Bigg Boss

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలిచి అలీ రెజా టాప్ 5 కి చేరుకుంటాడా?

Sandeep Thatla  |  Oct 22, 2019
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలిచి అలీ రెజా టాప్ 5 కి చేరుకుంటాడా?

బిగ్ బాస్ తెలుగు (bigg boss telugu) సీజన్ 3కి సంబంధించి కీలక ఘట్టానికి చేరుకున్నాం. ఎందుకంటే ఈవారం నామినేషన్స్ లో లేనివారు నేరుగా టాప్ 5 గా ఫైనల్ కి చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ వారం నామినేషన్స్ టాస్క్ – ‘బ్యాటరీ ఉంటే నిండుగా జరుపుకోండి పండుగ’ ని నిర్వహిస్తున్నారు బిగ్ బాస్. ఇందులో భాగంగా బ్యాటరీ ఎక్కువగా ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే టాప్ 5 కి నేరుగా చేరుకుంటారని.. మిగిలినవారందరూ నామినేషన్స్ లో ఉంటారని చెప్పడం విశేషం. అందుకే టాప్ 5కి నేరుగా వెళ్లేందుకు ఇంటిసభ్యులంతా కూడా వారి శక్తిమేరకు టాస్క్ లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్ & శ్రీముఖి ల మధ్య పెరుగుతున్న వైరం

నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ టాస్క్ కి సంబంధించి మొదటి ఫేజ్ ముగిసింది. ఆ మొదటి ఫేజ్ లో అలీ రెజా (ali reza) అందరికన్నా ఎక్కువ పాయింట్స్ తో నామినేషన్స్ టాస్క్ లో ముందున్నాడు. అతను గనుక ఈ టాస్క్ లో ఇంకొకరి పైన విజయం సాధిస్తే ఈ టాస్క్ లో విజయం సాధిస్తాడు. ఈ తరుణంలో అతని పోటీ బాబా భాస్కర్ (baba bhaskar) తో జరగనుంది. దీనికి సంబందించిన టాస్క్ ఏంటంటే.. మట్టి నింపిన ఒక పెద్ద బాక్స్ లో ఈ ఇద్దరికి కొన్ని పూల మొక్కలు ఇవ్వడం జరిగింది. టాస్క్ బజార్ మోగే సమయంలోగా ఎవరు ఎక్కువ మొక్కలని అందులో ఉంచగలిగితే వారు విజేతగా నిలుస్తారు. అయితే ఈ టాస్క్ లో మొక్కలు నాటడం, వాటిని కాపాడుకోవడంతో పాటు ఎదుటివారి మొక్కలను పీకివేయడం,  వారు మొక్కలు నాటకుండా కూడా చేయవచ్చు.

దీనికి సంబంధించి ప్రసారమైన ప్రోమోలో ఈ ఇద్దరు చాలా తీవ్రంగా ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఈ టాస్క్ ని ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా అలీ రెజా, బాబా భాస్కర్ పై చాలా అగ్రెసివ్ గా పడడం కనిపిస్తోంది. ఇంటి సభ్యులు వారిస్తున్నా వినకుండా చేయడంతో టాస్క్ హింసాత్మకంగా మారినట్లు కనిపిస్తోంది. మరి,  చివరగా ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఈ రాత్రికి తెలుస్తుంది.

ఇదిలావుండగా ఈ వారం ఇంటిసభ్యులకి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కాస్త వైవిధ్యంగాను అదే సమయంలో కొంచెం క్లిష్టంగానూ ఉంది. ఒకసారి ఈ నామినేషన్స్ టాస్క్ గురించి చూస్తే, ముందుగా ఇంటిసభ్యులందరికి ఆరు రంగుల్లో ఉన్న క్యూబ్స్ని ఎంపిక చేసుకొమ్మని చెప్పడం జరిగింది. అలా ఎంపిక చేసుకున్న తరువాత ఆ ప్లేట్స్ వెనుక ఎంతైతే పర్సెంటేజ్ ఉంటుందో అంత మొత్తంలో బ్యాటరీ ని సదరు ఇంటిసభ్యుడికి ఇవ్వడం జరుగుతుంది.

వీటికి సంబంధించి బ్యాటరీ పర్సెంటేజ్ లని బయట ఏర్పాటు చేసిన బ్యాటరీ మానిటర్స్ లో చూపెట్టడం జరిగింది. ఇక ఈ టాస్క్ మొత్తం ఆరు చిన్న టాస్కులలో పూర్తికానుంది. అయితే ప్రతి ఒక్క టాస్క్ మొదలయ్యే ముంది ఒక బజర్ వస్తుంది. ఆ సమయంలో ముందుగా బిగ్ బాస్ ఏర్పాటు చేసిన గంటలని మోగిస్తారో వారు టాస్క్ ఆడటానికి ఎంపికవుతారు.

Bigg Boss Telugu 3: కుండ బద్దలు కొట్టి నిజాలు చెప్పిన.. బిగ్ బాస్ ఇంటి సభ్యులు ..!

అలా గంట మోగించిన ఇద్దరు వ్యక్తులు కలిసి టాస్క్ ఆడతారు. వారు ఒకవేళ ఓడిపోతే ఉన్న పర్సెంటేజ్ లో ఒక 10 శాతం తగ్గుతుంది. గెలిస్తే పది శాతం పెరుగుతుంది. ఇలా ఈ మొత్తం నామినేషన్స్ టాస్క్ ముగిసే లోపు ఎవరి వద్ద ఎక్కువ బ్యాటరీ పర్సెంటేజ్ ఉంటే వారు నేరుగా టాప్ 5లోకి వెళ్లిపోవడం జరుగుతుంది. మిగిలిన అయిదుగురు సభ్యులు ఈవారం నామినేషన్స్ లోకి వెళతారు.

మొదటి మూడు టాస్కులలో మాత్రం ఇంటిలో ఉన్న ఆరుగురికి సమాన అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బాబా భాస్కర్ & అలీ రెజా మధ్యన జరిగే టాస్క్ నుండి మాత్రం ఎవరు గంట కొడితే వారే టాస్క్ ఆడటానికి అవకాశం ఉంటుంది అని తెలుస్తోంది. 

ఇప్పటికైతే అలీ రెజా ఆ తర్వాత రాహుల్ కి  మాత్రమే టాప్ 5కి నేరుగా చేరుకునేందుకు ఎక్కువ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని వేరే వాళ్ళు టాప్ 5కి వెళతారో లేదో అన్నది  ఈ రాత్రికి తెలుస్తుంది.

రాహుల్ సిప్లిగంజ్ ని సున్నితంగా మందలించిన శ్రీముఖి తల్లి లత!

 

Read More From Bigg Boss