Astrology

8 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

Rama Shukla  |  Jul 7, 2019
8 జులై 2019, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (జులై  8) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు మీరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వివాహితులు సంతానం విషయంలో పలు శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు కొంతవరకు ఆర్థిక సంక్షోభం ఉంటుంది. ఆఫీసులో మీ నిజాయతీకి క్రెడిట్ దక్కుతుంది. మీకు అధికారుల నుండి మద్దతు కూడా లభిస్తుంది. రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. 

వృషభం (Tarus) – ఈ రోజు విద్యార్థులు, నిరుద్యోగులకు శుభదినం. ఉద్యోగ అవకాశాలు మీ తలుపు తడతాయి. అలాగే ఆఫీసులో పని ఒత్తిడి ఉన్నా.. మీరు ఆత్మ స్థైర్యంతో ముందుకు వెళ్తారు.  రాజకీయ కార్యక్రమాల్లో ఈ రోజు మీరు ఉత్సాహంగా పాల్గొంటారు. సృజనాత్మక, మార్కెటింగ్ రంగాల్లో వారికి ఈరోజు అనువైనది. వివాహితులకు తమ భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ రోజు మీకు ఆధ్మాత్మిక చింతన కూడా పెరుగుతుంది. 

మిథునం (Gemini) – ఈ రోజు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా  ఏజెంట్లతో, బ్రోకర్లతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగులు కూడా ఆఫీసులో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనా.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. విద్యార్థులు, నిరుద్యోగులు కెరీర్ విషయంలో.. సరైన సమయంలో  సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. వివాహితులు భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.  

కర్కాటకం (Cancer) – ఈ రోజు నూతన ఉత్సాహంతో రోజును మొదలుపెడతారు. కొన్ని కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అయితే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు వివాహితులు శుభవార్తలు వింటారు. అదేవిధంగా వ్యాపారస్తులకు పనులు లాభసాటిగా జరుగుతాయి. విద్యార్థులు విజయం వైపు పయనిస్తారు.అయితే వాహన వినియోగంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) –  ఈ రోజు కుటుంబ వివాదాలు.. మీకు మనశ్శాంతి లేకుండా చేయవచ్చు. ఇలాంటి సమయంలోనే సహనంతో, సంయమనంతో వ్యవహరించండి. కోపాన్ని నియంత్రించుకోండి. ఉద్యోగస్తులు కూడా ఆఫీసులో ప్రత్యర్థులతో… గొడవలు పడకుండా ఉంటే మంచిది. నిజాయతీగా పనిచేస్తున్నంత కాలం.. మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. వివాహితులు కూడా భాగస్వామితో ఏర్పడిన సమస్యలను.. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకోండి. 

క‌న్య (Virgo) – ఈ రోజు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. సృజనాత్మక, మార్కెటింగ్ రంగ వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. వివాహితులకు తమ భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడాల్సిన సమయం.

తుల (Libra) –  ఈ రోజు వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. అలాగే సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాల్లోని వ్యక్తులకు పురోగతి ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. వివాహితులు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆస్తి పరమైన లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. అపరిచితులను నమ్మవద్దు.

వృశ్చికం (Scorpio) – ఈ రోజు అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. సమస్యలను వివేకంతో పరిష్కరించుకోండి. వివాహితులకు భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ రోజు అనువైనది. క్రీడరంగంలోని వ్యక్తులకు పురోగతి ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో కూడా మీరు చురుగ్గా పాల్గొంటారు. 

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విద్యార్థులు కూడా పాజిటివ్ ఫలితాలను పొందుతారు. వ్యాపరస్తులు తమ ఒప్పందాలను రద్దు చేసుకొనే విషయంలో.. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వివాహితులకు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులు కొన్ని విషయాల్లో.. నిజాయతీగా వ్యవహరించడం చాలా అవసరం. మీ నిజాయతే మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే ఈ రోజు మీకు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. 

మకరం (Capricorn) –  ఈ రోజు వ్యాపారస్తులకు ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. స్టాక్ మార్కెట్ రంగంలో వారికి కూడా లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుండి బహుమతులను పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వివాహితులు తమ భాగస్వామితో ఏవైనా మనస్పర్థలు ఉంటే.. వాటిని తొలిగించుకోవడానికి ఇదే సరైన సమయం. 

కుంభం (Aquarius) – విద్యార్థులు ఈ రోజు అనుకోని సమస్యల్లో చిక్కుకోవచ్చు. కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులు కూడా ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. లేదా ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వివాహితులు కుటుంబంతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులు అనవసరమైన వివాదాల్లో తల దూర్చకుండా ఉంటే బెటర్? 

మీనం (Pisces) – ఈ రోజు మిమ్మల్ని మానసిక ఆందోళనకు గురి చేసే కొన్ని సంఘటనలు జరగవచ్చు. కనుక అప్రమత్తంగా ఉండండి. సహనంతో, సంయమనంతో వ్యవహరించండి. విద్యార్థులు పాజిటివ్ ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు, లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. 

ఈ రాశుల వ్యక్తులు.. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఎందుకంటే..?

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

Read More From Astrology