Astrology

4 డిసెంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Dec 4, 2019
4 డిసెంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (4 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు కొందరు వ్యక్తుల  సహవాసం మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అలాగే అవివాహితులు ప్రేమలో పడే అవకాశం ఉంది. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి విజయానికి కృషి చేయాల్సి ఉంది. అలాగే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు  వృత్తి జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారస్తులు వాణిజ్య ఒప్పందాలను ముగించే అవకాశం ఉంది. విద్యార్థులకు రాజకీయాలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే ప్రేమ సంబంధాలు బలంగా మారతాయి. 

మిథునం (Gemini) – ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే సూచనలు కనిపిస్తున్నాయి. సృజనాత్మక రంగంలోని వ్యక్తులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. అలాగే మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.

కర్కాటకం (Cancer) –  ఈ రోజు విద్యార్థులు మరింత కష్టపడాలి. ఏకాగ్రతను కాపాడుకోండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో సీనియర్‌లతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) – ఈ రోజు మీరు అధిక పనిభారంతో సతమతమవుతారు. అలాగే ఎంతో అలసటకు గురవుతారు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశి వ్యక్తులకు తమ భాగస్వామి నుండి అన్ని విషయాలలో మద్దతు ఉంటుంది. అలాగే పలు శుభవార్తలు వింటారు. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ప్రియమైన వ్యక్తుల నుండి అనుకోని శుభవార్తలు వింటారు. అదే విధంగా, సమాజంలో సంపద, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ భాగస్వామి మీకు అన్ని విషయాలలోనూ తోడ్పాటును అందిస్తారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

తుల (Libra) – ఈ రోజు  వ్యాపారస్తులకు అంతా లాభసాటిగా ఉంటుంది. ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. మీ ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో, విందు వినోదాలలో విరివిగా పాల్గొంటారు. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వాహనాల నిర్వహణ ఖర్చులు పెరగవచ్చు. ఆన్ లైన్ బ్యాంకింగ్ లేదా ఇతర లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాలలో మీ జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఒత్తిడితో పని చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే పలు శుభవార్తలు వింటారు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణలు చేస్తారు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే కొత్త వాహనాల కొనుగోలుకు ప్లాన్ చేస్తారు.

కుంభం (Aquarius) – ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆఫీసు ఒత్తిడిలో పడి కుటుంబీకులకు సమయం కేటాయించడం మర్చిపోవద్దు. కొన్ని అనుకోని ఆహ్వానాలు మీకందుతాయి. అలాగే ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంటుంది. 

మీనం (Pisces) –  ఈ రోజు  రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. కొన్ని ఆర్థిక లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పాత స్నేహితులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. అయితే అక్కరకు రాని స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

 

 

Read More From Astrology