
ట్రోలింగ్.. ఇటీవలి కాలంలో ఇది పరిధులు దాటుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఈ ట్రోలింగ్ ఎక్కువగా ఉంటోంది. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రోల్ చేస్తుంటారు. సెలబ్రిటీలే కాదు.. సెలబ్రిటీల పిల్లలు సైతం ఆన్ లైన్‌లో ట్రోలింగ్‌కు గురవుతున్నారు.
తాజాగా సెలబ్రిటీ మామ్ ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai), ఆమె కూతురు ఆరాధ్య (Aaradhya) ఈ ట్రోలింగ్‌కు గురయ్యారు. అది కూడా ఐశ్వర్య తన ముద్దుల కూతురు ఆరాధ్య చేయి పట్టుకొన్నందుకు. చాలా సిల్లీగా అనిపిస్తోంది కదా?
ఇటీవలే బచ్చన్ కుటుంబం ఫ్యామిలీ డిన్నర్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఐశ్వర్య ఆరాధ్య బచ్చన్ చేతిని గట్టిగా పట్టుకొని నడిపిస్తూ తీసుకెళ్లింది. ఆ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. అది కూడా ట్రోలింగ్ ద్వారా. సాధారణంగా బయటకు వెళ్లినప్పుడు ఏ తల్లి అయినా తన పిల్లల చేతిని పట్టుకొనే ఉంటుంది. ఒక రకంగా అలా చేయడం మంచిది కూడా. అయితే కొంతమంది నెటిజన్లకు ఇందులో ఏం తప్పు కనిపించిందో తెలియదు కానీ.. ఆమెను దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
కొందరు ఆరాధ్య విషయంలో ఐశ్వర్య ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉందని అంటే.. ఇంకొందరు ఆరాధ్య స్వాతంత్య్రాన్ని ఐశ్వర్య హరిస్తోందని కామెంట్ చేశారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి ‘ఆరాధ్య బొడ్డు తాడు ఇప్పటికైనా కట్ చేయండి’ అని వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. ‘ఐష్.. ఆరాధ్య చేయి విడిచిపెట్టు.. తనని ఫ్రీగా ఉండనివ్వు’ అని మరికొందరు అన్నారు.
ఆరాధ్య విషయంలో మదర్ ట్రోలింగ్ ఎదుర్కోవడం ఐశ్వర్యకు కొత్తేమీ కాదు. గతంలో మదర్స్ డే సందర్భంలో పోస్ట్ చేసిన ఫొటో విషయంలోనూ ఇంతకంటే దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఆరాధ్య పెదవులపై ముద్దు పెట్టిన ఆ ఫొటోనైతే కొందరు ‘సెక్సువల్ ఎబ్యూజ్’ కింద జమకట్టారు.
తాజాగా జరుగుతున్న ట్రోలింగ్ విషయంలో ఐశ్వర్య ట్రోలర్స్ దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెప్పింది. ‘ఆరాధ్యపై నేను చేయి వేస్తే.. అందరూ తనను ఎప్పుడూ అంటి పెట్టుకొనే ఉంటానని అంటున్నారు. ఇలాంటి మాటల వల్ల నన్ను నేను మార్చుకోను. ఆరాధ్యపై చూపించే శ్రద్ధను ఏమాత్రం తగ్గించను. ఈ విషయంలో ఎవరు ఏమన్నా నేనిలాగే ఉంటాను. ఎందుకంటే ఆరాధ్య నా కూతురు’ అని కాస్త గట్టిగానే హెచ్చరించింది.
‘ఫొటోలు తీయడం కోసం వెనక్కి నడిచే ఫొటోగ్రాఫర్స్‌ని చూసినా.. వారిలో ఎవరైనా పడిపోయినా.. తల్లిగా నాకు చాలా భయం వేస్తుంది. అందుకే ఆరాధ్య విషయంలో నేను చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటాను. ఎలాగైనా సరే ఫొటోగ్రాఫర్స్ ఫొటో తీసుకొనే వెళతారు. అది వారి జీవనోపాధి.’
ఐశ్వర్య తన కూతురి విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తుంది. జాగ్రత్తగా ఉంటుంది. ఐశ్వర్య అనే కాదు ఏ తల్లైనా తన బిడ్డల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఈ విషయంలో ఇతరుల జోక్యం అనవసరం. తల్లిగా ఏం చేయాలో ఐశ్వర్యకు బాగా తెలుసు. కాబట్టి ట్రోలర్స్.. ఇకనైనా మీ పని మీరు చూసుకోవడం బెటర్.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.
ఇవి కూడా చదవండి:
నల్లగా, లావుగా ఉన్నావు.. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అనేవారు: సోనమ్
నాతో సహజీవనం చేయడం కోసం.. సైఫ్ మా అమ్మని పర్మిషన్ అడిగాడు: కరీనా
ఇప్పుడు ఆ భయం.. మహిళలను వేధించేవారిలో కనిపిస్తోంది: కృతి సనన్