Cricketers who married Film Actresses
క్రికెట్ & సినిమా .. ఈ రెండిటికి మన దేశంలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పేద & మధ్య తరగతి నుండి ధనిక వర్గం వరకు ప్రజలు ఈ రెండిటికి మద్దతు తెలుపుతూనే ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే క్రికెట్ & సినిమాలని ప్రజలు తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చూస్తారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కృష్ణవంశీ – రమ్యకృష్ణల ప్రేమ చిగురించడానికి.. కారణమైన పాటేమిటో మీకు తెలుసా?
అలాగే ఈ రెండిటికి ప్రజల్లో బోలెడంత గ్లామర్ కూడా ఉంది. ఆ గ్లామర్ కారణంగా వీటితో అనుబంధం ఉన్న వారి గురించి తెలుసుకోవడానికి సామాన్యులు ఆసక్తి చూపుతుంటారు. అందులో భాగంగానే మన భారత క్రికెట్ జట్టుకి ఆడిన వారిలో కొందరిని సినీ పరిశ్రమకి చెందిన నటీమణులు వివాహం చేసుకున్నసందర్భాలున్నాయి. వారి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
* షర్మిళ ఠాగూర్ & మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ
ఒక నటీమణి మరియు ఓ క్రికెటర్ పెళ్లి చేసుకోవడం అనేది మొదలైంది మాత్రం షర్మిళ ఠాగూర్ & మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల వివాహం తోనే.. 1969లో నటి షర్మిళ ఠాగూర్ & మన్సూర్ అలీ ఖాన్‌ల వివాహం జరిగింది. అప్పట్లో వీరి వివాహం పతాక శీర్షికల్లోకి ఎక్కింది. వీరి వివాహం ఎక్కువ రోజులు కొనసాగదు అంటూ వినిపించిన మాటలకి వారు తమ ప్రేమతోనే సమాధానం చెప్పారు. వీరిరువురికి ముగ్గురు సంతానం, అందులో సైఫ్ అలీ ఖాన్ హీరో కాగా.. హీరోయిన్‌గా సోహా అలీ ఖాన్ రాణిస్తున్నారు
* రీనా రాయ్ – మొహసిన్ ఖాన్
ఈ జాబితాలో మరో వైవిధ్యమైన జంట కూడా ఉంది. ఆ జంటే – రీనా రాయ్, మొహసిన్ ఖాన్. 1970 & 80లలో స్టార్ డమ్ సంపాదించుకున్న నటీమణులలో ఒకరు రీనా రాయ్. ఆ సమయంలోనే పాకిస్తాన్ క్రికెటర్ అయిన మొహసిన్ ఖాన్‌తో ప్రేమలో పడడం, ఆ ప్రేమకి కొనసాగింపుగా 1983లో వారిరువురు వివాహం చేసుకోవడం జరిగింది. అప్పట్లో ఒక భారతీయ నటి.. పాకిస్తాన్ క్రికెటర్‌ను ప్రేమ వివాహం చేసుకోవడం అనేది సంచలనంగా మారింది. అయితే భేదాభిప్రాయాలు కారణంగా వీరిరువురు కొద్దికాలంలోనే విడిపోవడం జరిగింది.
దర్శక ధీరుడు రాజమౌళి – రమా రాజమౌళిల ఆదర్శ ప్రేమకథ మీకు తెలుసా?
* మహమ్మద్ అజహరుద్దీన్ – సంగీత బిజిలాని
భారతీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన క్రికెటర్‌గా పేరుపొందిన మహమ్మద్ అజహరుద్దీన్ 1996లో ప్రముఖ హిందీ నటి & మిస్ ఇండియా అయిన సంగీత బిజ్లానీని రెండవ వివాహం చేసుకోవడం జరిగింది. అప్పటికే ఒక వివాహ బంధంలో ఉన్న అజహరుద్దీన్ సంగీత ప్రేమలో పడిన తరువా..త మొదటి భార్యకి విడాకులు ఇచ్చి రెండవ వివాహం చేసుకున్నారు. అయితే 2010 లో వీరు విడాకులు తీసుకున్నట్టుగా వార్తలు రాగా వాటిని అజహర్ ఖండించడం జరిగింది.
* హర్భజన్ సింగ్ – గీత బస్రా
స్పిన్ మాంత్రికుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ది ప్రేమ వివాహం. ఆయన ప్రేమించింది బాలీవుడ్ నటీమణి గీత బస్రాని. వీరిద్దరూ పెళ్ళికి ముందు దాదాపు అయిదేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. ఆ ప్రేమలో సైతం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఇక వీరి ప్రేమని పెళ్లిగా మార్చుకుంది మాత్రం 2015లో… వీరిద్దరి ప్రేమ బంధానికి గుర్తుగా 2016లో హీనాయా జన్మించింది.
* యువరాజ్ సింగ్ – హ్యజెల్ కీచ్
యువరాజ్ సింగ్ ఎంత టాలెంటెడ్ క్రీడాకారుడో.. అదే స్థాయిలో ఆయనకు క్రికెట్ రంగం వెలుపల ఒక పోస్టర్ బాయ్‌గా కూడా అంతే స్థాయి పేరుంది. హీరోయిన్స్‌తో ప్రేమ వ్యవహారాలు నడిపి కూడా ఎన్నో సార్లు వార్తల్లో నిలిచాడు యువరాజ్ సింగ్. ఇక యువరాజ్ సింగ్ క్యాన్సర్‌తో పోరాడి బయటపడిన తరువాత.. ఆయనకి హ్యజెల్ కీచ్‌తో పరిచయమైంది. అయితే ఈ ఇద్దరిలో ముందుగా ప్రేమ ప్రస్తావన తెచ్చింది యువరాజేనట. దాదాపు రెండేళ్ల నిరీక్షణ తరువాత హ్యజెల్ .. యువీ ప్రేమని అంగీకరించింది. అలా వారి వివాహం 2016లో జరిగింది.
సినిమా స్టోరీని తలపించేలా.. దర్శకుడు “పూరి జగన్నాధ్ – లావణ్య”ల లవ్ స్టోరీ..!
* విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్సమెన్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న విరాట్ కోహ్లీ… దాదాపు 8 ఏళ్ళ క్రితం హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమలో పడడం జరిగింది. వీరి ప్రేమ ఎంతగా చూపరులను ఆకర్షించిందో.. అదే సమయంలో విమర్శలని సైతం ఎదురుకున్నది. విరాట్ కోహ్లీ క్రికెట్‌లో ఫామ్ కోల్పోయిన ప్రతిసారి కూ..డా దానికి అనుష్క శర్మనే పరోక్షంగా బాధ్యత వహించాల్సి వచ్చేది. ఎందుకంటే ఫామ్ కోల్పోవడానికి కారణం అనుష్క అంటూ చాలామంది ఆమెని దూషించేవారు. అయితే వీటన్నిటిని ఎదురుకుని 2017లో వివాహ బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇప్పుడు క్రికెట్ ఆడటానికి విదేశాలు వెళుతుంటే, విరాట్‌కి తోడుగా ఉండే అనుష్క శర్మని మనం చూడవచ్చు.
* సహజీవనం – నీనా గుప్తా & వివియన్ రిచర్డ్స్
పైన చెప్పుకున్న ప్రేమకథలు అన్ని ఒకెత్తయితే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే జంట మరొకెత్తు. ఇది 1980ల నాటి మాట. అప్పట్లో వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక క్రేజ్ ఉండేది. ఆయనకి మన దేశంలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది అప్పట్లో. దానికి సరైన నిదర్శనమే అప్పట్లో స్టార్ హీరోయిన్ అయిన నీనా గుప్తా & వివియన్ రిచర్డ్స్ల ప్రేమకథ. వీరి బంధానికి ప్రతిరూపంగా మసాభ గుప్తా 1989లో జన్మించింది. అయితే ఈ జంట కలిసున్నంత కాలం వివాహం చేసుకోలేదు. కేవలం సహజీవనం మాత్రమే చేశారు. వీరిద్దరి ప్రేమకథ ఇప్పటికి కూడా అటు క్రికెట్ రంగంతో పాటు.. ఇటు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్.
ఇవండీ.. క్రికెట్ స్టార్స్ & ఫిలిం స్టార్స్ ప్రేమ & పెళ్లి బంధంతో ఒకటైన వారి విశేషాల సమాహారం.
‘అమ్మ… నాన్న… ఓ మళయాళీ అమ్మాయి’ (సుమ – రాజీవ్ కనకాల ప్రేమకథ)