Bigg Boss

కృష్ణవంశీ – రమ్యకృష్ణల ప్రేమ చిగురించడానికి.. కారణమైన పాటేమిటో మీకు తెలుసా?

Sandeep Thatla  |  Aug 26, 2019
కృష్ణవంశీ – రమ్యకృష్ణల ప్రేమ చిగురించడానికి.. కారణమైన పాటేమిటో మీకు తెలుసా?

గ్లామర్ లేదా అభినయం.. ఏదైనా సరే.. రెండింటిని సమాన స్థాయిలో ప్రదర్శించగలిగే అతికొద్దిమంది నటీమణులలో ముందు వరుసలో ఉండే కథానాయిక రమ్యకృష్ణ. అలాగే తాను నమ్మిన కథ కోసం ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని నిలబడగలిగే వ్యక్తిగా..  మంచి చిత్రాలు తీసిన దర్శకుడిగా కృష్ణవంశీ తెలుగు సినీ అభిమానులకి సుపరిచితుడు.

సినిమా స్టోరీని తలపించేలా.. దర్శకుడు “పూరి జగన్నాధ్ – లావణ్య”ల లవ్ స్టోరీ..!

ఇటువంటి రెండు దృఢమైన మనస్తత్వాలు కలిగిన ఈ ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా మారి… ఆ తర్వాత ప్రేమికులుగా ప్రయాణించి… ప్రస్తుతం దంపతులుగా ఉన్న రమ్యకృష్ణ-కృష్ణవంశీల లవ్ స్టోరీ (Love Story) ముచ్చట్లు మనమూ తెలుసుకుందాం.

చిత్రమేమిటంటే.. కృష్ణవంశీ (Krishna Vamsi) – రమ్యకృష్ణల (Ramya Krishna) ప్రేమకథని పోలి ఉన్న ఒక ట్రాక్.. మనకు ఈ మధ్యనే విడుదలైన ‘బ్రోచేవారెవరురా’ చిత్రంలో కనిపిస్తుంది. అలాగే వీరి మధ్య ఒక అనుబంధానికి బీజం వేసింది ఓ సినిమా పాట అనే విషయం మీకు తెలుసా..?

రమ్యకృష్ణ-కృష్ణవంశీల ప్రేమకథలోకి వెళితే…

ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొని.. దర్శకుడిగా తన తొలి సినిమా  “గులాబి”తో టాలీవుడ్‌లో ఓ సంచలనమే నమోదు చేశాడు కృష్ణవంశీ. ఆ చిత్రానికి సంబంధించి ఆయన స్వయంగా తీసిన – “మేఘాలలో తేలిపొమ్మనది..” పాట ఎంత పెద్ద హిట్టో మనకు తెలియంది కాదు.

ఆ పాట మొత్తాన్ని కూడా అరకు ఘాట్ రోడ్డులో బైక్ పై ప్రయాణం చేస్తున్న హీరో జేడీ చక్రవర్తి – హీరోయిన్ మహేశ్వరిల పైన తీసాడు కృష్ణవంశీ. ఈ పాట చిత్రీకరణ చేసిన విధానంతో కృష్ణవంశీ పేరు ప్రేక్షకుల్లోనే కాకుండా.. చిత్రపరిశ్రమలో కూడా మార్మోగిపోయింది. అతని టాలెంట్ తనకు మరిన్ని అవకాశాలను అందించింది.

అలా కృష్ణవంశీ కెరీర్‌‌కి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి పెట్టిన.. ఆ పాటని హీరోయిన్ రమ్యకృష్ణ చూడడం జరిగిందట. చూశాక ఒక షాక్‌కు, ఆశ్చర్యానికి ఆమె గురైందట. అసలు ఒక పాటని ఇలా తీయడమే చాలా సాహసం..  అందులోనూ తెలుగులో అయితే అది ఇంకా చాలా కష్టం అని ఆమె భావించింది.  ఇంత అద్భుతంగా ఆ పాటను కృష్ణవంశీ  ఎలా తీయగలిగారు.. అసలు ఈ పాట తీసిన దర్శకుడు ఎవరు? అని తనను గురించి ఆమె ఆరా తీయడం జరిగిందట. అలా కృష్ణవంశీ గురించి మొదటిసారి రమ్యకృష్ణ తెలుసుకున్నారు.

కొన్ని రోజులు గడిచాక, ఏదో వేరే సినిమా పని మీద.. ఒక షూటింగ్‌కు వెళ్లిన సందర్భంలో.. అక్కడ స్టార్ కమెడియన్ బ్రహ్మానందంతో  మాట్లాడుతుండగా.. అప్పుడు కృష్ణవంశీ కూడా అక్కడికి వచ్చారట. అప్పుడు తాను చూసిన పాట గుర్తుకురావడంతో.. వెంటనే తనని కృష్ణవంశీకి పరిచయం చేయాలని ఆమె బ్రహ్మానందంని అడగడంతో.. తొలిసారి రమ్యకృష్ణ – కృష్ణవంశీలు కలవడం జరిగింది.

ముందు “గులాబీ” చిత్రాన్ని పొగడడంతో రమ్యకృష్ణ  మొదలుపెట్టి.. ఆ తర్వాత కృష్ణవంశీ గురించి పూర్తిగా తెలుసుకుంది ఆమె.  మెల్లమెల్లగా ఇద్దరి మధ్య ఒక స్నేహం మొదలైంది. అలా స్నేహితులుగా మారిన కొద్ది రోజులకు.. ఇరువురు ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నట్టుగా గుర్తించారు. తర్వాత వీరి ప్రేమాయణం ఇండస్ట్రీ మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. వీరి ప్రేమ మీద పలు పుకార్లు కూడా వచ్చాయి.

బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?

అయితే తమపై వస్తున్న వార్తలను.. ఏమాత్రం పట్టించుకోకుండా తమ ప్రేమని కొనసాగించారు ఈ జంట. అయినా వీరి మధ్య జనాలకు ఎన్నో అనుమానాలుండేవి.  తర్వాత అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ..  ఒక అత్యద్భుతమైన షాక్ ఇచ్చింది రమ్యకృష్ణ. అదే కృష్ణవంశీతో తన పెళ్లి.

ఈ ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ గుడిలో వివాహం చేసుకున్నారు. వీరు పెళ్లి చేసుకున్న తరువాత.. తమ ఫోటోలను మీడియాకి స్వయంగా పంపించారు. తద్వారా వీరి పెళ్లి వార్త అందరికి తెలిసింది. అయితే సాధారణంగా పెళ్లయ్యాక.. యాక్టింగ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేసే హీరోయిన్స్ జాబితాలో రమ్యకృష్ణ ఉంటుంది అని అందరు ఊహించారు.

అయితే రమ్యకృష్ణ తనకు నటనపై ఉన్న ఆసక్తిని వదులుకోలేదు. పైగా ఆమె చేసిన “బాహుబలి” చిత్రంలోని “శివగామి”  పాత్రకి ఎన్నో అవార్డులు.. రివార్డులు వచ్చాయి.  ఈ జంటకు ఒక మగబిడ్డ కూడా జన్మించాడు. తన పేరు – రిత్విక్ వంశీ.

ప్రస్తుతం నటిగా అటు తమిళ సీరియల్స్, ఇటు తెలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు రమ్యకృష్ణ. అలాగే కృష్ణవంశీ కూడా మంచి కథలను రాసే పనిలో ఉన్నారు.  

తను ఓ దర్శకుడు & ఆమె ఓ నటి.. అయినా కూడా  ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుని.. పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదు.. ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగడం అనేది.. ఇప్పుడున్న సమాజంలో ఎంతోమంది ప్రేమికులు, భార్యాభర్తలకి స్ఫూర్తిదాయకమే అని చెప్పవచ్చు. 

 ఒక్కసారి మేకప్ వేసుకుంటే… అది జీవితాంతం మనల్ని వదిలిపెట్టదు (‘కాజోల్’ బర్త్ డే స్పెషల్)

 

Read More From Bigg Boss