Astrology

02 జనవరి 2020 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

Rama Shukla  |  Jan 1, 2020
02 జనవరి 2020 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

ఈ రోజు (02 జనవరి 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఆలుమగల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినా.. తర్వాత సర్దుకుపోతారు. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు వివాదాలకు దూరంగా ఉండాలి. 

వృషభం (Tarus) – మీరు ఈ రోజు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆఫీసులో పెండింగ్ పనులను పూర్తిచేస్తే మంచిది. విద్యార్థులు తల్లిదండ్రుల సలహాలను పెడచెవిన పెట్టకుండా ఉండాలి. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంది. అలాగే ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. అదేవిధంగా కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాలను జీవిత భాగస్వామి వద్ద దాపరికం లేకుండా చెప్పేయడం మంచిది.

కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు పలు సభలు, సమావేశాలతో బిజీగా ఉంటారు. అలాగే సీనియర్‌లతో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఏజెంట్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) – ఈ రోజు మీరు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ప్రేమికులు కొన్ని విషయాలలో సమస్యలను తామంతట తామే పరిష్కరించుకోవాలి. వివాహితులు కొన్ని అనుకోని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. భాగస్వామితో చర్చించాలి. 

క‌న్య (Virgo) – ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. అదేవిధంగా సామాజిక సంస్థల నుండి గౌరవాన్ని పొందుతారు.

‘డిసెంబరు’ నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా ‘ప్రత్యేకం’ : ఎందుకో తెలుసా..?

తుల (Libra) – ఈ రోజు మీరు ఊహించని వార్తలు వింటారు. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి మొగ్గు చూపిస్తారు. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహితులు అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి చెప్పడం మంచిది. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాలి. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీకు అనుకోని ఆర్థిక నష్టం కలుగుతుంది. అలాగే వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాలలో అనుకోని ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరితో ఒకరు నిజాయతీగా ఉండడం మంచిది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే వ్యాపారస్తులు వాణిజ్య విస్తరణకు ప్రణాళికలు రచిస్తారు. అదేవిధంగా పాత స్నేహితులను కూడా కలుస్తారు. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అదేవిధంగా ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త వహించండి.

మకరం (Capricorn) –  ఈ రోజు మీకు మీ భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రుణాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారస్తులు తలకు మించిన  బాధ్యతలు స్వీకరిస్తారు. అదేవిధంగా సాఫ్ట్‌వేర్ లేదా కంప్యూటర్ రంగాలలో పురోగతి ఉంటుంది.

కుంభం (Aquarius) – ఈ రోజు మీరు అనుకోని ఇబ్బందులలో చిక్కుకుంటారు. అలాగే నిరుద్యోగులు నిర్లక్ష్యాన్ని వీడాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు కళలు లేదా క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వివాహితులు దూర ప్రయాణాలకు స్వస్తి పలకండి.  డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.

మీనం (Pisces) – ఈ రోజు అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. అలాగే వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. సరికొత్త ఆర్థిక వనరులు వ్యాపారానికి ప్రయోజనం చేకూరుస్తాయి.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.
 

Read More From Astrology