సైరా చిత్రాలు ప్రముఖమైనవి. ఇంగ్లీష్ చిత్రం ‘హుష్‌’కి రీమేక్ అయిన తమిళ చిత్రం ‘కొలైత్తూర్ కాలం’లో కూడా నటించింది నయన్.

 

 

ప్రస్తుతం నయనతార ఒక్కో చిత్రానికి రూ.6 కోట్ల రూపాయల వరకూ పారితోషికం తీసుకుంటుందని వినికిడి. అలాగే వర్థమాన నటులతో పాటు.. అగ్ర హీరోలతోనూ సినిమాలు చేయడానికి ఆమె సిద్ధంగా ఉంటోంది. ఇటీవలి కాలంలో వరుసగా ఆమెకు సినిమా ఆఫర్లు రావడంతో బిజీగా మారిన నయనతార.. అదే కారణంతో పారితోషికం పెంచడానికి కూడా సిద్ధమైందని కూడా పలు వెబ్ సైట్లు వార్తలు రాశాయి. 2003లో ‘మనసినక్కరే’ అనే మలయాళ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన నయనతార.. ఆ తర్వాత తమిళ, తెలుగు చిత్రాలలో కూడా నటించసాగింది. 

నయనతార వివాహానికి.. ముహుర్తం ఖరారైందా..?

తెలుగులో దుబాయ్ శీను, లక్ష్మీ, అదుర్స్, సింహా, శ్రీ రామరాజ్యం, అనామిక, బాబు బంగారం, సైరా మొదలైన సినిమాలు నయనతారకు మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే తమిళం నుండి తెలుగులోకి డబ్ చేయబడిన రాజా రాణి, అంజలి సీబీఐ, మయూరి, డోరా, కర్తవ్యం చిత్రాలు ఇక్కడ కూడా బాగానే ఆడాయి. కనుక బయ్యర్లకు కూడా నయన్ నటించిన చిత్రమంటే.. మినిమమ్ గ్యారెంటీ సినిమా అన్న భావనే ఉండడంతో.. తన ఇతర భాషా చిత్రాలకు కూడా తెలుగులో మంచి మార్కెట్టే ఉంటోంది. మరి మూకుత్తి అమ్మన్ చిత్రాన్ని కూడా.. తెలుగులో డబ్ చేస్తారో లేదో చూడాలి. ‘

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.     

Read More From Celebrity Life