Astrology

29 డిసెంబరు 2019 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Dec 29, 2019
29 డిసెంబరు 2019 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (29 డిసెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు వివాహితులు పలు శుభవార్తలు వింటారు. అనుకోని అవకాశాలు మీ తలుపు తడతాయి. అదేవిధంగా మీ కుటుంబ బంధాలు కూడా పటిష్టంగా మారతాయి. ఆఫీసులో ఉద్యోగులకు సరదా వాతావరణం ఉంటుంది. కొన్ని పనులను బద్దకాన్ని వీడి చేయడం మంచిది. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు విద్యార్థులకు కళలు లేదా క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది.  నిరుద్యోగులు ప్రలోభాలకు గురై.. డబ్బులు కట్టి మోసపోవద్దు.  వ్యాపారస్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగరూకతతో వ్యవహరించాలి. 

మిథున రాశి (Gemini) –   ఈ రోజు మీరు పలు శుభవార్తలు వింటారు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు ప్రత్యర్థుల నుండి సవాళ్లను స్వీకరిస్తారు.  వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. 

కర్కాటక రాశి (Cancer) –  ఈ రోజు విద్యార్థులు నిర్లక్ష్యం కారణంగా.. ఎన్నో మంచి అవకాశాలను కోల్పోతారు. నిరుద్యోగులు కూడా బద్ధకాన్ని వీడి.. కొంచెం శ్రమిస్తే ఫలితం లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించడం మేలు. అలాగే కొన్ని వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది.  

సింహ రాశి (Leo) –  ఈ రోజు మీరు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే సన్నిహితులతో ఏర్పడిన అపార్థాలు కూడా తొలిగిపోతాయి.  అక్కరకు రాని స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషమ పరిస్థితులలో సంయమనం పాటించండి. నిరుద్యోగులు ప్రత్యమ్నాయ రంగల వైపు ఆసక్తి చూపిస్తారు.

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీ ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా.. ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు మీలో అసహనాన్ని కలిగించవచ్చు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.  విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.  వ్యాపారస్తులకు భాగస్వామ్యం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

తుల రాశి (Libra) – ఈ రోజు  ఆస్తి లావాదేవీలు లేదా కోర్టు కేసులు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి.  మీ జీవితానికి సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.  అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. వివాహితులు పలు శుభవార్తలు వింటారు. అలాగే మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే సంఘటనలు కూడా జరుగుతాయి. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు అనుకోని వివాదాలు మిమ్మల్ని చుట్టు ముడతాయి.  ఇలాంటి సమయంలోనే మనో దైర్యంతో ముందుకు వెళ్ళాలి. అలాగే కొన్ని సమస్యలను పరిష్కరించే విషయంలో.. నిదానంగా వ్యవహరించాలి. ముఖ్యంగా  మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. 

ధను రాశి (Saggitarius) –  ఈ రోజు మీరు తీసుకొనే కొత్త నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తాయి. అలాగే సన్నిహితులతో ఒప్పందాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. ఖర్చుల విషయంలో పొదుపు సూత్రం పాటించండి. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

మకర రాశి (Capricorn) –    ఈ రోజు మీరు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను చేసుకొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆలుమగల సంబంధాలు కూడా పటిష్టంగా మారతాయి. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే మంచి అవకాశం. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. 

కుంభ రాశి (Aquarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలు వింటారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా పురోగతి కనిపిస్తుంది. మహిళలు కొత్త ఆదాయ వనరులను సమకూర్చుకుంటారు. ప్రేమికులు తమ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా.. ఆ తర్వాత మళ్లీ సర్దుకుపోతారు.   

మీన రాశి (Pisces) – ఈ రోజు మీరు ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. అలాగే వ్యాపార లావాదేవీలు అన్నింటికీ కొన్ని రోజులు దూరంగా ఉండాలని భావిస్తారు. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చూపించండి.  కొన్ని అనుకోని సంఘటనలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

Read More From Astrology