విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. 2011లో చిన్న చిన్న సపోర్టింగ్ క్యారక్టర్స్ చేస్తూ తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2015లో విడుదలైన “ఎవడే సుబ్రహ్మణ్యం”చిత్రంలో విజయ్ పోషించిన పాత్రకు చక్కని గుర్తింపు లభించడంతో ఆ మరుసటి ఏడాదే హీరోగా మారి “పెళ్లి చూపులు” చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే విజయ్ కెరీర్‌ను మలుపు తిప్పింది.. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం అంటే “అర్జున్ రెడ్డి” అనే చెప్పాలి.
ఇక ఆ తర్వాత రష్మిక మందనతో కలిసి నటించిన “గీతగోవిందం” ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా వరుస హిట్లతో తనదైన శైలిలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు విజయ్. గీతగోవిందంతో హిట్ పెయిర్‌గా నిలిచిన విజయ్ – రష్మిక మరోసారి వారి మ్యాజిక్‌ను వెండితెరపై ప్రదర్శించనున్నారు. అదేనండీ.. ఇద్దరూ కలిసి మరొక చిత్రంలో నటిస్తున్నారు. అదే- డియర్ కామ్రేడ్ (Dear Comrade).
ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్‌ను ఇటీవలే విడుదల చేసిందీ చిత్రబృందం. “కడలల్లె వేచే కనులే.. కదిలేను నదిలా కలలే..” అంటూ సాగే ఒక పాట, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో విడుదల చేసిన ఈ టీజర్ ..విడుదల చేసిన కాసేపట్లోనే అత్యధికంగా వ్యూస్ సొంతం చేసుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. విజయ్ దేవరకొండ అంటేనే మాస్ అని ఊహించుకునే ప్రేక్షకులకు తగ్గట్లుగా ఒక ఫైట్ సీన్‌తో ఈ టీజర్ మొదలువుతుంది.
క్రమంగా వర్షంలో తడుస్తూ హీరో, హీరోయిన్ గాఢంగా ముద్దు పెట్టుకునే సీన్‌తో పూర్తవుతుంది. అయితే ఈ బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే ఒక పాట మాత్రం చాలామందికి అమితంగా నచ్చేసింది. అందుకే ఆ పాటను వీలైనంత త్వరగా విడుదల చేయాలంటూ మైత్రీ మూవీ మేకర్స్‌ను కోరారు చాలామంది! ఈ క్రమంలో, అందరిలోనూ ఎంతగానో ఆసక్తి రేపుతోన్న ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మనమూ తెలుసుకుందాం రండి.
* విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వారు ఈ చిత్రాన్ని నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నారు. అందుకే టీజర్స్‌ను కూడా నాలుగు భాషల్లో విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
* టీజర్ విడుదల చేసిన తర్వాత ఇప్పటివరకు తెలుగులో 45 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకోగా; తమిళంలో 1.2 మిలియన్ వ్యూస్, కన్నడంలో 6 లక్షలకు పై చిలుకు, మలయాళంలో 5 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని నెం.1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. మరొక ఆసక్తికరమైన విశేషం ఏంటంటే.. తమిళంలో అత్యధికంగా వ్యూస్ సంపాదించుకున్న తెలుగు హీరో చిత్రం ఇదే కావడం విశేషం..!
*కాస్త గమనిస్తే ఈ టీజర్స్‌లో తెలుగు, మలయాళం ఒకలా ఉంటే; తమిళం, కన్నడ టీజర్స్ ఒకలా ఉన్నాయి.
*విజువల్స్ ఒకలానే ఉన్నాయి కదాని అనుకుంటున్నారా?? కాస్త సరిగ్గా గమనించండి.. విజువల్స్ ఓకే. మరి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విన్నారా?? తెలుగు, మలయాళంలో సిడ్ శ్రీరామ్ పాడిన పాట వినిపిస్తుండగా; తమిళ, కన్నడ టీజర్స్‌లో మాత్రం ఐశ్వర్య రవిచంద్రన్ గొంతు వినిపిస్తుంది.
* తమిళం, మలయాళంలో ఎన్నో చిత్రాలకు సంగీతం అందించి మంచి గుర్తింపు సంపాదించుకున్న జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టీజర్ ద్వారా వినిపిస్తోన్న పాటకు మంచి స్పందన లభిస్తుండగా మిగతా పాటలపై కూడా ఒక మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయనే చెప్పాలి.
* గీతగోవిందంలో అందమైన ప్రేమ జంటగా కనువిందు చేసిన విజయ్ – రష్మిక జంట మరోసారి తమ మ్యాజిక్‌ను చేసేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే వీరి గాఢ చుంబన సన్నివేశం యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సన్నివేశంలోనే ప్రేమ ఈ స్థాయిలో ఉంటే.. ఇక కథను ఇంకెంత అందంగా చూపిస్తారోనని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిరువురికీ ఇది మరొక హిట్‌ని అందించాలని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
* ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలి చిత్రమే అయినా భరత్ కమ్మ ఈ సినిమాను ఎంతో చక్కగా తెరకెక్కించారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్‌గా రష్మిక, విజయ్ నటన సినిమాకే బలంగా నిలవనుందట! ఈ సినిమాను మే 31న ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిందీ చిత్రబృందం.
* ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక వారం వ్యవధిలో రెండు చిత్రాలకు సంబంధించిన టీజర్స్‌ను విడుదల చేయడం విశేషం. వాటిలో ఒకటి సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్రలహరి కాగా; మరొకటి విజయ్ దేవరకొండ నటిస్తోన్న డియర్ కామ్రేడ్. ఒకటి ఏప్రిల్‌లో ; మరొకటి మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఈ చిత్రాలు. మొత్తానికి విజయ్ అభిమానులకైతే ఈ వేసవి పండగనే చెప్పచ్చు.
ఇవి కూడా చదవండి
#RRR సినిమా గురించి.. ఎస్ ఎస్ రాజమౌళి చెప్పిన టాప్ 10 ఆసక్తికర పాయింట్స్..!
సైనా నెహ్వాల్ పాత్ర పోషించేది శ్రద్ధాకపూర్ కాదు.. పరిణీతి చోప్రా..!
తమిళ స్టార్ విజయ్ తెర పైనే కాదు.. నిజ జీవితంలో కూడా ఆయన ఫ్యాన్స్‌కి హీరోనే!
Read More From Entertainment
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పక్కన.. ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే
Sandeep Thatla