మన జుట్టు ఎంత ఆరోగ్యంగా ఉన్నా.. మనమెంత గొప్ప హెయిర్ కేర్ ఉత్పత్తులు ఉపయోగిస్తున్నా.. అప్పుడప్పుడూ హెయిర్ స్టైలింగ్ టూల్స్ ఉపయోగించాల్సి వస్తుంది. సాధారణంగా బ్లో డ్రయర్, హెయిర్ స్ట్రెయిటనర్, కర్లర్.. వంటివి ఎక్కువగా ఉపయోగిస్తాం. వీటిని ఎక్కువ సార్లు ఉపయోగించడం వల్ల జుట్టు(hair) అందం,ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. దీనికి కారణం హెయిర్ స్టైలింగ్ టూల్స్ నుంచి వెలువడే ఉష్ణమే. ఇది వెంట్రుకల్లో ఉన్న తేమని ఆవిరయ్యేలా చేస్తుంది. దీనివల్ల హెయిర్ స్ట్రక్చర్, వాటి సహజత్వం దెబ్బ తింటుంది. ఫలితంగా జుట్టు పొడిగా, నిర్జీవంగా తయారవుతుంది. అలాగని స్టైలింగ్ టూల్స్ వాడకుండా ఉండటం సాధ్యం కాదు కదా. వాటిని ఉపయోగించడం ఎలా? వీటి నుంచి వెలువడే వేడి నుంచి జుట్టును కాపాడుకునే టెక్నిక్ తెలుసుకోవడమే. దీనికోసం ఉద్దేశించనవే హీట్ ప్రొటెక్టెంట్(heat protectant) ఉత్పత్తులు. అసలు వీటి వల్ల ఉపయోగమేంటి? వాటిని ఎలా వాడాలి? వాటిని ఉపయోగించడం వల్ల వెంట్రుకలకు ఎంత మేర మేలు చేస్తాయి? తదితర విషయాలన్నీ తెలుసుకుందాం.
Table of Contents
- హీట్ ప్రొటెక్టెంట్స్ అంటే ఏంటి? అవెలా పనిచేస్తాయి?( What Are Heat Protectants? How Do They Work?)
- హీట్ ప్రొటెక్టెంట్స్ ఎప్పుడు ఉపయోగించాలి?( When To Use Hair Protectants?)
- స్టైలింగ్ చేసుకోవడానికి ముందు హీట్ ప్రొటెక్టెంట్స్ ఎలా ఉపయోగించాలి?( How To Use Heat Protectants Before Styling Your Hair)?
- బెస్ట్ హీట్ ప్రొటెక్టెంట్ ఎలా ఎంపిక చేసుకోవాలి?( Tips To Find Heat Protectant For Your Hair)
- బెస్ట్ హీట్ ప్రొటెక్టెంట్ ఉత్పత్తులు(Best Heat Protectant Products)
- హీట్ స్టైలింగ్ జుట్టు పాడవకుండా కాపాడే చిట్కాలు (Other Ways To Help Prevent Heat Damage)
- హీట్ స్టైలింగ్ పరికరాల వల్ల కురులకు జరిగిన నష్టాన్ని పూడ్చటం ఎలా?( How To Repair Heat Damaged Hair?)
- తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
హీట్ ప్రొటెక్టెంట్స్ అంటే ఏంటి? అవెలా పనిచేస్తాయి?( What Are Heat Protectants? How Do They Work?)
హీట్ స్టైలింగ్ చేసుకోవడానికి ముందు వెంట్రుకలకయ్యే డ్యామేజ్‌ను తగ్గించడానికి హీట్ ప్రొటెక్టెంట్స్ ఉపయోగిస్తాయి. ఇది క్రీమ్, స్ప్రే, సీరమ్ రూపంలో ఉంటుంది. ముందుకు వెంట్రుకలకు వీటిని అప్లై చేసుకుని ఆ తర్వాత స్ట్రెయిటనర్, కర్లర్ ఉపయోగించాల్సి ఉంటుంది. వీటి నుంచి వెలువడే వేడికి, జుట్టుకు మధ్య అడ్డుగోడలా హీట్ ప్రొటెక్టెంట్స్ పని చేస్తాయి. దీనివల్ల కురుల నుంచి తేమ బయటకు వెళ్లిపోకుండా ఉంటుంది. వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు కురుల ఆరోగ్యం దెబ్బతినకుండా చూస్తాయి. హ్యుమక్టెంట్స్ కురులలోని తేమను లాక్ చేసి ఉంచడం వల్ల జుట్టు పొడిగా మారదు. అలాగే హీట్ ప్రొటెక్టెంట్స్‌లో ఉన్న నేచురల్ ఆయిల్స్ వల్ల వెంట్రుకల పై పొరలు పాడవకుండా ఉంటాయి.
Shutterstock
హీట్ ప్రొటెక్టెంట్స్ ఎప్పుడు ఉపయోగించాలి?( When To Use Hair Protectants?)
బ్లో డ్రయర్స్, కర్లింగ్ ఐరన్స్, స్ట్రెయిటనింగ్ ఐరన్స్ వంటి హీట్ స్టైలింగ్ టూల్స్ ఉపయోగించే ముందు హీట్ ప్రొటెక్టెంట్స్ జుట్టుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంచుకున్న హీట్ ప్రొటెక్టెంట్ బట్టి తడి తలపై అప్లై చేసుకోవాలా? లేదా పొడి తలపై అప్లై చేసుకోవాలా? అనేది ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల హీట్ ప్రొటెక్టెంట్స్‌ను తలస్నానం చేసే సమయంలోనే అప్లై చేసుకోవచ్చు.
స్టైలింగ్ చేసుకోవడానికి ముందు హీట్ ప్రొటెక్టెంట్స్ ఎలా ఉపయోగించాలి?( How To Use Heat Protectants Before Styling Your Hair)?
ముందు హీట్ ప్రొటెక్టెంట్స్ ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే అసలుకే ఎసరు రావచ్చు.
- హీట్ స్టైలింగ్ చేసుకోవాలంటే ముందు మీ జుట్టు శుభంగా ఉండటంతో పాటు చక్కగా కండిషనింగ్ చేసుకుని ఉండాలి. అంటే తలస్నానం తర్వాత స్టైలింగ్ చేసుకోవడం ఉత్తమం. షాంపూ చేసుకున్న అనంతరం కండిషనర్ రాసుకుని చివరిగా తలపై ఓ మగ్గు చల్లటి నీరు పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల కురుల్లోని తేమ బయటకు పోకుండా ఉంటుంది.
- బాగా వెడల్పాటి పళ్లున్న లేదా పళ్ల మధ్య ఖాళీ ఎక్కువగా ఉన్న దువ్వెన ఉపయోగించి చిక్కు తీసుకోవాలి. చిక్కు రాకపోతే.. దాన్ని బలవంతంగా తీయాలని ప్రయత్నించవద్దు. తల కాస్త తడిగా ఉన్నప్పుడే చిక్కు తీసుకోవాలి.
- ఇప్పుడు హీట్ ప్రొటెక్టెంట్‌ను అప్లై చేసుకోవాలి. జుట్టును పాయలుగా విడదీసి సీరమ్, క్రీం లేదా స్ప్రే అప్లై చేసుకోవాలి. హీట్ ప్రొటెక్టెంట్‌గా స్ప్రే ఉపయోగిస్తుంటే.. తలకు అడుగు దూరంలో బాటిల్ ఉంచి స్ప్రే చేసుకోవాలి.
- జుట్టును ఆరబెట్టుకునేందుకు బ్లోడ్రైయర్ ఉపయోగిస్తున్నట్లయితే పాడెల్ బ్రష్ సాయంతో జుట్టును దువ్వుతూ బ్లోడ్రై చేసుకోవాలి.
- హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసుకోవాలనుకుంటే.. ముందు మీ జుట్టును మూడు భాగాలుగా విడదీసి దేనికదే క్లిప్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క్లిప్ తీసి.. దాన్ని పాడెల్ బ్రష్ సాయంతో దువ్వుకోవాలి. దాన్ని పాయలుగా విడదీసి ఫ్లాట్ ఐరన్ ఉపయోగించి స్ట్రెయిటన్ చేసుకోవాలి. మిగిలిన భాగాలను కూడా ఇలాగే చేయాలి. కర్లింగ్‌కి కూడా ఇదే పద్ధతిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
బెస్ట్ హీట్ ప్రొటెక్టెంట్ ఎలా ఎంపిక చేసుకోవాలి?( Tips To Find Heat Protectant For Your Hair)
మీ జుట్టుకి తగిన హీట్ ప్రొటెక్టెంట్ ఎంపిక చేసుకుంటేనే దాని వల్ల కలిగే ఫలితాలను మనం పొందగలుగుతాం. కాబట్టి హీట్ ప్రొటెక్టెంట్‌ను ఎంపిక చేసుకునే విషయంలో ఎలాంటి విషయాలు పరిగణనలోకి తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం.
మీ జుట్టు తత్వం ఏంటి?
హెయిర్ ప్రొటెక్టెంట్ కొనుగోలు చేయడానికంటే ముందు మీ జుట్టుతత్వం ఏంటో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని ఆధారంగా మీరు మీ జుట్టుకు తగిన ఉత్పత్తి ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ తరహా జుట్టుకైనా స్ప్రే, సీరమ్, క్రీం రూపంలో హెయిర్ ప్రొటెక్టెంట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సీరమ్, క్రీం కంటే స్ప్రే ఉపయోగించడం సులభం కాబట్టి దాన్ని ఎంచుకోవడం మంచిది.
వేటితో తయారుచేశారు?
ఏ ఉత్పత్తి ఉపయోగించినా దాన్ని తయారుచేయడానికి ఎలాంటి పదార్థాలు ఉపయోగించారో తెలుసుకోవాల్సిందే. హీట్ ప్రొటెక్టెంట్స్ కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. కెరాటిన్, సహజమైన నూనెలతో తయారుచేసిన ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది.
మీ స్టైలింగ్ అవసరాలు
ఎక్కువ వేడితో జుట్టును స్టైలింగ్ చేసుకుంటున్నప్పుడు కెరాటిన్ ముఖ్య పదార్థంగా ఉన్న ప్రొటెక్టెంట్‌ను ఎంచుకోవడం మంచిది. మీ కురులు షైనింగ్ గా కనిపించాలంటే సీరమ్ ఉపయోగించాల్సి ఉంటుంది.
బెస్ట్ హీట్ ప్రొటెక్టెంట్ ఉత్పత్తులు(Best Heat Protectant Products)
సౌందర్యం విషయంలో నాణ్యమైన ఉత్పత్తులు ఉపయోగించినప్పుడే మనం కోరుకున్న ఫలితం లభిస్తుంది. అయితే మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తుల్లో బెస్ట్ వెతకడమంటే కష్టమే. మీకోసమే కొన్ని బెస్ట్ హీట్ ప్రొటెక్టెంట్స్ వివరాలు మీకు అందిస్తున్నాం.
1. L’Oreal Paris Hot and Straight Spray
హెయిర్ కేర్ ఉత్పత్తుల విషయానికి వస్తే లోరియల్ పారిస్ ఉత్పత్తులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాస్త ఖరీదు ఎక్కువైనప్పటికీ కురులు అందంగా ఉంటాయనే నమ్మకంతో వీటిని ఉపయోగించేవారు ఎక్కువ మంది ఉంటారు. లోరియల్ సంస్థ అందించే హీట్ ప్రొటెక్టెంట్స్ కూడా అంతే ప్రభావవంతంగా పనిచేస్తాయి. జుట్టు సహజత్వం దెబ్బ తినకుండా స్టైలింగ్ టూల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. లోరియల్ పారిస్ అందిస్తోన్న ఈ హాట్ అండ్ స్ట్రెయిట్ స్ప్రే టూ ఇన్ వన్ లాంటిది. అంటే బ్లో డ్రై చేసుకోవడానికి, స్ట్రెయిటనింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. స్ట్రెయిటనింగ్ చేసేటప్పుడు సుమారుగా 230°C ఉష్ణం వరకు కురులను రక్షిస్తాయి.
2. Tresemme Keratin Smooth Heat Protection Shine Spray
హీట్ స్టైలింగ్ చేసుకున్నప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకపోతే కురులు పొడిగా, నిర్జీవంగా మారిపోతాయి. దీనికి కారణం స్టైలింగ్ టూల్స్ నుంచి విడుదలయ్యే ఉష్ణం కారణంగా వెంట్రుకల్లోని కెరాటిన్ నాశనమైపోతుంది. ట్రెసెమ్మే కెరాటిన్ స్మూత్ ప్రొటెక్షన్ స్ప్రే ఉపయోగిస్తే జుట్టు కెరాటిన్ స్ట్రక్చర్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే హీట్ స్టైలింగ్ తర్వాత కురులు సైతం స్మూత్ గా మారతాయి. ఇది 230°C వరకు కురులకు రక్షణ అందిస్తుంది. దీనిలో ఉన్న మరూలా ఫ్రూట్ ఆయిల్ కురులను సిల్కీగా మారేలా చేస్తుంది. 5 ఇన్ 1 ఫార్ములాతో పనిచేసే ఈ హీట్ ప్రొటెక్టెంట్ కురులను పొడిగా మారకుండా చేస్తుంది.
3. Schwarzkopf Gliss Total Repair Heat Protection Spray
ఈ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే 220°C వరకు కురులను కాపాడటంతో పాటు స్మూత్ గా మారేలా చేస్తుంది. అలాగే.. వెంట్రుకలను స్టైలింగ్ తర్వాత పొడిగా మారకుండాచేస్తుంది. బ్లో డ్రైయర్ ఉపయోగించాలనుకుంటే.. ముందు టవల్‌తో తల తుడుచుకుని కాస్త పొడిగా మారిన తర్వాత ఈ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే చేయాలి. ఆ తర్వాత బ్లోడ్రై చేసుకోవాలి. హాట్ ఐరన్ చేసుకోవాల్సి వస్తే.. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత దీన్ని స్ప్రే చేసుకుని హెయిర్ స్ట్రైయిటన్ చేసుకోవాలి.
4. ghd Heat Protect Spray
హీట్ స్టైలింగ్ టూల్స్ నుంచి మీ జుట్టును కాపాడుకోవడానికి మరో మంచి ఉత్పత్తి జీహెచ్ డీ హీట్ ప్రొటెక్ట్ స్ప్రే. జుట్టు తడిగా ఉన్నా.. పొడిగా ఉన్నా.. దీన్ని స్ప్రే చేసుకుని స్టైలింగ్ చేసుకోవచ్చు.
5. de vivre Bi-Phase Hair Conditioner Spray
హీట్ ప్రొటెక్షన్, డీ టాంగ్లింగ్(చిక్కులు తీసుకోవడం), స్టైలింగ్, స్మూత్ గా, షైనీగా ఉన్న జుట్టు ఇలా ఒకే ప్రొడక్టుతో ఎక్కువ ప్రయోజనాలు పొందాలనుకునేవారు de vivre Bi-Phase Hair Conditioner Spray ఉపయోగించడం మంచిది. పైగా ఇది అందుబాటు ధరలోనే లభ్యమవుతోంది.
6. HSI Argan Oil Thermal Protector
సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన హీట్ ప్రొటెక్టెంట్ వాడాలనుకునేవారికి HSI Argan Oil Thermal Protector సరైన ఎంపిక. అర్గాన్ ఆయిల్‌తో తయారైన ఈ హీట్ ప్రొటెక్టెంట్‌లో విటమిన్ ఎ, బి, సి, డి ఉన్నాయి. ఇవి జుట్టును స్టైలింగ్ పరికరాల వేడి నుంచి రక్షించడంతో పాటు.. అవసరమైన పోషణ అందిస్తాయి. పైగా ఇది సల్ఫేట్, పారాబెన్ ఫ్రీ ఉత్పత్తి కావడం వల్ల కురులపై రసాయన ప్రభావం ఉండదు.
7. Living Proof Restore Perfecting Spray
ఈ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే జుట్టును స్టైలింగ్ చేసుకోవడంతో పాటు కండిషన్ కూడా చేస్తుంది. అలాగే 230°C వరకు ఉష్ణాన్ని తట్టుకునేలా చేస్తుంది. జుట్టు బాగా చిక్కు పడినప్పుడు ఈ స్ప్రే ఉపయోగిస్తే చాలా ఈజీగా వాటిని తొలగించుకోవచ్చు. అంతేకాదు.. ఇది అతినీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కురులను రక్షిస్తుంది. అలాగే కురులకు సహజమైన మెరుపును సైతం అందిస్తుంది.
8. Beyond The Zone Flat Iron Protection
పొడి జుట్టు కలిగినవారు హీట్ స్టైలింగ్ చేసుకోవడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అసలే డ్రైగా ఉన్న జుట్టు హీట్ స్టైలింగ్ తర్వాత మరింత పొడిగా మారిపోతుంది. హీట్ స్టైలింగ్ తర్వాత జుట్టు స్మూత్ గా కావాలనుకుంటే.. బియాండ్ ద జోన్ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే ఉపయోగించడం మంచిది.
9. WELLA Professionals Thermal Image Heat Protection Spray
ఈ హెయిర్ స్ప్రే టూ ఫేజ్ ఫార్ములాతో పనిచేస్తుంది. ఇది కురులను స్మూత్‌గా మార్చేస్తుంది. అలాగే హీట్ స్టైల్ నుంచి వెలువడే 220°C వరకు జుట్టును రక్షిస్తుంది.
10. CHI 44 Iron Guard Thermal Protection Spray
ఏ తరహా జుట్టు కలిగిన వారికైనా నప్పే హీట్ ప్రొటెక్టెంట్ CHI 44 ఐరన్ గార్డ్ థర్మల్ ప్రొటెక్షన్ స్ప్రే. ఇది హీట్ స్టైలింగ్ వల్ల పొడిగా, నిర్జీవంగా తయారైన జట్టును మళ్లీ స్మూత్‌గా మార్చేస్తుంది. ఈ హీట్ ప్రొటెక్టెంట్. ఈ స్ప్రేతో ఉన్న మరో లాభమేంటంటే.. దీని కారణంగా జుట్టు జిడ్డుగా మారదు.
11. CETUS Argan Oil Firm Hold Hair Spray for hair styling and Finishing
మనమెలాంటి హెయిర్ స్టైల్ ఫాలో అవుతున్నా.. ఏ రకమైన జుట్టు అయినా సరే హీట్ స్టైలింగ్ చేసుకోవడానికి CETUS Argan Oil Firm Hold Hair Spray బాగా పనికొస్తుంది. దీనిలో ఉన్న అర్గాన్ ఆయిల్ కురులను వేడి నుంచి రక్షించడం మాత్రమే కాకుండా.. వాటికి పోషణ ఇస్తుంది. ఇది చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. అలాగే జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది.
12. Berina Hair Heat Protection Spray
న్యాచురల్ ఎక్స్ట్రాట్స్ తో తయారైన ఈ హీట్ ప్రొటెక్షన్ స్ప్రేలో ప్రొ విటమిన్ బీ5 ఫార్ములా ఉంది. ఈ హెయిర్ స్ప్రే హెయిర్ డ్రై, స్ట్రెయిటనింగ్ చేసుకొనే సమయంలో జుట్టును రక్షించడంతో పాటు.. సూర్యరశ్మి ప్రభావం నుంచి కురులను రక్షిస్తుంది. ఈ మేడిన్ థాయ్ లాండ్ ప్రొడక్ట్‌కి డిమాండ్ బాగా ఎక్కువ.
13. ktein Natural Hair Heat Protection and Nourishment Spray
అవిశె గింజలు, గ్రేప్ సీడ్స్, కలబంద, గ్రీన్ టీ, రైస్ వాటర్ వంటి కురులకు మేలు చేసే పదార్థాలతో తయారైన హీట్ ప్రొటెక్టెంట్ ఇది. కురులను హీట్ స్టైలింగ్ ప్రభావం నుంచి రక్షించడంతో పాటు.. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
14. Skinberry hair heat protector styler hair primer spray
మొరాకొన్ ఆర్గాన్ ఆయిల్ తో తయారైన ఈ హెయిర్ స్ప్రే హీట్ డ్యామేజ్ నుంచి స్టైలింగ్ టూల్స్ నుంచి కురులను రక్షిస్తుంది. సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేయడం వల్ల కురులకు దీన్ని వల్ల ఎలాంటి హాని జరగదు. హీట్ స్టైలింగ్ వల్ల జుట్టు కోల్పోయిన తేమను ఆర్గాన్ ఆయిల్ భర్తీ చేస్తుంది.
15. L’Oreal Paris Elnett Satin Heat Protect Styling Spray
తలస్నానం చేసిన ప్రతిసారి స్ట్రెయిటనింగ్, కర్లింగ్ చేసుకునే అలవాటు ఉన్నా లేకపోయినా చాలామందికి బ్లో డ్రై చేసుకునే అలవాటు ఉంటుంది. తరచూ బ్లో డ్రయర్ ఉపయోగించేవారికి లోరియల్ పారిస్ ఎల్నెట్ శాటిన్ హీట్ ప్రొటెక్టెంట్ స్పే బాగా ఉపయోగపడుతుంది. ఇది జుట్టును మెత్తగా, ఒత్తుగా కనిపించేలా చేస్తుంది.
Shutterstock
హీట్ స్టైలింగ్ జుట్టు పాడవకుండా కాపాడే చిట్కాలు (Other Ways To Help Prevent Heat Damage)
మీకు నచ్చిన హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే ఎంపిక చేసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుని దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడే వెంట్రుకలకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవచ్చు.
బ్లో డ్రై చేయడానికి ముందు జుట్టు కాస్త ఆరనివ్వాలి
జుట్టు మరీ తడిగా ఉన్నప్పుడు డ్రైయర్ ఉపయోగిస్తే ఎక్కువ సమయం బ్లో డ్రై చేసుకోవాల్సి ఉంటుంది. పైగా కురులు ఎక్కువ సమయం ఉష్ణానికి గురి కావాల్సి వస్తుంది. దీనివల్ల జుట్టు బాగా పాడవుతుంది. కాబట్టి బ్లో డ్రై చేయడానికంటే ముందే కాస్త ఎయిర్ డ్రై చేయాల్సి ఉంటుంది. లేదా టీషర్ట్ తలకు చుట్టుకుని కాసేపు వదిలేయాలి.
హీట్ టూల్స్ వాడకాన్ని తగ్గించడం
బ్లో డ్రయర్ లేదా హెయిర్ స్ట్రెయిటనర్ వంటి స్టైలింగ్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వాటి వాడకాన్ని తగ్గించడం మంచిది. వారానికి రెండు మూడు సార్లు కంటే ఎక్కువ వాడకూడదు.
హీట్ సెట్టింగ్స్ అడ్జస్ట్ చేయండి
హీట్ స్టైలింగ్ టూల్స్ ఉపయోగించేటప్పుడు అందులో ఉన్న హీట్ సెట్టింగ్స్ చాలా తక్కువలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. ఎక్కువ హీట్ ఉపయోగించడం వల్ల వెంట్రుకల ఆరోగ్యం దెబ్బ తింటుంది.
ఎక్కువ సమయం ఒకే చోట హీట్ చేయొద్దు.
జుట్టును పాయలుగా విడదీసి హీట్ స్టైలింగ్ చేస్తాం. అయితే ఇలా చేసేటప్పుడు ఫ్లాట్ ఐరన్‌ను ఒకే చోట ఉంచకుండా.. స్మూత్‌గా పై నుంచి కిందకు తీసుకురావాలి. అలాగే ఒకే భాగాన్ని ఎక్కువ సార్లు స్ట్రెయిటన్ చేయడం కూడా మంచిది కాదు.
Shutterstock
హీట్ స్టైలింగ్ పరికరాల వల్ల కురులకు జరిగిన నష్టాన్ని పూడ్చటం ఎలా?( How To Repair Heat Damaged Hair?)
హీట్ ప్రొటెక్టెంట్ ఉపయోగించినప్పటికీ కొన్నిసార్లు హీట్ స్టైలింగ్ టూల్స్ వల్ల కురుల ఆరోగ్యం దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. స్టైలింగ్ పరికరాలు ఉపయోగించే క్రమంలో మనం చేసే పొరపాట్లు కూడా కురుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి వెంట్రుకలను తిరిగి అందంగా మార్చడానికి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
హెయిర్ మాస్క్
హీట్ డ్యామేజ్‌కి గురైన జుట్టును రిపేర్ చేయడానికి మీ హెయిర్ కేర్ రొటీన్‌లో హెయిర్ మాస్క్ ను కూడా చేర్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఇంటెన్స్ రిపేర్ హెయిర్ షీట్ మాస్క్ లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని ఉపయోగించడం ద్వారా జుట్టును తిరిగి అందంగా మార్చుకోవచ్చు.
జుట్టుకు పోషణ అందేలా
తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా హెయిర్ స్టైలింగ్ టూల్స్ ఉపయోగించేవారు కచ్చితంగా కండిషనర్ అప్లై చేసుకోవాల్సిందే. అప్పుడే జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.
స్ప్లిట్ ఎండ్స్ కత్తిరించాలి
హీట్ స్టైలింగ్ వల్ల జుట్టు చివర్లు చిట్లిపోతుంటాయి. అంటే జుట్టు ఆరోగ్యం దెబ్బతిన్నట్టే. కాబట్టి ఆరు నుంచి ఎనిమిది వారాలకోసారి స్ప్లిట్ ఎండ్స్ కత్తిరించుకోవాల్సి ఉంటుంది.
ప్రొటీన్ ట్రీట్మెంట్
హీట్ స్టైలింగ్ వల్ల పాడైన జుట్టుకి ప్రొటీన్ ట్రీట్మెంట్ ద్వారా తిరిగి జీవాన్ని అందించవచ్చు. అయితే నెలకు రెండు సార్లు మాత్రమే ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంతకు మించితే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.
Shutterstock
తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
హీట్ ప్రొటెక్టెంట్స్ స్టైలింగ్ వల్ల జరిగే డ్యామేజ్ ను పూర్తిగా ఆపుతాయా?
తరచూ హెయిర్ స్టైలింగ్ టూల్స్ ఉపయోగించేవారిలో జుట్టు చాలా త్వరగా పాడైపోతుంది. వాటి నుంచి వెలువడే అధిక ఉష్ణానికి జుట్టు కాలిపోవడం, తెగిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికి కారణం జుట్టు ఒక్కసారిగా వేడెక్కడమే. ఇలా జుట్టుకి జరిగే డ్యామేజ్ స్థాయిని హీట్ ప్రొటెక్టెంట్స్ ఉపయోగిస్తే చాలావరకు తగ్గించుకోవచ్చు. కానీ వాటి నుంచి వెలువడే ఉష్ణం నుంచి పూర్తి స్థాయి రక్షణ కల్పించలేవు.
కర్లింగ్ చేసుకోవడానికి కూడా హీట్ ప్రొటెక్టెంట్ ఉపయోగించాల్సిన అవసరం ఉందా?
కర్లింగ్ మాత్రమే కాదు, బ్లో డ్రయర్ ఉపయోగించి జుట్టు ఆరబెట్టుకున్నా, స్ట్రెయిటనర్ ఉపయోగించి జుట్టును స్ట్రెయిటనింగ్ చేసుకున్నా హీట్ ప్రొటెక్టెంట్స్ ఉపయోగించాల్సిందే. లేదంటే వెంట్రుకల సహజత్వం దెబ్బతింటుంది.
హీట్ ప్రొటెక్టెంట్స్ లో ఉన్న రసాయనాలు వెంట్రుకల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా?
హీట్ ప్రొటెక్టెంట్స్ ఉపయోగించడం వల్ల జుట్టుకు కొంత మేర ప్రయోజనం ఉన్నప్పటికీ వాటిలో ఉన్న రసాయనాల వల్ల హాని కలిగే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా సల్ఫేట్స్, పారాబెన్స్ లాంటి వాటి వల్ల కురుల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. అలాగే హీట్ ప్రొటెక్టెంట్స్‌లో ఉండే పదార్థాలు వెంట్రుకలపై పొరలుగా ఏర్పడతాయి. ఇది కూడా కురులకు ఆరోగ్యానికి హాని చేసేవే. వీలైనంత వరకు కెరాటిన్, నూనెలతో తయారుచేసిన హీట్ ప్రొటెక్టెంట్స్ ఉపయోగించడం మంచిది.
మీకోసం మరికొన్ని ఇంటరెస్టింగ్ టాపిక్స్ :
స్ట్రెయిటెనింగ్, స్మూతెనింగ్‌తో.. జుట్టును స్టైలిష్‌గా మార్చుకుందాం
పొడవైన జుట్టు కోసం అద్భుతమైన చిట్కాలు