Beauty
చుండ్రుకు చెక్ పెట్టాలా? అయితే ఈ చిట్కాలు ప్రయత్నించండి (How To Get Rid Of Dandruff At Home)
అందమైన నలుపు రంగు డ్రస్ వేసుకున్నప్పుడు భుజాలపై తెల్లగా చాక్‌పీస్ పొడిలా ఉండే పదార్థం కనిపిస్తే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో కదా.. అదే చుండ్రంటే (Dandruff). చాలామందికి జన్యుపరంగా లేదా వాతావరణ కారణాల వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. తలలో ఎక్కువగా నూనె ఉండడం.. ఆ ప్రదేశాల్లో ఫంగస్ చేరడం వల్ల ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది.
చుండ్రును ఎలా నివారించాలి.. నియంత్రించాలి..
చుండ్రు తొలిగించడానికి ఇంటి చిట్కాలు
చుండ్రు లక్షణాలేంటి?
మీకు తల చాలా దురదగా అనిపిస్తోందా? మాటిమాటికి తల గోక్కోవాలనిపిస్తోందా? తెల్లగా చాక్‌పీస్ పొడిలాంటి పదార్థం మీ తలలోంచి రాలుతోందా? అదే చుండ్రంటే.. చుండ్రులో వివిధ రకాలుంటాయి. కొన్ని తెల్లగా చిన్నగా కనిపిస్తే.. మరికొన్ని కాస్త పసుపు రంగులో పెద్దగా కనిపిస్తాయి.
చుండ్రు రావడానికి కారణాలేంటి? (Causes Of Dandruff)
1. జిడ్డు చర్మం (Oily Skin)
తలలో చుండ్రు రావడానికి ప్రధాన కారణం జిడ్డు చర్మమే. తలలో నూనె ఎక్కువగా ఉండడం వల్ల ఫంగస్ చేరి చుండ్రు తయారవుతుంది. నూనె ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే చుండ్రు ఎక్కువగా వస్తుంటుంది.
2. వాతావరణం (Weather)
సాధారణంగా వాతావరణంలో ఉన్న కాలుష్యం వల్ల దుమ్ము, ధూళి తలపై చేరుతుంది. తరచూ తలస్నానం చేయకపోతే ఈ దుమ్ము, తలలో ఉత్పత్తయ్యే నూనెలతో కలిసి ఫంగస్ పెరిగేందుకు తోడ్పడుతుంది. దీంతో చుండ్రు సమస్య మొదలవుతుంది.
3. ఆహారం (Food)
మనం తినే ఆహారంలో ఎక్కువగా నూనెలు, డైరీ ఉత్పత్తులు ఉంటే మన చర్మం కూడా ఎక్కువ మోతాదులో నూనెలను విడుదల చేస్తుంది. ఇది చుండ్రు పెరుగుదలకు కూడా కారణమవుతుంది.
4. ఒత్తిడి (Stress)
మనం ఎదుర్కొనే చాలా సమస్యలు ఒత్తిడి వల్లే వస్తుంటాయి. చుండ్రు కూడా అందులో ఒకటే. ఈ ఒత్తిడి చర్మ సమస్యలు మరింత పెరిగేలా చేస్తుంది. ఒత్తిడి వల్ల తల ఎక్కువగా దురదపెడుతుంది. మనం దాన్ని గోకినప్పుడు ఇంకా ఎక్కువ చుండ్రు తయారయ్యే అవకాశాలుంటాయి.
5. కొన్ని రకాల షాంపూలు (Alkaline Based Shampoo)
ఆల్కలిన్ గుణం కలిగిన షాంపూలు ఉపయోగించడం వల్ల తలలోని చర్మం పీహెచ్ స్థాయులు మారిపోయి చుండ్రు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాదు.. నూనె శాతం ఎక్కువగా ఉన్న షాంపూల వల్ల కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది.
6. దువ్వడం (Hair Washing Pattern)
జుట్టును రోజూ దువ్వుకోవడం వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రోజూ జుట్టు దువ్వుకోకపోతే వెంట్రుకలు చిక్కులుగా మారడంతో పాటు తలలో జిడ్డుదనం పెరిగి చుండ్రు సమస్య పెరిగిపోయే అవకాశం ఉంటుంది.
7. తలస్నానం చేయకపోవడం (
తరచూ తలస్నానం చేయడం వల్ల తలలో జిడ్డుదనం పెరిగి చుండ్రు సమస్య ఎక్కువగా ఉండదు. అందుకే కనీసం వారానికి రెండుసార్లయినా తలస్నానం చేయాల్సిందే.
చుండ్రు గురించి ఉన్న అపోహలు (Myths About Dandruff)
1. తల పొడిగా ఉంటే చుండ్రు ఎక్కువగా వస్తుంది (Dandruff Occurs Due To Dry Scalp)
చాలామంది చుండ్రు రాలుతోందంటే మాడు భాగం పొడిబారిపోయిందనుకుంటారు. అందుకే చుండ్రు సమస్య ఎదురైందని వారి భావన. కానీ ఇది తప్పు. తలలో ఎక్కువగా నూనె ఉత్పత్తయినప్పుడు చుండ్రు ఏర్పడుతుంది.
2. నూనె పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది. (Dandruff Decreses With Oiling)
తలలో జిడ్డు ఎక్కువగా ఉంటేనే చుండ్రు పెరుగుతుంది. కాబట్టి తలకు నూనె పెట్టడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పట్టదు సరికదా మరింత ఎక్కువవుతుంది. తలను బాగా రుద్దడం వల్ల కూడా చుండ్రుతో పాటు దురద కూడా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.
3. తలనుంచి చుండ్రును రుద్దిపడేసి.. తలస్నానం చేస్తే సమస్య తగ్గిపోతుంది (Rinsing The Head Reduces Dandruff)
చాలామంది తలలో చుండ్రు తొలగించడానికి దాన్ని చేతితో.. లేదా దువ్వెన లాంటి వస్తువులతో రుద్దితే అది పూర్తిగా రాలిపోతుందని భావిస్తారు. ఇలా రుద్ది ఆపై తలస్నానం చేసేస్తే చుండ్రు తగ్గిపోతుందని వారి భావన. కానీ ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గే వీలుంటే ఇలాంటి వస్తువులకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉండేది. దీనివల్ల చుండ్రు ఏమాత్రం తగ్గదు సరికదా దురద మరింత పెరుగుతుంది.
4. చుండ్రుంటే తక్కువగా తలస్నానం చేయాలి (
ఇది కూడా చాలామంది పాటించే అపోహల్లో ఒకటి. తక్కువగా తలస్నానం చేస్తే తల పొడిబారకుండా ఉంటుంది కాబట్టి చుండ్రు తగ్గుతుందనుకుంటారు. కానీ తరచూ తలస్నానం చేయడం వల్ల తలలో జిడ్డుతో పాటు దుమ్ము, ధూళి కూడా పూర్తిగా తొలగిపోతుంది. దీంతో మాడు ఆరోగ్యంగా ఉంటుంది. ఫంగస్ చేసే అవకాశం తగ్గుతుంది. దీంతో చుండ్రు వచ్చే అవకాశం కూడా తక్కువే.
5. హెయిర్ మాస్కులకు దూరంగా ఉండాలి (Avoid Hair Mask)
తలలోని చర్మంపై ఉండే ఫంగస్‌ని దూరం చేసేందుకు ఈ తరహా మాస్కులు బాగా ఉపయోగపడతాయి. ఎక్స్‌ఫోలియేటింగ్ హెయిర్ మాస్క్‌లను ఉపయోగించడం వల్ల చుండ్రు తగ్గడమే కాదు.. తలపై ఆరోగ్యకరమైన చర్మకణాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
6. హెయిర్‌స్టైలింగ్‌కి కూడా దూరంగా ఉండాలి (Relating With Hairstyle Products)
హెయిర్‌స్ట్రయిటనర్, కర్లర్, బ్లో డ్రయ్యర్, హెయిర్ స్ప్రే వంటివి జుట్టు చివర్లు చిట్లిపోయేలా చేస్తాయి. అయితే వీటికి చుండ్రుకి ఏమాత్రం సంబంధం లేదు. ఇది ఎక్కువగా జన్యుపరంగా, వాతావరణ మార్పులను బట్టి వచ్చే అవకాశం ఉంటుంది. మనం తీసుకునే ఆహారం కూడా చుండ్రును అడ్డుకుంటుంది. అంతేకానీ హెయిర్‌స్టైలింగ్‌కి దీనికి ఏమాత్రం సంబంధం లేదు.
7. జుట్టు పెరుగుదలకు చుండ్రుకి ఏమాత్రం సంబంధం లేదు (Dandruff Is Not Related To Hair Growth)
ఇది కూడా అపోహే. చుండ్రు ఎక్కువగా ఉండడం వల్ల తలలో ఫంగస్ ఎక్కువగా పేరుకుపోతుంది. దీనివల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలిపోయే అవకాశాలుంటాయి. అంతేకాదు.. చుండ్రు వల్ల దురద ఎక్కువగా ఉంటుంది. మనం ఎక్కువగా తలను గోక్కోవడం వల్ల కూడా జుట్టు బలహీనపడి రాలిపోయే అవకాశాలుంటాయి
8. చలికాలంలో చుండ్రు తక్కువగా ఉంటుంది.. (
నిజం చెప్పాలంటే సాధారణ సమయంతో పోల్చితే చలికాలంలోనే చుండ్రు బాధ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలోని వాతావరణం వల్ల మనం ఎక్కువగా నూనె వస్తువులు, మసాలా వస్తువులు, డైరీ ఉత్పత్తులు తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల చుండ్రు మరింత ఎక్కువవుతుంది. అంతేకాదు.. చలికాలంలో చాలామంది వారానికి రెండుసార్లకు బదులు ఒకేసారి తల స్నానం చేస్తుంటారు. దీనివల్ల కూడా చుండ్రు పెరిగే అవకాశం ఉంటుంది.
చుండ్రు వల్ల మాడు, జుట్టుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..
1. చుండ్రు జుట్టు రఫ్‌గా మారేలా చేస్తుంది.
2. దీనివల్ల జుట్టు చివర్లు చిట్లే సమస్య కూడా మొదలవుతుంది.
3. చుండ్రు వల్ల మాడు జిడ్డుగా తయారవుతుంది.
4. మాడు దురద పెట్టడం ప్రారంభమవుతుంది.
5. జుట్టు రాలిపోయేలా చేస్తుంది. పెరుగుదల కూడా మందగిస్తుంది.
6. చుండ్రు వల్ల జుట్టు తెగిపోయి నిర్జీవంగా మారుతుంది.
చుండ్రును ఎలా నివారించాలి.. నియంత్రించాలి.. (How To Avoid Dandruff)
1. మెడికేటెడ్ షాంపూ వాడండి (Use Medicated Shampoo)
చుండ్రు మొదలవ్వగానే మనం చేయాల్సిన పని ఇదే. దీనికోసం వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. ఒకవేళ అలా తీసుకోలేకపోతే.. లేబుల్ సరిగ్గా చదవాల్సి ఉంటుంది. పైరిథియాన్ జింక్, సాలిసిలిక్ యాసిడ్, కీటో కెనజాల్, సెలేనియం సల్ఫైడ్ వంటి పదార్థాలు అందులో ఉపయోగించారా లేదా చూడండి. ఈ పదార్థాలు చుండ్రు పెరుగుదలను అడ్డుకుంటాయి.
2. కండిషనర్ వాడండి (Use Good Conditioner)
మంచి కండిషనర్ మీ తలను పొడిబారిపోకుండా కాపాడుతుంది. సాలిసిలిక్ యాసిడ్ ఉత్పత్తులతో తయారుచేసిన షాంపూ తలలోని జిడ్డును తొలగిస్తుంది. అయితే ఇది తలను పొడిగా మారుస్తుంది. అందుకే మంచి కండిషనర్ ఉపయోగిస్తే ఈ పొడిదనం తగ్గి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
3. హెయిర్ ట్రీట్‌మెంట్లకు దూరంగా ఉండండి (Avoid Hair Treatments)
మనలో చాలామందికి జుట్టుకు రంగు వేసుకోవడం, స్ట్రయిటనింగ్, ఐరనింగ్, కర్లింగ్ వంటివి చాలా ఇష్టం. అయితే ఇవి జుట్టును బలహీనపరుస్తాయి. సున్నితమైన చర్మం.. ఇరిటేషన్‌తో మంటపుట్టేలా చేస్తాయి. అందుకే ఇలాంటివి ఉపయోగించకుండా ఉండేందుకు సాధ్యమైనంతమేరకు ప్రయత్నించాలి. ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు. కానీ తరచూ వీటిని వాడకూడదు. వీటితో పాటు పర్ఫ్యూమ్‌లు కూడా తలపై ప్రభావాన్ని చూపి చుండ్రు పెరిగేలా చేస్తాయి. బ్లీచ్ కూడా చర్మంపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే వీటిని వీలైనంతమేరకు దూరంగా ఉంచడమే మంచిది.
4. ఒత్తిడిని తగ్గించుకోవాలి (Reduce Stress)
ఒత్తిడి వల్ల చుండ్రు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి మన ఆహారపుటలవాట్లపై ప్రభావం చూపుతుంది. మన రోగ నిరోధక వ్యవస్థ బలహీనమయ్యేలా చేస్తుంది. మన తలలో ఎక్కువగా ఫంగస్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని నివారించడానికి మన రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ క్షీణించకుండా ఒత్తిడిని దూరంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. పని మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం, అప్పుడప్పుడూ విహార యాత్రలకు వెళ్లిరావడం, నచ్చిన సంగీతం వినడం, సినిమాలు చూడడం వంటివి చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాల్సి ఉంటుంది.
5. కొబ్బరినూనె వాడండి (Use Coconut Oil)
సాధారణంగా చుండ్రు ఎక్కువగా ఉన్నవారు నూనె పెట్టుకోవడం వల్ల సమస్య పెరుగుతుందని చెబుతుంటారు. అయితే కొబ్బరినూనె దీనికి పూర్తిగా విభిన్నం. దీనికి ఉన్న యాంటీఫంగల్ గుణాలు తలలో ఫంగస్ పెరగకుండా కాపాడుతాయి. ఈ నూనె యాంటీడాండ్రఫ్ షాంపూలలోని కీటోకెనజాల్ వంటి గుణాలను కలిగి ఉంటుంది. దీనివల్ల చుండ్రు కూడా తగ్గుతుంది. అందుకే తలస్నానానికి గంట ముందు దీనితో మసాజ్ చేసుకోవడం వల్ల ప్రయోజనం కనిపిస్తుంది.
చుండ్రు తొలిగించడానికి ఇంటి చిట్కాలు (Home Remedies For Dandruff)
1. ముల్తానీ మట్టి హెయిర్‌ప్యాక్ (Multani Clay Hairpack)
ఇది తలలో తేమను పెంచి.. జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. జుట్టు కూడా సిల్కీగా, మెరుస్తూ ఉండేలా చేస్తుంది. దీనికోసం టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి తీసుకొని అందులో నిమ్మరసం, నీళ్లు కలిపి మిశ్రమంగా చేసుకొని తలకు అప్లై చేసుకోవాలి. దీన్ని అరగంట పాటు ఉంచుకొని తర్వాత తలస్నానం చేస్తే సరి.
2. యాస్ప్రిన్ మాత్ర (Aspirin Tablet)
యాస్ప్రిన్‌లో సాలిసిలిక్ యాసిడ్ అనే కెమికల్ ఉంటుంది. ఇది ఎక్కువశాతం యాంటీడాండ్రఫ్ షాంపూల్లోనూ కనిపిస్తుంటుంది. ఇది తలలోని చుండ్రును తొలిగిపోయేలా చేస్తుంది. ఇందుకోసం రెండు యాస్ప్రిన్ టాబ్లెట్లను పొడి చేసి సాధారణ షాంపూకి కలిపి.. ఐదు నిమిషాలు ఉంచి కడుక్కుంటే సరిపోతుంది.
3. టీ ట్రీ ఆయిల్ (Tea Tree Oil)
టీ ట్రీ ఆయిల్ చుండ్రును తగ్గించడమే కాదు.. మాడు, జుట్టు ఆరోగ్యంగా మారేందుకు కూడా తోడ్పడుతుంది. దీన్ని తలకు పట్టించి ఐదు నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత తలస్నానం చేస్తే సరి. ఇలా కాకుండా షాంపూలోనూ టీ ట్రీ ఆయిల్‌ని కలిపి తలస్నానం చేసినా మంచి ఫలితాలే ఉంటాయి.
4. బేకింగ్ సోడా (Baking Soda)
బేకింగ్ సోడా కూడా తలకు పట్టిస్తే చుండ్రుపై మంచి ప్రభావాన్నే చూపుతుంది. దీనికోసం బేకింగ్ సోడాని మాత్రమే తలకు పట్టించవచ్చు. లేదా ఇతర పదార్థాల్లో కలిపి కూడా పెట్టుకోవచ్చు. చేయాల్సిందల్లా తలను బాగా తడిపి.. దానికి బేకింగ్ సోడా పట్టించి పదినిమిషాల తర్వాత కడిగేయడమే. ఇలా చేయగానే జుట్టు కాస్త పొడిబారినట్లుగా కనిపించినా.. కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
5. పెరుగు (Yoghurt)
పెరుగులో ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది చుండ్రును నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం చక్కగా తలస్నానం చేసిన తర్వాత తలకు పెరుగు పట్టించి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కడుక్కొని మరోసారి మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
6. మెంతులు (Fennel Seeds)
మెంతుల్లో కొన్ని రకాల మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో ఎంతగానో తోడ్పడతాయి. ఇందుకోసం మెంతులను బాగా మిక్సీ పట్టుకొని వేడి నీళ్లలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే దీన్ని తలకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది.
7. కొబ్బరి నూనె (Coconut Oil)
కొబ్బరి నూనె తలకు మృదుత్వాన్ని అందించి చుండ్రు పెరగడాన్ని అరికడుతుంది. ఇందుకోసం తలస్నానానికి గంట ముందు కొబ్బరినూనె పెట్టుకొని మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరి.
8. నిమ్మకాయ (Lemon)
నిమ్మకాయలోని ఆమ్ల గుణాలు తలలోని చర్మపు పీహెచ్‌ని బ్యాలన్స్ చేసి చుండ్రును తగ్గిస్తాయి. ఇందుకోసం మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకొని దాన్ని తలకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. తలస్నానం తర్వాత కండిషనర్ మాత్రం వాడకూడదు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే సరి. చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
9. యాపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar)
యాపిల్ సైడర్ వెనిగర్‌లోనూ నిమ్మకాయలాగే ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయి.ఇది తలలోని మృత చర్మాన్ని తొలగించి పీహెచ్‌ని కూడా బ్యాలన్స్ చేస్తుంది. చర్మంలోని ఫంగస్‌ని కూడా తగ్గించి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. ఇందుకోసం యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్దిగా నీళ్లు పోసి.. స్ప్రే బాటిల్‌లో పోసుకొని దాన్ని తలకు స్ప్రే చేసుకోవాలి. దీని పావుగంట పాటు ఉంచుకొని ఆ తర్వాత తలస్నానం చేస్తే సరి.
10. మౌత్‌వాష్ (Mouthwash)
ఇది మన నోటిని శుభ్రంగా ఉంచడమే కాదు.. తలలోని ఫంగస్‌ని తొలగించేందుకు కూడా తోడ్పడుతుంది. ఇందులోని యాంటీఫంగల్ గుణాలు ఈస్ట్‌ని చంపేసి చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. ఇందుకోసం తలస్నానం చేసిన తర్వాత ఒకసారి మౌత్‌వాష్ కలిపిన నీటితో తలను ఒకసారి కడిగేసుకుంటే సరి. ఆ తర్వాత మంచి కండిషనర్ అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు.
11. వేపాకు రసం (Peeper Juice)
వేప ఎన్నో ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటుంది. ఇందులోని నిమోనోల్ అనే కాంపౌండ్ చుండ్రును దూరం చేస్తుంది. ఇందుకోసం ఐదారు వేప రెబ్బలను తీసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి.. దీన్ని తలకు రుద్దుకొని ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని తలస్నానం చేస్తే సరిపోతుంది.
12. నారింజ తొక్కలు (Orange Skin)
నారింజ తొక్కల్లోని ఆమ్ల గుణం తలలో ఎక్కువగా ఉన్న నూనెని తగ్గిస్తుంది. తలలో తేమను పెంచి చుండ్రును తగ్గిస్తుంది. ఇందుకోసం నారింజ తొక్కలను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌ని మాడుకు పెట్టుకొని అరగంటపాటు ఉంచుకొని తలస్నానం చేయాలి.
13. ఉప్పు (Salt)
చుండ్రును పూర్తిగా తగ్గించేందుకు ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం తల పొడిగా ఉన్నచోట ఉప్పుతో మసాజ్ చేసి ఆ తర్వాత తలస్నానం చేసి మంచి కండిషనర్ అప్లై చేసుకుంటే చుండ్రు తగ్గుతుంది. దీన్ని వారానికి రెండుసార్లు చేయాల్సి ఉంటుంది.
14. కలబంద (Aloe Vera)
కలబందను మన చర్మ సంరక్షణకు ఉపయోగించడం గురించి మనకు తెలిసిందే. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు జుట్టును చుండ్రు బారిన పడకుండా కాపాడతాయి. ఇందుకోసం కలబంద గుజ్జును మాడుకు రుద్దాలి. ఆపై పావుగంట అలాగే ఉంచి గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరి.
15. వెల్లుల్లి (Garlic)
వెల్లుల్లి కూడా చుండ్రును తగ్గించేందుకు చాలా బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం వెల్లుల్లిని మెత్తని పేస్ట్ చేసి తలకు పట్టించి పావుగంట పాటు అలాగే ఉంచాలి. వెల్లుల్లి వాసన భరించలేకపోతే అందులో కాస్త తేనె కలిపి పెట్టుకోవచ్చు.
16. ఆలివ్ నూనె (Olive Oil)
ఆలివ్ నూనె కూడా చుండ్రును తగ్గించడంలో బాగా తోడ్పడుతుంది. దీన్ని చుండ్రు నివారణకు రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. దీన్ని పొడిబారిపోయిన మాడుకు అప్లై చేసుకోవడం వల్ల చర్మం తేమను సంతరించుకుంటుంది. చుండ్రు కూడా దీన్ని పీల్చుకోవడం వల్ల.. ఒకేసారి పెద్ద పెద్ద ముక్కలుగా రాలిపడిపోతాయి కాబట్టి ఎక్కువ రోజులు ఈ సమస్య ఉండదు.
17. పచ్చ సొన (Egg Yolk)
గుడ్డు మన చర్మానికి, జుట్టుకు ఎంతో ప్రయోజనకారి అని మనందరికీ తెలిసిందే. పచ్చసొనలో ఉండే బయోటిన్ ఇతర విటమిన్స్ వల్ల.. చుండ్రు తగ్గడంతో పాటు జుట్టు కూడా సిల్కీగా మారుతుంది. ఇందుకోసం ఒకటి, రెండు పచ్చసొనలను తీసుకొని మాడుకు పట్టించి షవర్ క్యాప్‌తో జుట్టును కప్పి ఉంచాలి. ఆపై గంట అలాగే ఉంచుకొని తలస్నానం చేయాలి.
18. సెడార్‌వుడ్ ఆయిల్ (Cedarwood Oil)
సెడార్‌వుడ్ ఆయిల్ యాంటీ సెబారిక్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది చుండ్రును మాత్రమే కాదు. ఇతర మాడు సమస్యలను తగ్గిస్తుంది. ఇందుకోసం సెడార్‌వుడ్ ఆయిల్‌ని తీసుకొని సైప్రస్ ఎస్సెన్షియల్ ఆయిల్ లేదా జునిపర్ ఎస్సెన్షియల్ ఆయిల్‌తో కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేస్తే సరి. లేదా పావుకప్పు నీటికి ఈ మిశ్రమాన్ని కలిపి తలస్నానం చేస్తే సరిపోతుంది.
19. తులసి ఆకులు (Tulsi Leaves)
తులసి ఆకులు యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో ఎంతో తోడ్పడతాయి. ఇవి చుండ్రును తగ్గించడం మాత్రమే కాదు.. జుట్టును కూడా బలంగా మారుస్తాయి. ఇందుకోసం కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల నీళ్లు, మూడు టీస్పూన్ల ఉసిరి పొడి, కలుపుకొని ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఆ తర్వాత అరగంట పాటు ఉంచుకొని తలస్నానం చేయాలి.
20. గ్రీన్ టీ (Green Tea)
గ్రీన్ టీ యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇందులోని ఫైటోఫినాల్స్ చుండ్రును తగ్గిస్తాయి. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. దీనికోసం గ్రీన్‌టీ బ్యాగ్స్ తీసుకొని వేడి నీటిలో ముంచి డికాషన్ తయారుచేసుకోవాలి. తర్వాత దాన్ని చల్లార్చుకొని జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత షాంపూ చేసుకుంటే సరిపోతుంది.
21. హెన్నా (Henna)
హెన్నా హెయిర్‌డైగానే కాదు.. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా తోడ్పడుతుంది. చుండ్రును కూడా తగ్గిస్తుంది. జిడ్డుదనాన్ని కూడా తగ్గించి కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇందుకోసం హెన్నాను పెరుగుతో కలిపి రెండు టీస్పూన్ల నిమ్మరసం వేసి ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. దీన్ని మాడుకు పట్టించి రెండు గంటల పాటు ఉంచుకొని మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
22. ఫిష్ ఆయిల్ (Fish Oil)
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన శరీర నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి. చుండ్రును కూడా తగ్గించి తలలో తేమను పెంచుతాయి. ఫిష్ ఆయిల్‌లో ఇవి ఎక్కువగా ఉంటాయి. దీన్ని తలకు రుద్దుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.. కావాలంటే ఫిష్ ఆయిల్ క్యాప్య్సూల్స్ కూడా రోజుకు రెండు చొప్పున తీసుకోవచ్చు.
బెస్ట్ యాంటీడాండ్రఫ్ షాంపూలు (Best Anti Dandruff Shampoo)
1. హిమాలయా యాంటీడాండ్రఫ్ షాంపూ (Himayalan)
హెర్బల్ ఉత్పత్తులను గమనిస్తే హిమాలయను అన్నింటికంటే ఎక్కువ నమ్మదగిన సంస్థగా చెప్పుకోవచ్చు. వీరి యాంటీడాండ్రఫ్ షాంపూ.. చుండ్రును తగ్గించడంలో, మాడుకు మంచి ఆరోగ్యాన్ని అందించడంలో అన్నింటికంటే ముందుంటుంది. ఇది వంద శాతం హెర్బల్ కాబట్టి జుట్టుపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపించదు. దీని ధర రూ.128.
2. హెడ్ అండ్ షోల్డర్స్ స్మూత్ అండ్ సిల్కీ షాంపూ (Head And Shoulders)
హెడ్ అండ్ షోల్డర్స్ స్మూత్ అండ్ సిల్కీ యాంటీ డాండ్రఫ్ షాంపూ మాయిశ్చరైజర్లతో కలిపి చేసినది. ఇది పొడిబారిపోయిన జుట్టును తిరిగి మృదువుగా పట్టులా మారుస్తుంది. అంతేకాదు.. చుండ్రును కూడా తగ్గించి.. తిరిగి రాకుండా కాపాడుతుంది. ధర రూ.242.
3. వీఎల్‌సీసీ డాండ్రఫ్ కంట్రోల్ షాంపూ (VLCC Dandruff Control)
వీఎల్‌సీసీ డాండ్రఫ్ కంట్రోల్ షాంపూ రోజ్‌మేరీ, పుదీనా వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చుండ్రును తగ్గించడంతో పాటు జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది. రోజ్‌మేరీలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు తలలో ఉన్న ఇన్ఫెక్షన్‌ని తగ్గించి చుండ్రు తిరిగి రాకుండా చేస్తుంది. ధర. రూ.117.
4. లోరియాల్ ఫాల్ రెసిస్ట్ యాంటీ డాండ్రఫ్ షాంపూ (L’Oreal Fall Resist)
మంచి ఫలితాలను ఇచ్చే ఉత్పత్తులను ఎంచుకోవాలంటే ముందుగా లోరియాల్‌ని ఎంచుకోవాల్సిందే. ఈ ఫాల్ రెసిస్ట్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇన్ఫెక్షన్ తగ్గించి చుండ్రును దూరం చేస్తుంది. జుట్టును కూడా కుదుళ్ల నుంచి బలంగా మారుస్తుంది. ధర. రూ.150
5. పతంజలి యాంటీడాండ్రఫ్ షాంపూ – కేశ్‌కాంతి హెయిర్ క్లెన్సర్ (Patanjali Anti-Dandruff)
ప్రస్తుతం అన్ని రకాల పతంజలి ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తున్నాయి. అందులో యాంటీడాండ్రఫ్ షాంపూలు కూడా ఒక భాగమే. ఇవి ఇన్ఫెక్షన్‌ని కలిగించే క్రిములతో పోరాడడంతో పాటు కుదుళ్ల నుంచి జుట్టును బలంగా మారుస్తుంది. ధర. రూ.100
6. బాడీషాప్ జింజర్ యాంటీడాండ్రఫ్ షాంపూ (Body Shape Ginger Anti-Dandruff Shampoo)
మాడును తేమగా మార్చడంతో పాటు ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ తరహా షాంపూను ఉపయోగించడం మంచిది. ఇందులోని అల్లం, బిర్చ్ బార్క్, వైట్ విల్లో బార్క్ ఎక్స్‌ట్రాక్ట్స్, ఇథియోపియాకి చెందిన తేనె వంటివన్నీ కలిపి చుండ్రును తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. ధర రూ.645.
7. బయోటిక్ బయో మార్గోసా యాంటీ డాండ్రఫ్ షాంపూ (Biotique Anti Dandruff Shampoo)
బయో మార్గోసా యాంటీడాండ్రఫ్ షాంపూ.. అటు షాంపూ, ఇటు కండిషనర్ రెండు రకాలుగా పనిచేస్తుంది. ఇది పొడిబారిపోయిన చర్మంలో తేమను నింపు చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. ధర రూ. 238.
8. ఫాబ్ ఇండియా టీట్రీ డాండ్రఫ్ కంట్రోల్ షాంపూ (Fabindia Tea Tree Shampoo)
చుండ్రు ఎక్కువగా ఉందా? దురదగా అనిపిస్తోందా? అయితే ఫాబ్ ఇండియా టీట్రీ యాంటీ డాండ్రఫ్ కంట్రోల్ షాంపూని ఉపయోగించండి. టీట్రీ ఆయిల్ చుండ్రును తగ్గించేందుకు బాగా తోడ్పడుతుంది. మాడులో బ్యాక్టీరియల్, ఫంగల్ సమస్యలను తగ్గించి.. జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది. ధర రూ.350
9. డవ్ డాండ్రఫ్ కేర్ షాంపూ (Dove Dandruff Care)
డవ్ డాండ్రఫ్ కేర్ షాంపూ చుండ్రును తగ్గించి.. జుట్టులో తేమను మరింత పెంచుతుంది. పొడి జుట్టును మృదువుగా మార్చడంతో పాటు చుండ్రును కూడా పూర్తిగా తొలగిస్తుంది. ధర. 242.
10. ఖాదీ నీమ్ అలోవీరా యాంటీడాండ్రఫ్ షాంపూ (Khadi Neem Aloevera Shampoo)
ఎంత ఎక్కువగా చుండ్రు ఉన్నా ఈ ఖాదీ నీమ్ అలొవీరా షాంపూ దాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. పొడిదనాన్ని తగ్గించి.. మృతకణాలను తొలగిస్తుంది. పొడి జుట్టును కూడా మృదువుగా మారుస్తుంది. ధర. రూ.188
చిట్కాలు చిన్నవే.. కానీ జుట్టు పొడవుగా అయ్యేలా చేస్తాయి..
చర్మ, కేశ సంరక్షణ కోసం వాడాల్సిన.. పారాబెన్, సల్ఫేట్ రహిత ఉత్పత్తులివే..!
మంచి హెయిర్ స్ట్రెయిటనింగ్ కోసం ఆరాటపడుతున్నారా? అయితే ఈ బ్రష్‌లు మీకోసమే..!