
ఈ రోజు (జూన్ 29) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు వ్యాపార రంగంలోని వ్యక్తులకు.. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. అలాగే శుభవార్తలు కూడా వింటారు. అయితే కుటుంబ జీవితంలో మాత్రం మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కనుక కాస్త సంయమనంతో సమస్యలను ఎదుర్కోండి. అదేవిధంగా పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. ముఖ్యంగా ఎన్ని సమస్యలున్నా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి.
వృషభం (Tarus) – ఈ రోజు విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో వ్యవహరించాల్సిన సమయం. పోటీ పరీక్షలు రాసే వ్యక్తులు బాగా కష్టపడితే.. విజయాన్ని సాధించగలరు. అలాగే ఉద్యోగస్తులు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. పలు సవాళ్లనూ ఎదుర్కోవలసి ఉంటుంది. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే కుటుంబ కలహాలకు దూరంగా ఉండండి. ప్రేమతో, శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోండి.
మిథునం (Gemini) – ఈ రోజు పలు ఆరోగ్యపరమైన సమస్యలు మీకు ఎదురుకావచ్చు. అలాగే బయటకు వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో ఊహించని సంఘటనలు జరగవచ్చు. స్థాన చలనం లేదా బదిలీలు సంభవించవచ్చు. అలాగే ప్రత్యర్థుల నుండి సవాళ్లు కూడా ఎదురుకావచ్చు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. భాగస్వామితో ఆచితూచి మాట్లాడండి. నెరవేర్చదగ్గ హామీలు మాత్రమే ఇవ్వండి.
కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు మీ భాగస్వామి కోసం సాధ్యమైనంత ఎక్కువ సమయం కేటాయించండి. తన మనసులోని భావాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ విధంగా చేయడం ద్వారా ఎంతో ప్రేమను, అభిమానాన్ని పొందుతారు. సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఈ రోజు శుభదినం. ఇక వృత్తిగత జీవితానికి వస్తే.. ఈ రోజు మీరు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. సమస్యలున్నా.. ఆత్మస్థైర్యంతో వాటిని పరిష్కరిస్తారు.
సింహం (Leo) – ఈ రోజు మీరు ఓ శుభవార్త వింటారు.అలాగే మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. పలువురు పాత మిత్రులను కూడా కలుస్తారు. ముఖ్యంగా ఈ రోజు మీకు సంఘంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక వృత్తిగత జీవితంలో కొన్ని సమస్యలున్నా.. వాటిని మీరు మీ తెలివితేటలతో పరిష్కరిస్తారు. ముఖ్యంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు.
కన్య (Virgo) – ఈ రోజు ఆర్థికపరమైన లావాదేవీలు చేయడానికి అనువైన దినం కాదు. కనుక కాస్త జాగరూకతతో వ్యవహరించండి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు నూటికి పదిసార్లు ఆలోచించండి. ఇక ఉద్యోగస్తులకు ఈ రోజు ఎంతో ఒత్తిడి ఉంటుంది. పని కూడా అధికంగా ఉంటుంది. ఈ సమయంలో కాస్త వివేకంగా ఆలోచించి.. ఒక ప్రణాళికబద్ధంగా అనుకున్న పనులు చేయండి. విద్యార్థులు కూడా కష్టపడి చదవాల్సిన సమయం ఇది. పోటీ వాతావరణాన్ని తట్టుకోవాలి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే ప్రేమ బంధంలో ఉన్నవారు.. తమ భవిష్యత్తు గురించి ఒక క్లారిటీతో వ్యవహరించాల్సి ఉంటుంది.
ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట
తుల (Libra) – ఈ రోజు మీ వ్యాపార లావాదేవీలు స్థిరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో కాస్త ఉద్రిక్త వాతావరణాన్ని చూసే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లోనే సంయమనంతో వ్యవహరించండి. అధికారుల నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకోండి. పాజిటివ్‌గా ఆలోచించండి. ఇక విద్యార్థులకు ఈ రోజు శుభదినం. తాము కోరుకున్న లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంది. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీరు ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ అనుకోకుండా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ భాగస్వామితో ఏర్పడే వివాదాలు వేగంగానే పరిష్కారమవుతాయి.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీ కుటుంబ వివాదాలు తారాస్థాయికి చేరుకొనే అవకాశాలు ఉన్నాయి. కనుక సమయస్ఫూర్తితో వ్యవహరించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. అలాగే మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎదుటివారి సమస్యలను కూడా అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులో అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దు. వ్యాపారస్తులకు మాత్రం ఈ రోజు శుభదినం. అనుకోని లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. విద్యార్థులు కూడా తాము అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారు.
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మిమ్మల్ని పలు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. కనుక ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఉద్యోగస్తులకు స్థాన చలనం సంభవించే అవకాశం ఉంది. కనుక కెరీర్ విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. రాజకీయరంగంలో వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు ఈ రోజు శుభదినం.
ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?
మకరం (Capricorn) – ఈ రోజు ఉద్యోగస్తులకు శుభదినం. ప్రమోషన్లు లేదా పదోన్నతులు రావచ్చు. ఇక వ్యాపార రంగంలోని వ్యక్తులు కూడా లాభాలు పొందే అవకాశం ఉంది. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. కుటుంబంలో ఏర్పడే మనస్పర్థలను తొలిగించుకోవడానికి ప్రయత్నించండి. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది.
కుంభం (Aquarius) – ఈ రోజు మీ భాగస్వామితో ఏర్పడే వివాదాలను పరిష్కరించుకోండి. అప్పుడే పరస్పర సంబంధాలు బలంగా ఉంటాయి. ప్రేమికులు కూడా ఒకరితో ఒకరు నిజాయతీగా వ్యవహరించండి. అప్పుడే వివాహానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంది. ఉద్యోగస్తులు ప్రత్యమ్నాయ కెరీర్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు లాంటివి ఒక కొలిక్కి వస్తాయి.
మీనం (Pisces) – ఈ రోజు మీరు నిర్లక్ష్యాన్ని వీడండి. లేదంటే దాని వల్ల మీరు మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అయితే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యక్తిగత జీవితానికి వస్తే.. మీ భాగస్వామితో ఈ రోజు ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలిసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ కథను కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.