Lifestyle

హైదరాబాద్‌ ట్రెండ్స్: షాపింగ్ చేయాలా? అయితే ఈ మార్కెట్లపై ఓ లుక్కేయండి..!

Soujanya Gangam  |  Jul 8, 2019
హైదరాబాద్‌ ట్రెండ్స్: షాపింగ్ చేయాలా? అయితే ఈ మార్కెట్లపై ఓ లుక్కేయండి..!

హైదరాబాద్ (Hyderabad).. సుల్తాన్‌ల సిటీ. అద్బుతమైన నిర్మాణ శైలికి పెట్టింది పేరు. కానీ హైదరాబాద్‌లో కేవలం ముత్యాలు, బిర్యానీ, చార్మినార్ మాత్రమే కాదు.. ఇంకా మరెన్నో ఫేమస్. స్ట్రీట్ షాపింగ్‌కి పెట్టింది పేరైన నగరం ఇది. దేశంలోకెల్లా అతి తక్కువ ఖర్చుతో జీవించగలిగే నగరం హైదరాబాదే. ఇక్కడి అద్భుతమైన మార్కెట్లలో దుస్తులు, ఆభరణాలు, ముత్యాలు.. ఇలా ఒకటేమిటి? అమ్మాయిల షాపింగ్‌కి అవసరమైనవన్నీ దొరుకుతాయి. మరి, మన నగరంలో చీప్ అండ్ బెస్ట్ షాపింగ్ (Shopping) కోసం ఎక్కడికి వెళ్లాలి? ఎక్కడ ఏం దొరుకుతాయో చూద్దాం..!

1. సికింద్రాబాద్ జనరల్ బజార్

దీన్నే టొబాకో బజార్ అని కూడా పిలుస్తారు. సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ రోడ్‌లో ఉన్న ఈ మార్కెట్.. చూడడానికి చిన్న సందు మాదిరిగా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తూ ఉంటే మార్కెట్ పెద్దదవుతూ ఉంటుంది. పెళ్లి షాపింగ్‌కి ఈ మార్కెట్ పెట్టింది పేరు. పెళ్లి పత్రికల నుంచి దుస్తుల వరకూ.. ఆభరణాల నుంచి కాపురానికి కావాల్సిన వస్తువుల వరకూ అన్ని వస్తువులూ ఇక్కడ లభిస్తాయి. అరవై ఏళ్ల చరిత్ర గల ఈ మార్కెట్లో చక్కటి దుస్తులు లభిస్తాయని పేరుంది. పట్టుచీరలు షాపింగ్ మాల్స్ కంటే తక్కువ ధరలో ఇక్కడ లభ్యమవుతాయి. కుర్తీలు, దుపట్టాలు, చుడీదార్లు, బ్లౌజుల్లో అయితే.. వేలాది వెరైటీలు ఇక్కడ లభిస్తాయి. ఈ మార్కెట్ ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకూ తెరిచి ఉంటుంది.

మైసమ్మ.. పోచమ్మల బోనం చేయంగ.. బోనాల జాతరలో ఆడిపాడంగ..!

2. అమీర్ పేట్ జంక్షన్

చిన్నా పెద్దా షాపులన్నీ ఒక్కచోట చేరి.. అమీర్ పేట్ జంక్షన్‌ని కూడా ఓ పెద్ద షాపింగ్ ఏరియాగా మార్చేశాయి. ఇక్కడ మన బడ్జెట్‌ని బట్టి  షాపింగ్ చేసే వీలుంటుంది. దుస్తులు, బ్యాగ్స్, చెప్పులు, మొబైల్ కవర్స్, ఫంకీ జ్యుయలరీ ఇలా ఎన్నో రకాల వస్తువులను ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. వస్త్రాలు కూడా ఎన్నో రకాలు లభిస్తాయి.

mapmyindia

3. చార్మినార్

చార్మినార్ మార్కెట్ చాలా రకాల వస్తువులకు ప్రసిద్ధి. ఇక్కడ మార్కెట్లో ఓవైపు అద్భుతమైన గాజులు లభిస్తాయి. ఈ మార్కెట్‌ని లాడ్ బజార్ అని పిలుస్తారు. ఆ పక్కనే అత్తర్లు కూడా అమ్ముతారు. ఈ బజార్లో యాక్సెసరీస్‌తో పాటు దుస్తులు కూడా లభిస్తాయి. ఎత్నిక్ చీరలు, షేర్వానీలు వంటివన్నీ ఇక్కడ లభిస్తాయి. వీటితో పాటు రకరకాల యాక్సెసరీస్, ఇమిటేషన్ జ్యుయలరీ వంటివి కూడా లభిస్తాయి.

అంతేకాదు.. పిల్లల కోసం బొమ్మలు, సుర్మా, మెహెందీ కోన్స్ వంటివి కూడా ఇక్కడ రోడ్లపై అమ్ముతారు. చిన్న చిన్న ఫ్యాషన్ డిజైనర్లు ఇక్కడ తమ బొటిక్స్ పెట్టుకొని సొంతంగా డిజైనర్ చీరలు, లెహెంగాలు తయారుచేసి అందిస్తుంటారు. ఇతర బొటిక్స్‌తో పోల్చితే క్వాలిటీలో ఏమాత్రం తేడా లేకపోయినా.. ధర మాత్రం తక్కువగా ఉండడం వీటి విశేషం.

హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్స్: మోడరన్ అమ్మాయిలకు ప్రత్యేకం.. ఈ టాప్ 10 డిజైనర్ బొతిక్స్..!

4. అబిడ్స్ సర్కిల్

ఇటు నుమాయిష్, అటు సుల్తాన్ బజార్‌కి దగ్గర్లోనే ఉన్నా.. అబిడ్స్ కూడా కమర్షియల్ హబ్‌గా ఎదుగుతోంది. ఇక్కడి మీనా బజార్లో సంప్రదాయ దుస్తులు లభిస్తాయి. ఎత్నిక్ నుంచి మోడ్రన్ దుస్తుల వరకూ అన్నింటినీ ఇక్కడ కొనుగోలు చేసే వీలుంటుంది. ముస్లిం పెళ్లి కూతుళ్లకు కావాల్సిన సంప్రదాయ వస్త్రాలు, పెళ్లి వస్త్రాలతో పాటు బుర్ఖాలు అమ్మే షాపులు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి. అంతేకాదు.. అబిడ్స్ జ్యుయలరీ షాపులకు కూడా పెట్టింది పేరు. చక్కటి డిజైన్లలో మంచి బంగారు, వెండి ఆభరణాలు కావాలంటే ఇక్కడికి వెళ్తే సరిపోతుంది. ఒకటి కాకపోతే వేరే షాపులో ప్రయత్నించవచ్చు.

Youtube

5. సుల్తాన్ బజార్

భారత దేశాన్ని బ్రిటిష్ వాళ్లు పరిపాలించినప్పుడు.. దీన్ని రెసిడెన్సీ మార్కెట్ అని పిలిచేవారు. ఈ మార్కెట్‌కి 200 ఏళ్ల చరిత్ర ఉంది. కోఠిలో ఉన్న సుల్తాన్ బజార్ మహిళలకు సంబంధించిన అన్ని రకాల దుస్తులు, చీరలు, ఆర్టిఫిషియల్ జ్యుయలరీకి పెట్టింది పేరు. చక్కటి సల్వార్ కమీజ్ నుంచి లెహెంగాల వరకూ.. చీరల నుంచి చున్నీల వరకూ ప్రతి ఒక్కటీ ఇక్కడ లభిస్తుంది. ఎన్నో రకాల వెరైటీలు లభించడంతో పాటు.. చాలా తక్కువ ధరలు సామాన్యులను ఇక్కడికి రావడానికి ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ మార్కెట్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8, 9 వరకూ తెరిచి ఉంటుంది.

6. బేగం బజార్

హైదరాబాద్‌లోని అన్ని మార్కెట్లకు బేగం (రాణి) ఈ మార్కెట్. హైదరాబాద్‌లో అన్నింటికంటే పెద్ద మార్కెట్ ఇది. కేవలం దుస్తులు, నగలే కాదు.. నిత్య జీవితంలో అవసరమయ్యే ఎన్నో రకాల వస్తువులు బేగం బజార్‌లో అందుబాటులో ఉంటాయి. డెకరేషన్ వస్తువులు, వంట సామాగ్రి, కాస్మెటిక్స్, రోజువారీ ఉపయోగపడే వస్తువులు, పర్ఫ్యూమ్స్.. ఇలా దుస్తులు, నగలే కాదు.. నిత్య జీవితంలో అవసరమైన వస్తువులన్నీ ఇక్కడ లభిస్తాయి. దాదాపు 150 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎంతో మంది ఇక్కడికి వచ్చి.. ఈ మార్కెట్లో వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఈ మార్కెట్ రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకూ తెరిచి ఉంటుంది. ఆదివారం ఈ మార్కెట్‌కి సెలవు.

హైదరాబాద్ ట్రెండ్స్: మంచి బ్యూటీ పార్లర్ కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని ట్రై చేయండి

Youtube

7.నుమాయిష్ నాంపల్లి

హైదరాబాద్‌లో ఉంటున్నవారికి.. ఇక్కడికి వచ్చేవారికి జనవరిలో ఏర్పాటు చేసే నుమాయిష్ లేదా ఎగ్జిబిషన్ గురించి తెలిసే ఉంటుంది. దుస్తులు, చెప్పులు, యాక్సెసరీస్, ఆభరణాలు.. ఇలా ఏ ఒక్కటీ లేకుండా అన్ని వస్తువులూ ఈ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఎగ్జిబిషన్ మాత్రం జనవరి 1 నుంచి ఫిబ్రవరి మధ్య వరకూ మాత్రమే ఉంటుంది. ధరలు కూడా మరీ ఎక్కువగా ఉండవు. కాబట్టి చాలామంది ఇక్కడ షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మార్కెట్ ఉదయం పది గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఉంటుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Lifestyle