Astrology

6 డిసెంబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Dec 6, 2019
6 డిసెంబరు 2019 (శుక్రవారం,  ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (06 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు మీరు అనుకోని కుటుంబ సమస్యలతో బాధపడతారు. అలాగే కొంత మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. కొందరు వ్యక్తులను మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. ఆఫీసులో సీనియర్‌లతో విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

వృషభం (Tarus) – ఈ రోజు మీకు కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. ఆస్తి సంబంధిత లావాదేవీలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వాణిజ్య ఒప్పందాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి.

మిథునం (Gemini) – ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల  నుండి పలు శుభవార్తలు వింటారు. అలాగే జీవిత భాగస్వామితో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొందరు పాత స్నేహితులను కూడా కలుస్తారు. వ్యాపారస్తులకు వాణిజ్య ఒప్పందాలు రద్దు అయ్యే అవకాశం ఉంది.

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఆఫీసులో అర్థరహిత సమస్యలు తలెత్తుతాయి. అలాగే మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన ఆర్థిక విషయాలలో రిస్క్ తీసుకోకుండా ఉంటే మంచిది. దూర పర్యటనలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కుటుంబ చర్చలలో పాలుపంచుకుంటారు. ఆస్తికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.  అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అదేవిధంగా కొన్ని సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

క‌న్య (Virgo) – ఈ రోజు మీరు ఆలస్యంగా పనులు చేయడం వల్ల.. అనుకోని ఇబ్బందులలో పడతారు. అలాగే అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు వృత్తిపరమైన ప్రయాణాలు మీకు అవరోధంగా మారతాయి. అలాగే విద్యార్థులకు రాజకీయాలపై ఆసక్తి పెరుగుతుంది.

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

తుల (Libra) – ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే వ్యాపారస్తులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు.

వృశ్చికం (Scorpio) – ఈ రోజు అవివాహితులు ప్రేమలో పడే అవకాశం ఉంది. అలాగే ఆలుమగల సంబంధాలు పటిష్టంగా మారతాయి. ఈ రాశి వారికి విదేశీ ప్రయాణయోగం కూడా ఉంది. రాజకీయ రంగంలోని వ్యక్తులకు మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు మంచి విషయాలను వింటారు.  అలాగే విద్యార్థులు తాము కోరుకున్న రంగాలలో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో రాణిస్తారు. వ్యాపారస్తులు సామాజిక గౌరవాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం కూడా ఉంది. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా షాపింగ్ చేసేటప్పుడు లేదా డబ్బు బదిలీ చేసేటప్పుడు అప్రమత్తతతో వ్యవహరించాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్లను నమ్మే విషయంలో జాగరూకతతో వ్యవహరించాలి. 

కుంభం (Aquarius) – ఈ రోజు ఈ రాశి  వ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ప్రియమైన వ్యక్తుల నుండి శుభవార్తలు వింటారు.  ఆలుమగలు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు కొన్ని పనులను ముందస్తు ప్రణాళికతో చేయడం శ్రేయస్కరం. 

మీనం (Pisces) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఆత్మ విశ్వాసంతో ముందుకుపోవాలి. అలాగే తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండడం మంచిది.  అలాగే కొన్ని విషయాలలో కోపాన్ని నియంత్రించుకోవాలి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

Read More From Astrology