ADVERTISEMENT
home / Bigg Boss
బిగ్ బాస్ హౌస్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్

బిగ్ బాస్ హౌస్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 102 రోజులు పూర్తి చేసుకుంది. మరొక మూడు రోజుల్లో ఈ సీజన్ ముగియబోతోంది. అయితే ఈ సీజన్ లో 17 మంది సభ్యులు కంటెస్టెంట్స్ (contestants) గా రావడం & గేమ్ ముందుకు సాగుతున్న కొద్ది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ (evicted) అవుతూ చివరికి ఇప్పుడు అయిదుగురు సభ్యులు మిగిలారు.

బాబా భాస్కర్ సూపర్ స్టార్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్.. మరి, శ్రీముఖి ఏంటి?

ఈ అయిదుగురు సభ్యులలో ఒకరు ఆదివారం జరగబోయే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో విజేతగా నిలవనున్నారు. ఇక ఆఖరి వారం అవ్వడంతో ఇప్పటికే ఈ అయిదుగురు సభ్యులని వారి ప్రయాణం ఎలా సాగింది? & ఈ బిగ్ బాస్ ప్రయాణం లో వారు ఏమైనా తెలుసుకున్నారా? వంటి ప్రశ్నలు వివిధరకాలైన టాస్కుల రూపంలో అడగడం జరిగింది. అలా ఈ అయిదుగురు కంటెస్టెంట్స్ – రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, శ్రీముఖి & అలీ రెజా ల నుండి సమాధానాలు తెలుసుకోవడం జరిగింది.

ఇక ప్రతి బిగ్ బాస్ (bigg boss) సీజన్ లో ఆఖరి వారంలో అప్పటివరకు ఆ సీజన్ లో ఎలిమినేట్ అయినవారంతా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించడం & ఇంటిలో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ తో ఒక రోజు మొత్తం గడపడం ఆనవాయితి. అందులో భాగంగానే ఇప్పటివరకు ఈ సీజన్ లో ఎలిమినేట్ అయి వెళ్ళినవారు మరలా బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది. దీనికి సంబందించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈ ప్రోమో చూస్తుంటే, దాదాపు ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు మళ్లీ ఇంటిలోకి రావడం జరిగింది.

ADVERTISEMENT

ఆ ప్రోమో లో చూస్తుంటే ముందుగా రవికృష్ణ, ఆ తరువాత జాఫర్, రోహిణి, అషు రెడ్డి, తమన్నా సింహాద్రి, వితిక, పునర్నవి,  శివజ్యోతి, మహేష్ విట్టా, హిమజ, హేమ, శిల్ప చక్రవర్తి లు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది. ఇప్పటివరకూ ఎలిమినేట్ అయిన సభ్యులు వారు బయటకి వెళ్లి తమకి బిగ్ బాస్ లో నచ్చిన వాళ్ళు & నచ్చని వాళ్ళు అంటూ మీడియాలో చెప్పడం..  కొంతమంది అయితే డిబేట్స్ లో కూడా పాల్గొనడం జరిగింది. హిమజ, హేమ లాంటి వాళ్లైతే కేవలం కంటెస్టెంట్స్ పైనే కాకుండా బిగ్ బాస్ పై కూడా విమర్శలు గుప్పించారు. 

బిగ్ బాస్ హౌస్ లో తమ ప్రయాణం చూసి ఎమోషనల్ అవుతున్న కంటెస్టెంట్స్

అలాంటి వారంతా కూడా మరొకసారి బిగ్ బస్ హౌస్ (bigg boss house) లో కలుస్తుండడంతో ఇప్పుడు అందరి దృష్టి బయట నుండి వచ్చే వారి పైన పడింది. ఎందుకంటే ఇది ఆఖరి వారం పైగా ఇంటిలో ఉన్న వారు ఫైనల్ కోసం వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో వీరి మధ్య ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి.. వీరంతా కూడా ఎలా స్పందించబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇదిలావుండగా నిన్నటి ఎపిసోడ్ లో శ్రీముఖి & అలీ రెజా ల బిగ్ బాస్ ప్రయాణం గురించి వారికి చూపించడం జరిగింది. వీరిద్దరూ కూడా మిగతా కంటెస్టెంట్స్ మాదిరిగానే తమ 100 రోజుల ప్రయాణం చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఈ అయిదుగురు కూడా బిగ్ బాస్ లోకి వచ్చే ముందు ఇక్కడ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ లో ఉంటే ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో ఇక్కడ నుండి వెళ్లిపోవాల్సి వస్తుంది అంటే ఏదోలా ఉంది అంటూ మాట్లాడుకున్నారు. తమకి తెలియకుండానే ఈ బిగ్ బాస్ హౌస్ తో ఒక బంధాన్ని పెనవేసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

ఆఖరుగా ఈరోజు ఎపిసోడ్ మొత్తం బిగ్ బాస్ సీజన్ తొలి ఎపిసోడ్ ఎలాగైతే సందడిగా ఉండేదో ఇప్పుడు మరొకసారి అలా సందడిగా మారనుంది. 

బిగ్ బాస్ హౌస్ లో ఈరోజు సర్ ప్రైజ్ ఎలిమినేషన్ ఉండబోతోందా?

01 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT