
ఈ రోజు (మే 4) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..
మేషం (Aries) – మీ వద్ద ఉన్న సమయం తక్కువ.. కానీ పూర్తి చేయాల్సిన పని ఎక్కువ. కాబట్టి ఈ రోజు మీకు బిజీగా గడుస్తుంది. అయితే మీ సహచరులు మీకు సహాయం చేసినా, వారి విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి.
వృషభం (Tarus) – మీరు పని చేస్తున్న ప్రాజెక్ట్ విషయంలో మీకు ఓ స్పష్టత వస్తుంది. అలాగే కొన్ని కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నిస్తారు. ఫలితంగా మీ జీవితంలో ఆసక్తికరమైన మార్పులు జరగనున్నాయి.
మిథునం (Gemini) – మీరు అలసిపోయి, బద్దకంగా ఉన్న కారణంగా పని చాలా నెమ్మదిగా జరుగుతుంది. అలాగే పని ప్రదేశంలో ఒకరు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశాలున్నాయి. కాబట్టి మీ మనసులో ఉన్న సందేహాలను గురించి స్పష్టంగా ఎదుటివారికి తెలియజేయండి.
కర్కాటకం (Cancer) – మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎంత డిస్టర్బ్ చేయాలని ప్రయత్నించినా.. మీరు ఈ రోజు చాలా ఏకాగ్రతతో పని చేస్తారు. మీకు మీరే టార్గెట్స్ పెట్టుకొని వాటిని సాధించడానికి ప్రయత్నిస్తారు.
సింహం (Leo) – పని ప్రదేశంలో మీ సహచరులకు సహాయపడుతూ మీ తెలివితేటలు, సామర్థ్యాలను నిరూపించుకునేందుకు ఈ రోజు మీకు మరో అవకాశం లభిస్తుంది. అయితే దానిని భారంగా ఫీలై చేయకండి. అలాగని పనిలోనే ఎక్కువ సమయం గడిపేయకండి. రెండూ మీకు మంచివి కావు.
కన్య (Virgo) – కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా పనిలో జాప్యం జరగవచ్చు. స్పష్టత కోసం ఇతరులపై ఆధారపడాల్సి రావచ్చు. పెండింగ్ వర్క్ పూర్తి చేయడానికి మీకు సమయం లభిస్తుంది. అయితే రోజు పూర్తయ్యే సమయానికి మాత్రం మీరు సంతోషంగా ఉంటారు.
తుల (Libra) – పరిగెడుతున్న మీ ఆలోచనలకు కళ్లెం వేసేందుకు ప్రయత్నించడంలో మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పని పూర్తి చేయడానికి ప్రత్యేకించి ప్రణాళికలు లేదా కష్టపడాల్సిన అవసరం ఉండదు. కుటుంబంతో సమయం గడపడం వల్ల మరింత సంతోషాన్ని పొందవచ్చు.
వృశ్చికం (Scorpio) – పనిలో వచ్చే కాల్స్, మెయిల్స్ మీకు ప్రశాంతత లేకుండా చేయచ్చు. మీకున్న ఓ కొత్త ఆలోచన గురించి ఇతరులతో పంచుకోవాలని మీరు చాలా ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఒక స్పష్టత లేనిదే దాని గురించి బయటకు చెప్పకపోవడం మంచిది.
ధనుస్సు (Saggitarius) – పనిలో ఈ రోజు మీకు చాలా బాగా గడుస్తుంది. అంతా పాజిటివ్‌గానే జరుగుతుంది. అలాగే కొన్ని క్రియేటివ్ ఆలోచనలు కూడా చేయాల్సి వస్తుంది. ఈ రోజు ఇంటర్వ్యూలకు హాజరుకావడానికి చాలా మంచి రోజు.
మకరం (Capricorn) – పని విషయంలో మీకు చాలా క్రియేటివ్ ఆలోచనలున్నాయి. మీకు మీరే కొత్త ప్లాన్స్, లక్ష్యాలు పెట్టుకుంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మీ టెంపర్‌ని కంట్రోల్ చేసుకోండి. లేదంటే అది స్నేహపూర్వక వాతావరణంపై ప్రభావం చూపిస్తుంది.
కుంభం (Aquarius) – పనిలో మీరు ఛార్జ్ తీసుకోవాల్సిన సమయం ఇది. అయితే మీకున్న కన్ ఫ్యూజన్ వల్ల కొన్ని పొరపాట్లు జరగవచ్చు. ఏకాగ్రతతో పని చేయడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం వల్ల మీ గందరగోళం తగ్గి స్పష్టత రావచ్చు.
మీనం (Pisces) – మీరు పని చేసే ధోరణి మార్చుకోవడానికి ప్రయత్నించే కారణంగా ఈ రోజంతా మీకు చాలా బిజీగా గడుస్తుంది. అయితే మీ సహచరులు పని విషయంలో మీకు సహాయపడతారు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం కూడా అవసరమే కాబట్టి కాస్త దాని గురించి కూడా ఆలోచించండి.
Credit: Asha Shah
ఇవి కూడా చదవండి
మకర రాశి అమ్మాయిల మనస్తత్వం.. ఎలా ఉంటుందో మీకు తెలుసా..!