Astrology

20 జనవరి 2020 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Jan 20, 2020
20 జనవరి 2020 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (20 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) –  ఈ రోజు అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. మీకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆలుమగల బంధాలు కూడా పటిష్టమవుతాయి. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంది. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు ఆలుమగలు దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు క్రీడలు లేదా కళలపై ఆసక్తి చూపిస్తారు. నిరుద్యోగులు స్వయంఉపాధి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అలాగే కుటుంబ వివాదాలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవాలి. అదేవిధంగా జీవిత భాగస్వామితో అవనసర తగాదాలు పెట్టుకోకుండా ఉంటే శ్రేయస్కరం. 

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఊహించని లాభాలు కలిసొస్తాయి. అలాగే పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి మంచి విషయాలను వింటారు.  విద్యార్థులు ఇంకా కష్టపడాలి. 

సింహ రాశి (Leo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొన్ని విషయాలలో సానుకూలంగా ఆలోచించడం మంచిది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థుల సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కుటుంబ వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహితులు ముఖ్యమైన వేడుకలకు హాజరవుతారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆలుమగలు తొలుత అభిప్రాయ భేదాలు వచ్చినా.. ఆ తర్వాత సర్దుకుపోతారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే అనుకోని వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అలాగే కొన్ని ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి  ఇదే సరైన సమయం. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ప్రేమికులకు శుభదినం. వారు తమ జీవితానికి సంబంధించి ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అలాగే వివాహితులు దూర ప్రాంతాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. 

ధను రాశి (Saggitarius) – ఈ రోజు మీరు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే తమ జీవితానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. సినీ రంగంలో ప్రయత్నాలు చేసే వ్యక్తులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు నిరుద్యోగులు కొంచెం కష్టపడితే అనుకోని అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ఉద్యోగస్తుల కెరీర్‌కు  సంబంధించి మార్పులు, చేర్పులు ఉంటాయి. వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. వివాహితులు పలు శుభవార్తలు వింటారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొంత ఆందోళనకు గురవుతారు. అదేవిధంగా ఎంత కష్టపడినా.. ఫలితం దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. కొన్ని విషయాలలో తల్లిదండ్రులు లేదా భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకోవాలి. అలాగే వివేకంతో వ్యవహరించాలి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు కెరీర్ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి

 

Read More From Astrology