
ఈ రోజు (జులై 2) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు మీరు స్థిర ఆస్తుల రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఆధునిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులు పనిలో అడ్డంకులను అధిగమిస్తారు. విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా బాగా కష్టపడి చదవాలి. వారికి క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. ఇక కుటుంబ జీవితానికి వస్తే.. మీకు మీ భాగస్వామికి మద్దతు లభిస్తుంది.
వృషభం (Tarus) – ఈ రోజు ప్రేమికులకు ఏదో ఒక విషయంలో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి విషయాల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా సమస్యలను పరిష్కరించుకోవడం బెటర్. అలాగే ఈ రోజు మీరు పలు ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ప్రత్యర్థుల సవాళ్లను దీటుగా ఎదుర్కొంటారు. అలాగే కోర్టు లావాదేవీలు, కేసులు వంటివి ఒక కొలిక్కి వస్తాయి.
మిథునం (Gemini) – ఈ రోజు మీ ఆఫీసులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొనే అవకాశం ఉంది. కనుక సహనంతో వ్యవహరించండి. పలు వివాదాల్లో మీరు భాగస్వాములు కాకుండా ఉంటే మంచిది. నిజాయతీగా ఉంటేనే.. మీకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఇక కుటుంబ జీవితానికి వస్తే.. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అయితే వాహన వినియోగం లేదా ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.
కర్కాటకం (Cancer) – ఈ రోజు మీ కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆస్తి లావాదేవీలు, చట్ట సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమికులు అన్ని మనస్పర్థలను దూరం చేసుకొని.. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. ఆలుమగలు తమ జీవితానికి సంబంధించి సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. ఉద్యోగస్తులకు స్థాన చలనం జరిగే అవకాశం ఉంది.
సింహం (Leo) – ఈ రోజు వ్యాపార రంగంలోని వారికి ప్రత్యర్థుల నుండి పోటీ ఎదురవుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.విద్యార్థులు ప్రతికూల ఆలోచనలతో రోజును ప్రారంభించినా.. తర్వాత మళ్లీ స్ఫూర్తిని పొందుతారు. ప్రేమికులు తమ బంధం గురించి పెద్దవాళ్లకు చెప్పడానికి ఇది అనువైన రోజు. ఆలుమగలు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఈ రాశివారికి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
కన్య (Virgo) – ఈ రోజు మీ ఆరోగ్య విషయంలో పూర్తిగా శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. ఉద్యోస్తులకు కెరీర్ పరంగా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆలుమగల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహన వినియోగంలో జాగ్రత్తగా ఉండండి.
ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట
తుల (Libra) – ఈ రోజు మీ సోదరి లేదా సోదరుడితో పలు విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఆ అపార్థాల నుండి వేగంగానే బయటపడతారు. అలాగే ఆదాయ-వ్యయాలపై నియంత్రణ ఉండాల్సిన సమయమిది. అదేవిధంగా వ్యాపారస్తులకు ఇది చాలా శుభదినం. కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. ఉద్యోగస్తులు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. అధికారుల నుండి వారికి కావాల్సిన సహాయ, సహకారాలు కూడా అందుతాయి.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఆఫీసులో మీరు పడిన కష్టానికి ఫలితం లభిస్తుంది. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. విద్యార్థులలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంది. ప్రేమికులు ఒక అనుకోని సంఘటనను ఎదుర్కొంటారు. ఆలుమగలు తమ మధ్య విభేదాలు ఏర్పడినా.. ఆ తర్వాత ఆ సమస్యలను వేగంగా పరిష్కరించుకుంటారు. సృజనాత్మక రంగంలోని వారికి పురోగతి ఉంటుంది.
ధనుస్సు (Saggitarius) – నిరుద్యోగులకు ఈ రోజు అనుకోని అవకాశాలు లభిస్తాయి. అయితే మీ సమయస్ఫూర్తిని బట్టే ఆ అవకాశాలు నిలబడతాయి. వ్యాపారవేత్తలు పలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు క్రీడల పై ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులు తమ సమస్యల పరిష్కారదిశగా ఆలోచిస్తారు. ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంటారు. ఆలుమగలు ప్రయాణాల పట్ల మొగ్గు చూపుతారు.
ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?
మకరం (Capricorn) – ఈ రోజు సాధ్యమైనంత వరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడానికి ప్రయత్నించండి. ఆ విధంగా మీ మానసిక ఒత్తిడిని దూరం చేసుకోండి. అలాగే కుటుంబానికి సాధ్యమైనంత ఎక్కువ సమయం కేటాయించండి. ఈ రోజు మిమ్మల్ని కలవడానికి మీ పాత మిత్రులు వస్తారు. వ్యాపారస్తులు కొన్ని ఎమర్జన్సీ పనులను టేకప్ చేస్తారు. ఈ క్రమంలో పలు దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది.
కుంభం (Aquarius) – ఈ రోజు వివాహా ప్రయత్నాలకు అనువైన రోజు కాదు. అలాంటి యోచన ఉంటే వాయిదా వేసుకుంటే బెటర్. అలాగే ఉద్యోగస్తులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారవేత్తల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఆలుమగల మధ్య కూడా అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశముంది. ఈ క్రమంలో భావోద్వేగాలతో కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు. సృజనాత్మక రంగంలోని వారికి పనిలో పురోగతి ఉంటుంది.
మీనం (Pisces) – ఈ రోజు మీరు నిర్లక్ష్య ధోరణిని వీడాలి. లేకపోతే కొన్ని అనుకోని పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. విద్యార్థులు కూడా స్వశక్తిని నమ్ముకుంటే బెటర్. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులు ఎదుటివారిని నమ్మేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటర్. ఆలుమగల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఇలాంటప్పుడే సహనంతో వ్యవహరించండి.
ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.