బిగ్ బాస్ తెలుగు (bigg boss telugu) సీజన్ 3లో భాగంగా ప్రస్తుతం 14వ వారం కొనసాగుతోంది. ఈ వారం అయిపోతే మిగిలేది ఇక ఫినాలే వీక్ మాత్రమే.. అందుకే ఈ వారం గనుక ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటే గ్రాండ్ ఫినాలే వీక్ కి ఎంపిక కావడంతో పాటుగా ఈ సీజన్ కి సంబంధించి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరుగా నిలిచే అవకాశం ఉంది.
అలీ రెజా చేసిన పొరపాటుతో.. రాహుల్ సిప్లిగంజ్ కి బిగ్ బాస్ ఫినాలే టికెట్
ఇందుకోసమే బిగ్ బాస్ లో ఈవారం నామినేషన్స్ లో ఉన్న అయిదుగురు హౌస్ మేట్స్ (housemates)కూడా తమకి మద్దతు తెలుపుతూ ఓట్లు వేసి గెలిపించాలి అని కోరుతున్నారు. ఇక వీరి ప్రయత్నాన్ని ఒక టాస్క్ గా మలిచి ఈవారం నామినేషన్స్ లో ఉన్న – శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా & శివజ్యోతి లకి ఒక ఆసక్తికరమైన టాస్క్ ని ఇవ్వడం జరిగింది.
ఈ టాస్క్ లో భాగంగా ఈ అయిదుగురు సభ్యులు ఒక్కొక్కరూ ఒక్కో టాస్క్ ని చేయాల్సి ఉంటుంది & అదే సమయంలో ఆ టాస్క్ చేసే ముందు వారు ఈ షో చూస్తున్న వీక్షకులని తమకి మద్దతు తెలుపుతూ ఓట్లు వేయమని అడిగే అవకాశాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. ముందు టాస్క్ ని ఎంచుకున్న వ్యక్తి వరుణ్ సందేశ్. తన టాస్క్ విషయానికి వస్తే, ఫైర్ సర్కిల్ లో ఒక రాడ్ ని ఆ సర్కిల్ కి తగలకుండా పట్లుకోవాల్సి ఉంటుంది. ఆ రాడ్ సర్కిల్ కి తగిలినా సర్కిల్ ని దాటక పోయినా వెంటనే ఆ సర్కిల్ మొత్తం మంట చుట్టుముడుతుంది. అలా టాస్క్ మొత్తంలో కేవలం అయిదుసార్లు మాత్రమే మంట ఎగిసే అవకాశం ఉంది. ఆరోసారి మంటలు వస్తే వరుణ్ టాస్క్ ఓడిపోయినట్లుగా పరిగణిస్తామని చెప్పారు బిగ్ బాస్. అయితే కేవలం మూడు అవకాశాలు మాత్రమే తీసుకొని అందరి కంటే ఎక్కువ సమయం ఆ రాడ్ ని పట్టుకొని నిలబడ్డాడు వరుణ్. నిన్నటి టాస్క్ అన్నిటిలో కల్లా ఇది చాలా కష్టమైనది అని చెప్పాలి.
అయితే వరుణ్ సందేశ్ మాత్రం చాలా ఓర్పు & సహనంతో ఈ టాస్క్ ని పూర్తి చేశాడు. మొత్తానికి ఈ టాస్క్ ద్వారా ఆయన షో చూస్తున్న వీక్షకుల మనసు గెల్చుకున్నాడు అనే చెప్పాలి. వరుణ్ తరువాత వీక్షకుల ఓట్ల కోసం బాబా భాస్కర్ ఒక పెద్ద లావుపాటి స్థంభం లాంటి బీమ్ పై ఉన్న చిన్న గ్రిప్ పై కాళ్లు ఉంచి నిలబడాల్సి ఉంటుంది. ఒక కాలు పట్టేంత గ్రిప్ ఉన్న దాని పైన టాస్క్ పూర్తయ్యే వరకు కాస్త కష్టమే అయినా ఈ టాస్క్ లో బాబా కూడా కాలు కింద పెట్టకుండా టాస్క్ ని పూర్తి చేయడం జరిగింది.
Bigg Boss Telugu 3: రాహుల్ సిప్లిగంజ్ & శ్రీముఖి ల మధ్య పెరుగుతున్న వైరం
వీరిద్దరి తరువాత శివజ్యోతికి కోడిగుడ్లు & పాల టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా శివ జ్యోతి పచ్చి కోడిగుడ్లను పాలల్లో వేసుకొని కలుపుకొని వాటిని తాగాల్సి ఉంటుంది. గుడ్డు వాసనతో ఇది చేయడానికి తను కాస్త ఇబ్బంది పడినా సరే, చివరికి ఈ టాస్క్ పూర్తి చేయగలిగింది. ఇక అలీ రెజా విషయానికి వస్తే, బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి వెళ్ళాల్సిన అవకాశాన్ని కేవలం తన పొరపాటు వల్లే చేజార్చుకున్నాను కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుల మద్దతు నాకు అవసరం అని చెబుతూ తనకు ఓట్లు వేయమని రిక్వెస్ట్ చేశాడు అలీ. ఇక తన టాస్క్ ఏంటంటే – రెండు చేతులతో రెండు ఇసుక మూటలకి కట్టిన తాళ్ళని బ్యాలన్స్ చేస్తూ వాటిని రెడ్ లైన్ కిందకి దించకుండా ఉంచాలి. ఈ టాస్క్ కూడా బలానికి సంబంధించింది కావడంతో కష్టమైనా సరే అలీ రెజా పూర్తి చేయడం జరిగింది.
ఆఖరుగా శ్రీముఖికి కాస్త వైవిధ్యమైన టాస్క్ రావడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే – ఒక చనిపోయిన చేప నోటిలో మౌతార్గన్ ని ఉంచడం జరిగింది. తన రెండు చేతులతో చేపని తన నోటి దగ్గర పెట్టి ఆ మౌతార్గన్ ని ప్లే చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో చేప నుండి వచ్చే వాసనని భరిస్తూ ఈ టాస్క్ పూర్తి చేయడం కాస్త సవాలే. అయినా పట్టువదలకుండా మౌతార్గన్ ని ప్లే చేసింది శ్రీముఖి.
దీనితో నామినేషన్స్ లో ఉన్న అయిదుగురు సభ్యులు కూడా కొద్దిగా కష్టమైనా సరే వారు షో చూస్తున్న వీక్షకుల మనసులు గెల్చుకునేందుకు టాస్కులు పూర్తి చేయడం జరిగింది. మరి ఈ అయిదుగురిలో వీక్షకులు ఎవరిని ఇంటికి పంపుతారో ఈ ఆదివారం తేలనుంది.
ఇక ఈరోజు జరిగే టాస్క్ హౌ క్లీన్ ఈజ్ యువర్ జర్నీ.. ఇందులో భాగంగా ఇంటి సభ్యులు మొదటి నుంచి ఇప్పటివరకూ ఎంత ఫెయిర్ గా గేమ్ ఆడారనేది ప్రేక్షకులకు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులందరూ తెలుపు రంగు దుస్తులు ధరించగా.. ఒకరు చేసిన తప్పులను మరొకరు ఎత్తి చూపి వారెందుకు ఫెయిర్ కాదో నిరూపించి వారిపై రంగు పోయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో భాగంగా వరుణ్ బాబా భాస్కర్ పై, బాబా భాస్కర్ అలీపై, శ్రీముఖి శివ జ్యోతి పై రంగులు పోస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి, ఈ టాస్క్ ఎలా సాగుతుందో రాత్రి చూడాల్సిందే.
రాహుల్ సిప్లిగంజ్ ని సున్నితంగా మందలించిన శ్రీముఖి తల్లి లత!