లైంగిక కోరికలు తగ్గడానికి.. ప్రధాన కారణాలేమిటో తెలుసా..?

లైంగిక కోరికలు తగ్గడానికి.. ప్రధాన కారణాలేమిటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో మీకు సెక్స్ (sex) పట్ల ఆసక్తి తగ్గిపోయిందా? లైంగిక పరమైన కోరికలు క్రమంగా తగ్గిపోతున్నాయా? అందుకు మారుతున్న జీవనశైలే ప్రధాన కారణం అని చెప్పచ్చు. అయితే ఈ జీవనశైలిలో మార్పు కారణంగా వచ్చే మార్పులు చిన్నవిగానే అనిపించినా అవి లైంగికపరమైన జీవితాన్ని (Sex life) ప్రభావితం చేయడంలో ముందువరుసలో ఉంటాయని గుర్తుంచుకోవాలి. సాధారణంగా లైంగికపరమైన కోరికలు తగ్గడానికి గల ప్రధాన కారణాల్లో కొన్ని మీ కోసం..


నిద్రలేమి..


మీరు ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైంది?? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎంత ప్రయత్నించినా గుర్తు రావడం లేదా?? అంటే మీకు నిద్ర లేమి సమస్య ప్రారంభమై చాలా రోజులు కావస్తోందని అర్థం. ఇది కేవలం మీ ఆరోగ్యం పైనే కాదు.. లైంగికపరమైన జీవితంపై కూడా ప్రభావం చూపిస్తుంది. నిద్ర లేమి కారణంగా ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గిపోతాయి. ఫలితంగా లైంగికపరమైన కోరికలు కూడా క్రమంగా తగ్గుతాయి. కాబట్టి మీకు, మీ భాగస్వామికి రోజూ 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ లైంగిక జీవితం ఆరోగ్యంగా, సాఫీగా ముందుకు సాగుతుంది.


gif1


మూడీగా ఉంటున్నారా?


మీరు రాత్రి సమయంలో మీ భర్త గురించి కాకుండా ఇతరత్రా వ్యవహారాల గురించి ఆలోచిస్తున్నా లేక డిప్రెషన్.. వంటి సమస్యల బారిన పడినా మీలో సెక్స్ పట్ల ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతుంది. దీని నుంచి బయటపడాలంటే సమస్యకు తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. తరచూ ఎక్సర్ సైజ్ చేయడం ద్వారా మీ శక్తిస్థాయులను పెంచుకొని.. లైంగికపరంగా ఆనందంగా జీవించవచ్చు. అలాగే మీకున్న నెగెటివ్ ఆలోచనలను దూరం చేసుకోవడానికి.. భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి మీకు బాగా ఇష్టమైన పని, అభిరుచికి తగ్గ పని చేయడం నేర్చుకోండి.


ఎక్కువ పిల్స్ వేసుకుంటున్నారా?


పిల్స్ అంటే కేవలం బర్త్ కంట్రోల్ పిల్స్ మాత్రమే కాదు.. కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే ఏ మందులైనా సరే.. సెక్స్ పరంగా కలిగే కోరికలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే ఈ తరహా మందులను వేసుకోవడం మంచిది. అలాగే కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేయని మందులను తీసుకోవడం కూడా శ్రేయస్కరమే.


రొటీన్‌గా మారిపోయిందా?


పెళ్లైన కొత్తలో దంపతులు ఒకరిని విడిచి మరొకరు ఉండాలంటే అస్సలు ఇష్టపడరు. అయితే కాలక్రమేణా చాలామంది దంపతులకు సెక్స్ అనేది ఒక రొటీన్‌గా మారిపోతుంది. అందుకే వైవాహిక జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటూ ఉండాలి. ఒక్కసారి సెక్స్ రొటీన్‌గా మారిందంటే దానిని ఆస్వాదించడం కష్టమే. కాబట్టి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి బాత్రూమ్ షవర్ కింద, మరోసారి కిచెన్‌లో.. ఇలా పలు భిన్నమైన ప్రదేశాల్లో సెక్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి.


gif2


ఒత్తిడికి గురవుతున్నారా?


సాధారణంగానే జీవితం అంటే పలు ఒత్తిళ్లతో కూడుకున్నది. ఎంత వద్దని అనుకున్నా ఇది వ్యక్తిగత జీవితంలోనే కాదు.. ఉద్యోగ జీవితంలో కూడా మనకు ఎదురవుతూనే ఉంటుంది. నిజానికి సెక్స్ అనేది శరీరానికి సంబంధించిందే అయినా అందుకు మానసికంగా సంసిద్ధంగా ఉండడం కూడా అవసరమే. అందుకు ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఇందుకోసం మీ దంపతులిద్దరూ కొత్త ప్రదేశాలకు.. టూర్‌కి వెళ్లి రావడం కూడా మంచి ప్రత్యామ్నాయమే.


సెల్ ఫోన్‌కి అతుక్కుపోతున్నారా?


ఈ రోజుల్లో ఎవరి చేతిలో అయినా ఫోన్ లేనిదే ఒక్క క్షణం కూడా గడవదు. ఆఖరికి భార్యాభర్తలైనా సరే. చేతిలో ఫోన్ పట్టుకొని ఒకే సోఫా లేదా బెడ్ పై కూర్చొని.. గంటలగంటల సమయం దానితోనే గడిపేస్తున్నారు తప్ప.. ఇద్దరూ మాట్లాడుకునేందుకు కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇది కూడా మీ లైంగిక జీవితాన్ని ప్రభావితం చేసేదే. కాబట్టి బెడ్ రూమ్‌లో మాత్రం మీ దంపతులిద్దరూ ఫోన్ ఉపయోగించకుండా జాగ్రత్తపడండి. ఇంకా చెప్పాలంటే మీరు పడక గదిలోకి అడుగుపెట్టే ముందు ఫోన్స్‌ని స్విచ్ఛాఫ్ చేసేయడం మంచిది.


మీ గురించి మీరు కేర్ తీసుకుంటున్నారా?


భార్యాభర్తలిద్దరూ కలిసి జీవించినంత కాలం లైంగికపరమైన జీవితం కూడా బాగుండాలంటే.. అందుకు మీ పట్ల మీరు కేర్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఆఫీసు పనులు చూసుకుంటూ సమయం లేదనే సాకుతో చాలామంది మహిళలు తమ గురించి తాము అంతగా శ్రద్ధ వహించరు. దీని కారణంగా భర్తకు భార్యపై ఆసక్తి తగ్గే అవకాశాలున్నాయి. కాబట్టి కొత్త హెయిర్ స్టైల్ ప్రయత్నించడం, చక్కని మేకప్ వేసుకోవడం, లిప్ స్టిక్ అప్లై చేసుకోవడం.. ఇలా చిన్న చిన్న మార్పుల ద్వారా మిమ్మల్ని మీరు మార్చుకుంటూనే తగినంత శ్రద్ధ తీసుకోండి. మీ భర్తకు మిమ్మల్ని చూసిన ప్రతిసారీ కొత్త అనుభూతి కలిగించేందుకు ప్రయత్నించండి.


పరిష్కారం కాని సమస్యలున్నాయా?


భార్యాభర్తల మధ్య అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే వాటిని పడక గది లోపలికి తీసుకురాకపోవడమే మంచిది. అంటే మీరిద్దరూ ఏకాంతంగా గడిపే సమయంలో వాటి గురించి చర్చించకూడదు. అలాగని వాటిని అలాగే వదిలేయడం కూడా సరికాదు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు ప్రేమనే ఆయుధంగా మలుచుకోండి. అంతేకానీ గొడవపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తించండి


gif3


వేరే చోట ప్రేమని వెతుక్కున్నారా?


మనసులో ఒక వ్యక్తిని పెట్టుకున్నప్పుడు మరొకరితో కలిసి సంతోషంగా జీవించడం అన్నదానిలో అసలు అర్థం ఉండదు. ముఖ్యంగా సెక్స్ చేసే సమయంలో ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది. అన్యమనస్కంగా చేసే సెక్స్‌ని ఎవరూ ఎంజాయ్ చేయలేరు.


దురలవాట్లు ఉన్నాయా?


మద్యం సేవించడం, ధూమపానం.. ఈ రెండూ దురలవాట్లే అని మనందరికీ తెలుసు. అయితే ఇవి మితిమీరితే మాత్రం తప్పకుండా లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అదీకాకుండా ఇటు ఆరోగ్యపరంగా కూడా ఇవి అనారోగ్య సమస్యలను తలెత్తేలా చేస్తాయి. ముఖ్యంగా దంత సమస్యలను తీసుకొస్తాయి. అన్నింటినీ మించి జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడిపే సమయంలో నోటి నుంచి వచ్చే దుర్వాసన దానికి అడ్డంకి‌గా మారకూడదని భావిస్తారు. మీరూ అంతేనా మరి??


GIFs: Giphy, Tumblr


ఇవి కూడా చదవండి


తొలిరాత్రిని బాగా ఎంజాయ్ చేయాలా?? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..


శృంగార‌ంలో.. "ఫోర్ ప్లే" చాలా ముఖ్యం.. ఎందుకంటే..?


మేమిద్దరం మొదటిసారి.. ఎలా రొమాన్స్ చేశామంటే..?