Life

కొత్తగా పెళ్లైన దంపతులకు.. చికాకు తెప్పించే ప్రశ్నలివే..!

Lakshmi Sudha  |  Apr 22, 2019
కొత్తగా పెళ్లైన దంపతులకు.. చికాకు తెప్పించే ప్రశ్నలివే..!

పెళ్లయిన తొలినాళ్లలో అమ్మాయిలు..  నూతనోత్సాహంతో ఉన్నప్పటికీ కొన్ని ఊహించని పరిస్థితులు, ప్రశ్నలు (questions) ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే- ఇవి వారిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి.

భార్యాభర్తలు ఇద్దరూ ఒకచోట కనిపిస్తే చాలు.. వారిద్దరినీ వేళాకోళమాడుతుంటారు. ఆటపట్టిస్తుంటారు.

ఇవి మనకు సరదాగానే ఉండవచ్చు. కానీ వారికి మాత్రం చికాకు కలిగించవచ్చు. ఆ క్షణం పైకి నవ్వినప్పటికీ.. లోలోపల చాలా ఫీలవుతుంటారు.

అసలు కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను‌ ఇబ్బంది పెట్టే ఆ ప్రశ్నలేంటి? ఆ ప్రశ్నలకు వారి మనసులో ఏమనుకొంటారు.. ఇలాంటి విషయాలపై మనమూ ఓ లుక్కేద్దాం..!

 

1. శుభవార్త ఎప్పుడు చెబుతావేంటి?

దేవుడా.. నాకు నిన్ననే కదా పెళ్లి అయింది. అప్పుడే ఈ ప్రశ్నేంటి?

2. మీ అత్తింట్లో ఉంటావా? వేరే కాపురం పెట్టేస్తావా?

నిజం చెప్పండి. ఇది మీకవసరమా?

3. ఇంకా హనీమూన్‌కి వెళ్లలేదా?

మీరు మాతో పాటు రారు కదా.. మీకెందుకంత అత్యుత్సాహం.

 

4. ఈ రోజు మీ తొలిరాత్రి కదా..!(కన్ను కొడుతూ)

హలో ఆంటీస్.. మీ ఫస్ట్ నైట్‌కి మీరున్నంత ఎక్సైటింగ్‌గా మేం ఉండకపోవచ్చు. మా భయాలు మాకుంటాయి. మీరెంత నర్మగర్భంగా చెప్పినప్పటికీ మీ మాటల్లోని అంతరార్థం మాకు తెలుసు.

5. నువ్వసలు కొత్త పెళ్లికూతురిలానే కనిపించడం లేదు..

అస్తమానూ అలంకరించుకొని ఉండటానికి నేనేమైనా గంగిరెద్దునా?

6. ఇక నుంచి ఫ్రెండ్స్‌తో గడపడానికి నీకసలు సమయం ఉండదు.

నేను పెళ్లే కదా చేసుకొన్నాను. జైలుకి గాని వెళ్లలేదు కదా..

7. పెళ్లి అయిపోయింది కదా.. ఇంకా పనిచేస్తావా?

ఇదే ప్రశ్న మా ఆయన్ని ఎందుకు అడగరో..!!?

8. ఇక నుంచి రోజూ నీకు శృంగారమే..

పెళ్లి చేసుకొంటే సెక్స్ తప్ప మరో పనేమీ చేయరా? రోజూ చేయాల్సిన పనులు ఇంకా ఉంటాయి కదా..

9. మీ ఆయనకు ఏం వండుతున్నావేంటి?

నాకు నీళ్లు కాయడం కూడా రాదు. ఇంక వంటేం చేస్తాను?

GIFs: Giphy, Tumblr

ఇవి కూడా చదవండి

పెళ్లయిన కొత్తలో.. అమ్మాయికి ఎదురయ్యే ప్రశ్నలు ఇవే..!

ఈ తొలిరేయి జ్ఞాప‌కాలు.. కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఉంటాయి..

పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఉండే.. ప్రత్యేకత ఏమిటంటే..?

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

Read More From Life