Bigg Boss

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : అలీ రెజా మోసం చేశాడని.. కంటితడి పెట్టిన బాబా భాస్కర్ ..!

Sandeep Thatla  |  Aug 19, 2019
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 : అలీ రెజా మోసం చేశాడని.. కంటితడి పెట్టిన బాబా భాస్కర్ ..!

“బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3” లో (Bigg Boss Telugu 3) అయిదవ వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. అయితే ఈ వారం నామినేషన్స్ కాస్త ఘాటుగా.. అదే సమయంలో ఇంకాస్త క్లిష్టంగా కూడా సాగాయి. ఇక ఆ నామినేషన్స్ ప్రక్రియ ఇంట్లో కొందరి సభ్యుల మధ్య దూరాన్ని పెంచగా.. మరికొంతమంది మధ్య కొత్తగా విభేదాలను కూడా కలిగించింది. 

బిగ్‌బాస్ తెలుగు యాంకర్ నాగార్జున చేతిలో ఉన్న.. పండు (కోతి) బొమ్మ మీకు కావాలా?

ముందుగా ఈ వారం నామినేషన్ ప్రక్రియని పరిశీలిస్తే.. తొలుత నలుగురు సభ్యుల పేర్లను నామినేషన్‌కి ప్రతిపాదించమని హౌస్ కెప్టెన్ అలీకి బిగ్‌బాస్ తెలిపారు. ఆ తరువాత నామినేషన్ ప్రక్రియ చివరిలో.. ఆ నలుగురి నుండి.. ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశాన్ని తనకు బిగ్ బాస్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఈ తరుణంలో అలీ రెజా … హిమజ, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, బాబ్ భాస్కర్‌ల (Baba Bhaskar) పేర్లను ప్రతిపాదించాడు. బిగ్‌బాస్ ఆజ్ఞానుసారం ఈ నలుగురు అలీ రెజాని కన్విన్స్ చేసి.. తమ పేర్లు చెప్పకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. తాము ఇంట్లో ఉండడం ఎంత అవసరమో తెలపాలి. ఈ క్రమంలో బాబా భాస్కర్ “తాను ఇంటిలో ఉంటే ఏం చేస్తాను ?” అనే విషయాన్ని చాలా సవివరంగా చెప్పారు.

ఆయనతో పాటు మిగతావారు కూడా తమకు తోచిన రీతిలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయినా బాబా భాస్కర్ పేరుని నామినేషన్స్‌లోకి నేరుగా పంపించాలని..  అలీ బిగ్‌బాస్‌కి చెప్పడంతో ఇంటి సభ్యులందరూ షాక్‌కి గురయ్యారు.

అయితే ఇది జరగడానికి కొద్ది సేపటి ముందు.. “నీకు నిజంగా దమ్ముంటే.. నన్ను ఎలిమినేషన్ నుండి బయటకి తీసుకురా” అని అలీ రెజాను బాబా భాస్కర్ సరదాగా ఆట పట్టించడం జరిగింది. ఆ సరదా అంశాన్ని కాస్త వేరేలా అర్ధం చేసుకుని.. అదే సమయంలో ఇతరుల మూడ్‌తో సంబంధం లేకుండా జోక్స్ వేయడం కూడా మంచిది కాదని బాబా భాస్కర్‌కి హితవు పలుకుతూ.. ఆయనను నామినేట్ చేశాడు అలీ రెజా (Ali Reza).

బిగ్‌బాస్ తెలుగు 3 : ఇంటి సభ్యుల కోసం.. చిత్ర విచిత్రమైన అవార్డుల హంగామా..!

ఈ ఊహించని పరిణామానికి ఏమి చేయాలో అర్ధమవ్వక… శ్రీముఖి ముందు కంటతడి పెట్టుకున్నారు బాబా భాస్కర్. తనతో “నామినేట్ చేయను” అని చెప్పి.. అలీ ఇలా మోసం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అని బాబా భాస్కర్ వాపోవడం చూసేవారిని కదిలించింది.

ఇదిలావుండగా… నామినేషన్స్‌ ప్రక్రియలో భాగంగా బిగ్‌బాస్ ఇంటిని విడిచిపెట్టి వెళ్లేందుకుగాను.. ఎక్కువగా ఓట్లు పొందిన వ్యక్తి రాహుల్ సిప్లిగంజ్. మొత్తంగా 8 ఓట్లు ఆయనకి వ్యతిరేకంగా రావడం జరిగింది. ఆయన తరువాతి స్థానాల్లో ఆషు రెడ్డి & హిమజలు 4 ఓట్లతో నామినేషన్‌లో ఉండగా, చెరొక 2 ఓట్లు పొంది మహేష్ విట్టా, పునర్నవిలు కూడా ఈ వారం నామినేషన్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. ఇక  గతవారం బిగ్ బాస్ చేత శిక్ష వేయించుకున్న శివ జ్యోతితో పాటుగా.. ఈ వారం ఇంటి కెప్టెన్ అలీ చేత నేరుగా నామినేట్ చేయబడిన వ్యక్తిగా బాబా భాస్కర్ కూడా నామినేషన్‌లో ఉన్నారు.

ఇలా మొత్తం ఏడుగురు సభ్యులు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఇంటిని కచ్చితంగా విడిచి పెట్టి వెళతారు. ఇక నామినేషన్స్ జరిగే సమయంలో .. పునర్నవి, హిమజల మధ్య.. అలాగే ఆషు రెడ్డి & హిమజల మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఒకరి ప్రవర్తనని మరొకరు తప్పుబడుతూ.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.

ఇక చివరగా చెప్పేదేమిటంటే… మొన్న నాగార్జున ఇంటి సభ్యులతో మాట్లాడుతూ “తమ మాస్క్‌లని తీసేసి గేమ్ ఆడాలని చెప్పగా”… నిన్నటి ఎపిసోడ్ చూస్తే.. ఆ ప్రక్రియ మొదలైనట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఎవరు కూడా ఊహించని విధంగా బాబా భాస్కర్‌ని నేరుగా నామినేట్ చేయడం.. అలాగే ఇంటి సభ్యుల మధ్య కూడా విభేదాలు తారా స్థాయికి చేరుకోవడం వంటివి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే అంటారు ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ ఏదైనా జరగచ్చు.

బిగ్‌బాస్ తెలుగు: రాహుల్ తప్ప.. అందరూ ఆమె అన్నదమ్ములేనట..!

Read More From Bigg Boss