Astrology

13 ఆగస్టు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

Rama Shukla  |  Aug 12, 2019
13 ఆగస్టు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 13, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ పాత మిత్రులను కలుస్తారు. అలాగే తమ తోబుట్టువుల నుండి సహాయాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రేమికులు కొన్ని విపత్కర పరిస్థితుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలు వింటారు. విద్యార్థులు ప్రత్యమ్నాయ కెరీర్స్ వైపు ఆసక్తి చూపిస్తారు. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. ఉద్యోగస్తులకు బదిలీలు సంభవించే అవకాశం ఉంది. వ్యాాపారస్తులకు ఆర్థికంగా చాలా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులను టేకప్ చేస్తారు. అయితే ఏజెంట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

మిథునం (Gemini) – ఈ రోజు నిరుద్యోగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. అప్పుడే లక్ ఫ్యాక్టర్ మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో కొన్ని విపత్కర పరిస్థితులలో చిక్కుకోవచ్చు. కనుక కాస్త జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండడం మంచిది. వివాహితులు భాగస్వామితో గొడవ పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో సహనంతో వ్యవహరించండి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ వివాదాలను నేర్పుతో, సమయస్ఫూర్తితో పరిష్కరించడానికి ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు, కొన్ని సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. మీకు మీరే పరిష్కరించుకోవడం మంచిది. మీకు అన్ని వేళలా మీ భాగస్వామి మద్దతు ఉంటుంది. వ్యాపారస్తులు బిజినెస్‌ను విస్తరించడానికి ఇదే సరైన సమయం. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో కోపాన్ని నియంత్రించుకోవాలి. సహనంతో వ్యవహరించాలి. వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఆఫీసులో ఉద్యోగస్తులకు ప్రత్యర్థుల నుండి సవాళ్లు ఎదురుకావచ్చు. వాటిని దీటుగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. నిజాయతీగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు ఎదురుకావచ్చు. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. అలాగే ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ రోజు వివాహితులకు.. తమ భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. సమస్యను ఎదుటి వ్యక్తి వైపు నుండీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

తుల (Libra) – ఈ రోజు స్టాక్ మార్కెట్ రంగానికి చెందిన వ్యక్తులకు అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. విద్యార్థులు ప్రత్యమ్నాయ కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగంలోని వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు వ్యాపారస్తులు పలు కీలక ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వివాహితులు తమ భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే ఉద్యోగస్తులకు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత కష్టపడి పనిచేయాల్సిన సమయం ఇది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) –  పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు.. పాఠ్యాంశాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆఫీసులో ఉద్యోగులకు అధిక పని ఒత్తిడి ఉంటుంది. అలాగే ప్రత్యర్థుల నుండి సవాళ్లు ఎదురవుతాయి. వివాహితులు భాగస్వామికి సంబంధించిన ఓ విషయంలో భావోద్వేగానికి గురవుతారు. 

మకరం (Capricorn) –  ఈ రోజు వ్యాపారస్తులకు లాభసాటిగా గడుస్తుంది. ముఖ్యంగా మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులు కూడా ఈ రోజు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా పనిచేస్తారు. ముఖ్యంగా పలు శుభవార్తలు వింటారు. వివాహితులకు తమ భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలు వింటారు. 

మీనం (Pisces) – ఈ రోజు తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో ఈ రాశి వ్యక్తులు కాస్తా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు సిఫార్సుల కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. రాజకీయ రంగ వ్యక్తులు కొన్ని అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు. ఉద్యోగులకు ప్రత్యర్థుల నుండి సవాళ్లు ఎదురవుతాయి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

Read More From Astrology