Astrology

21 జనవరి 2020 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Jan 21, 2020
21 జనవరి 2020 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (21 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు మీరు మీ పాత స్నేహితులను కలుస్తారు. అలాగే వ్యాపార వివాదాలు సమసిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా మీ భాగస్వామ్యం పెరుగుతుంది. ఆఫీసులో అధికారుల నుండి మీకు మద్దతు ఉంటుంది. అలాగే కెరీర్ పరమైన సవాళ్లను దీటుగా ఎదుర్కొంటారు.

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు నిరుద్యోగులకు శుభదినం. అనుకోని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. మహిళలకు కొత్త పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు వివాహితులకు శుభదినం. మీ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు ఇంకొంచెం శ్రమించాలి. విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి చూపిస్తారు. 

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు మీరు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెండింగ్ పనులను పూర్తి చేయడం మంచిది. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మహిళలకు నూతన ఆదాయ వనరులు సమకూరుతాయి. 

సింహ రాశి (Leo) –   ఈ రోజు మీరు వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకండి.  అదేవిధంగా వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆఫీసులో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. 

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు మీ ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించడం మంచిది. అలాగే కొన్ని విషయాలలో మీకు మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అలాగే పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. వివాహితులకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

తుల రాశి (Libra) – ఈ రోజు మీరు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే విలువైన బహుమతులు లేదా ఆఫర్లను స్వీకరిస్తారు. వ్యాపారస్తులకు కూడా సులభ ధన యోగం ఉంటుంది. అలాగే ఆలుమగలకు విదేశీ ప్రయాణ యోగం సిద్ధిస్తుంది.  నిరుద్యోగులు కూడా మంచి ఉపాధి అవకాశాలను పొందుతారు. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. మీ వ్యాపారంపై మీ ప్రత్యర్థుల ప్రభావం పడుతుంది.  అయినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. కొన్ని విషయాలలో వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. 

ధను రాశి (Saggitarius) – ఈ రోజు మీకు మానసిక ఒత్తిడి ఉంటుంది. అలాగే అధికారులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అయినా సరే.. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీ నిజాయతీయే మీకు శ్రీరామరక్ష. అలాగే కోపాన్ని నియంత్రించుకోండి. వ్యాపారస్తులకు వాణిజ్య ఒప్పందాలు రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఖర్చులు పెరుగుతాయి. అలాగే సినిమా లేదా క్రియేటివ్ రంగాలలో పెట్టుబడులు పెడతారు.  వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కొత్త నిర్ణయాలు తీసుకొనేటప్పుడు భాగస్వామితో ఓసారి చర్చించండి

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

కుంభ రాశి (Aquarius) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు శారీరక శ్రమతో కొంత ఒత్తిడికి గురవుతారు. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత కష్టపడాలి. వ్యాపారస్తులు  ఆదాయ, వ్యయాలను నియంత్రించుకోవాలి. ప్రేమికుల సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే కొన్ని విషయాలు మిమ్మల్ని అసహనానికి, ఆందోళనకు గురిచేయవచ్చు. ఇలాంటి సమయాలలోనే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే మంచిది. అదేవిధంగా వృత్తిపరమైన బాధ్యతలు పెరుగుతాయి. 

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి

 

Read More From Astrology