
ఈ రోజు (2 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..
మేషం (Aries) – ఈ రోజు ఆలుమగల బంధాలలో పొరపొచ్చాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలలో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవడం మంచిది. అలాగే మీ భాగస్వామితో కలిసి ఏకాంతంగా గడపడానికి ప్రయత్నించండి.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ప్రకృతితో మమేకమై జీవిస్తారు. తోటపని లేదా వ్యవసాయ పనులు చేయడానికి పూనుకుంటారు. లేదా వనభోజనాలకు, పిక్నిక్‌లకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా కొంత శారీరక ఒత్తిడికి కూడా గురవుతారు.
మిథునం (Gemini) – ఈ రోజు మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మీ స్నేహితుల మద్దతు కూడా పొందుతారు. అలాగే మీరు వేసే ప్రతి అడుగు.. ఆచితూచి వేయడం మంచిది. ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మొగ్గు చూపిస్తారు. అలాగే దూర ప్రాంతాలను సందర్శిస్తారు. ఆలుమగలు తమ భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలను రచిస్తారు. విద్యార్థులు ప్రత్యమ్నాయ కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తారు.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..
సింహం (Leo) – ఈ రోజు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి.. కొత్త ప్రణాళికలు రచిస్తారు. అయితే వక్ర మార్గాన కాకుండా.. నిజాయతీగానే ప్రయత్నించండి. మీ శ్రమకు తగిన ఫలితం కచ్చితంగా లభిస్తుంది. అలాగే కొన్ని విషయాలలో సన్నిహితుల మద్దతు తీసుకోండి.
కన్య (Virgo) – ఈ రోజు మీరు మీ మనసు చెప్పినట్లే చేయండి. ఇతరుల మాటలతో ప్రభావితమై.. మీ ఆలోచనలను మార్చుకోవద్దు. కొత్త నిర్ణయాలు తీసుకొనేటప్పుడు కూడా.. మీకు ఏది శ్రేయస్కరమని భావిస్తారో.. అదే పని చేయడానికి ప్రయత్నించండి.
సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?
తుల (Libra) – ఈ రోజు మీ ప్రశ్నలకు సరైన జవాబులు దొరుకుతాయి. అలాగే కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కొన్ని విషయాలలో పరిస్థితులు చేదాటక మునుపే.. అప్రమత్తమై మేల్కొంటారు. ప్రత్యర్థుల సవాళ్లను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొన్ని విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. తల్లిదండ్రులు పిల్లలను ఒక కంట కనిపెట్టడం అత్యంత అవసరం.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ పనులన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అనుకోని రీతిలో కొత్త ఆదాయ మార్గాలను పొందుతారు. వ్యాపారస్తులు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు క్రీడలు లేదా కళల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. ఆలుమగల బంధాలు కూడా పటిష్టంగా మారతాయి.
మకరం (Capricorn) – ఈ రోజు మీకు చాలా విలువైన రోజు. మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంటుంది. విద్యార్థులకు విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంటుంది. నిరుద్యోగులు కూడా మంచి ఉపాధి అవకాశాలను పొందుతారు.
కుంభం (Aquarius) – ఈ రోజు మీరు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాయిదా పడిన పనులను పూర్తి చేసుకోవడం మంచిది. ఆఫీసులో పని ఒత్తిడి ఉంటుంది. అయినా సరే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి.
మీనం (Pisces) – ఈ రోజు మీరు ఒంటరిగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే పలు శుభకార్యాలకు హాజరవుతారు. మీ వ్యాపారంపై ఇతరుల ప్రభావం పడుతుంది. అయినా సరే నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు వెళ్లండి. కొన్ని విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించండి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.
ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.