Astrology

17 జనవరి 2020 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Jan 17, 2020
17 జనవరి 2020 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (17 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు మీరు మీ  ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు కాస్త ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది.  ఆలుమగల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  విద్యార్థులు వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు నిరుద్యోగుల సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ఆలుమగలు తొలుత పొరపొచ్చాలు వచ్చినా తర్వాత కలిసిపోతారు. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీరు బాగా ఆలోచించి కొన్ని నిర్ణయాలను తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. వివాహితులు దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు క్రీడలు లేదా కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని విషయాలలో  మీకు మీ స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. 

కర్కాటక రాశి (Cancer) –  ఈ రోజు మీరు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే ఉద్యోగస్తుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆలుమగలు కొన్ని శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే పాతమిత్రులు మిమ్మల్ని కలుస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  

సింహ రాశి (Leo) –  ఈ రోజు ప్రేమికులకు శుభదినం. తమ బంధం గురించి ఇంట్లో వారికి చెప్పడానికి ఇదే సరైన సమయం. అలాగే అవివాహితులు శుభవార్తలు కూడా వింటారు. ఉద్యోగస్తుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రమోషన్లు దక్కడం లేదా బదిలీలు సంభవించే అవకాశం ఉంది. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు నూతన వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు ప్రత్యర్థుల నుండి సవాళ్లను ఎదుర్కొంటారు. ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరి పట్ల మరొకరు నిజాయతీతో వ్యవహరించడం మంచిది. విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల వైపు మొగ్గు చూపిస్తారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలి. వివాహితులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు ఖరీదైన బహుమతులను అందుకుంటారు.  కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు వ్యాపారస్తులు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రుణాలు ఇవ్వడం లేదా తీసుకొనే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఆలుమగల మధ్య కూడా మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. 

ధను రాశి (Saggitarius) –  ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించండి. అలాగే ఆఫీసులో అనుకోని ఒత్తిడి మధ్య మీరు పని చేయాల్సి ఉంటుంది. అలాగే పెండింగ్ పనులు పెరుగుతాయి.  వ్యాపారస్తులు సరికొత్త  నిర్ణయాలు తీసుకొనేటప్పుడు పునరాలోచించుకుంటే మంచిది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు ప్రేమికుల సంబంధాలు పటిష్టంగా మారతాయి. అలాగే మీ కష్టకాలంలో మీరు మీ స్నేహితులు లేదా సోదరుల సహాయం తీసుకుంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మహిళలు స్వయం ఉపాధి పై ఆసక్తి చూపిస్తారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) –  ఈ రోజు నిరుద్యోగులు కొంచెం కష్టపడితే.. ఊహించిన అవకాశాలు మీ తలుపు తడతాయి. అలాగే వ్యాపారస్తులు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలో పురోగమనం ఉంటుంది. విద్యార్థులు కొన్ని విషయాలలో నిర్లక్ష్యాన్ని వీడాలి. 

మీన రాశి (Pisces) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వ్యాపారస్తులు ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. ఉద్యోగస్తులు పలు సెమినార్లు లేదా మీటింగ్‌లకు హాజరవుతారు. మహిళలు కొన్ని విషయాలలో.. తల్లిదండ్రుల నుండి అన్ని విధాలుగా సహాయ, సహకారాలు పొందుతారు. 

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి

 

Read More From Astrology