Lifestyle

ఆరోగ్యకర దాంపత్యానికి.. ఈ అలవాట్లు చాలా ముఖ్యం..!

POPxo Team  |  May 15, 2019
ఆరోగ్యకర దాంపత్యానికి.. ఈ అలవాట్లు చాలా ముఖ్యం..!

ఆలుమగలిద్దరూ సెక్స్‌లో (Sex)  పాల్గొన్న తర్వాత అలసిపోయి  నిద్రపోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం.. వంటివి చేయడం సహజమే. అయితే దంపతుల మధ్య బంధం మరింత బలపడేందుకు.. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత చేసే కొన్ని పనులు లేదా అలవాట్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయట. సెక్సువల్ లైఫ్‌ని సైతం మరింత ఎంజాయ్ చేసేందుకు కూడా ఈ అలవాట్లు బాగా ఉపకరిస్తాయి. 

పరస్పరం సహాయం..

సెక్స్ పాల్గొన్న తర్వాత జననాంగాలను శుభ్రం చేసుకోవడం లేదా స్నానం చేయడం సహజమే. అయితే దంపతులు ఎవరికి వారే కాకుండా ఇరువురూ పరస్పరం.. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తమ శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా ఒకరిపై మరొకరికి ఉన్న కేరింగ్ కూడా ఇరువురికీ అర్థం అవుతుంది.

బట్టలు వేసుకోవడంలోనూ..

సాధారణంగా సెక్స్‌లో పాల్గొనే సమయంలో దంపతులిద్దరూ ఒకరి దుస్తులు మరొకరు తొలగించడం వంటివి చేస్తుంటారు. అయితే శృంగారంలో పాల్గొనడం పూర్తైన తర్వాత,, ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరించడం కాకుండా తిరిగి బట్టలు వేసుకోవడంలోనూ ఒకరికొకరు సహాయం చేసుకోండి. ఇది కూడా మీ ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మాట్లాడండి..

సెక్స్‌లో పాల్గొన్న తర్వాత దంపతులిద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోతూ ఉంటారు. ఈసారి మీరు దీనిని కాస్త మార్చడానికి ప్రయత్నించండి. మీరిరువురూ సెక్స్‌లో పాల్గొనే సమయంలో ప్రయత్నించిన కొత్త మూవ్స్ గురించి మాట్లాడండి. తద్వారా మీ భాగస్వామి ఇష్టాఇష్టాయిల గురించి తెలుసుకునే వీలుంటుంది.

సరదాగా ఉండండి..

సెక్స్‌లో పాల్గొనే సమయంలోనే కాదు.. ఆ తర్వాత కూడా ఆలుమగలిద్దరూ ఒకరిని మరొకరు ముద్దులాడడం, సరదాగా ఆటపట్టించుకోవడం, కౌగిలించుకోవడం.. వంటివి చేస్తుండాలి. ఆరోగ్యకరమైన దాంపత్య బంధానికి ఇవి కూడా బాటలు వేస్తాయడనంలో ఎలాంటి సందేహం లేదు. 

కలిసే నిద్రలోకి జారుకోండి..

భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకొని.. కలిసే నిద్రలోకి జారుకోండి. తద్వారా పరస్పరం మీ ప్రేమను తెలియజేసుకుంటూనే హాయిగా నిద్రపోవచ్చు.

మరిన్నిసార్లు సెక్స్‌లో పాల్గొనడం..

సాధారణంగా ఒకసారి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత.. దంపతులిద్దరూ నిద్రపోవడం మామూలే. కానీ చిన్న చిన్న చిలిపి పనులు చేయడం, సెక్స్ గురించి మాట్లాడుకోవడం.. వంటివి చేయడం ద్వారా మళ్లీ సెక్స్‌లో పాల్గొనేలా మీ భాగస్వామిని ప్రేరేపించేందుకు ప్రయత్నించండి. తద్వారా  మీ బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు.

ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకోవడం..

సెక్స్‌లో పాల్గొనడం వల్ల.. మీ శరీరంలో శక్తి స్థాయులు తగ్గిపోతాయి. ఫలితంగా కాస్త ఆకలి వేసినట్లుగా కూడా అనిపిస్తుంటుంది. అందుకే సెక్స్ చేసుకున్న తర్వాత ఇద్దరూ ఒకరికి ఇష్టమైన ఆహారాన్ని మరొకరు ప్రేమగా తినిపించుకోండి. దీని ద్వారా మీ ఆకలి తగ్గి, శక్తి స్థాయులు పెరగడమే కాదు.. మీ భాగస్వామిపై మీకున్న ప్రేమ స్పష్టంగా వారికి అర్థమవుతుంది.

ఎక్కువగా తాకండి..

శారీరకంగా ఒకరినొకరు పెనవేసుకుని అలసిపోయిన తర్వాత ఎవరంతట వారు.. దూరంగా పడుకుంటూ ఉంటారు చాలామంది దంపతులు. మీరూ ఇలానే చేస్తున్నారా?? అయితే మీరు పొరపాటు చేస్తున్నట్లే. ఈసారి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత మరింత ఎక్కువగా మీ భాగస్వామి శరీరాన్ని తాకండి. మీ స్పర్శ ద్వారా మీ మనసులో ఉన్న ప్రేమను వారికి స్పష్టంగా తెలియజేయండి.

ఆటపట్టించుకోండి..

శృంగారంలో పాల్గొన్న తర్వాత ఏ జంట అయితే సరదాగా నవ్వుతూ ఎక్కువ సమయం గడుపుతారో వారి మధ్య అనుబంధం బాగా బలపడుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇలా ఉండడం వల్ల ఆలుమగలిద్దరూ ఒకరితో మరొకరు సఖ్యంగా ఉంటూనే తమ దాంపత్య బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు.

ఒకరి కళ్లలో మరొకరు చూసుకుంటూ..

మనం మాటల్లో చెప్పలేని భావాలను కూడా కళ్లతో చాలా స్పష్టంగా ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పచ్చు. అందుకే ఈసారి సెక్స్‌లో పాల్గొన్న తర్వాత మీ భార్యాభర్తలిద్దరూ ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తూ మీ మనసులో ఉన్న భావాలను ఎదుటివారికి తెలియజేసేందుకు ప్రయత్నించండి. అలా కాసేపు పరస్పరం ప్రేమ లోకంలో హాయిగా విహరించడం ద్వారా మీ వైవాహిక బంధం పునాదులను మరింత ధృడంగా అయ్యేలా చేసుకోండి.

ఇవి కూడా చదవండి

లైంగిక కోరికలు తగ్గడానికి.. ప్రధాన కారణాలేమిటో తెలుసా..?

తొలిరాత్రిని బాగా ఎంజాయ్ చేయాలా?? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..

మీ భర్త సెక్స్ పట్ల ఆసక్తి చూపించడం లేదా? దానికి కారణం ఏంటో మీకు తెలుసా?

Read More From Lifestyle