రోజూ మీరు పాపిట ఎలా తీసుకుంటారు? అది మీ అందాన్ని పెంచుతోందా? తగ్గిస్తోందా? అసలు అది మీ ముఖానికి తగినట్టుగా ఉందా? ఈ ప్రశ్నలేంటని ఆశ్చర్యపోతున్నారా? మనం అంతగా పట్టించుకోం గానీ.. మనం అందంగా.. ముఖం ఆకర్షణీయంగా కనిపించాలంటే.. పాపిట (parting hair) విషయంలోనూ కాస్త జాగ్రత్త పాటించాల్సిందే. సాధారణంగా మనం మధ్య పాపిట లేదా పక్క పాపిట తీసుకుని తల దువ్వుకుంటూ ఉంటాం.
కానీ అది మనకు నప్పుతుందా? లేదా? అని పెద్దగా పట్టించుకోం. ఎప్పుడైనా బోర్ కొడితే పాపిట మార్చుకుంటూ ఉంటాం. అప్పుడైనా అది మనకు సూటయిందా? లేదా? అని చూసుకుంటే.. మీ అందం ద్విగుణీకృతం అవుతుంది. అయితే మీ ముఖానికి తగినట్లుగా పాపిట తీసుకుంటున్నారో లేదో ఓ సారి సరిచూసుకోండి.
ముఖం గుండ్రంగా ఉంటే..
ముఖం గుండ్రంగా ఉన్నవారు సరైన హెయిర్ స్టైల్ (hair style) ఎంచుకోకపోతే.. వారి ముఖం మరింత పెద్దదిగా కనిపిస్తుంది. మధ్య పాపిడి లేదా పక్క పాపిడి తీసుకుంటే బాగుంటుంది. పక్క పాపిడి సైతం కాస్త డీప్‌గా అంటే.. చెవులకు కాస్త పైనుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండూ మీ ముఖం కాస్త సన్నగా ఉన్నట్లు ఇల్యూషన్ క్రియేట్ చేస్తాయి. బ్యాంగ్స్ (ముంగురులు) చెంపల వరకు వచ్చేలా చూసుకోవాలి. ఒకవేళ మీరు హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటే.. షార్టర్ స్టైల్స్ ఎంచుకోండి. అవి మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా మార్చేస్తాయి.
స్క్వేర్ షేప్‌లో ఉంటే..
ఈ తరహా ముఖాకృతి కలిగిన వారికి నుదురు భాగం కాస్త విశాలంగా ఉంటుంది. కాబట్టి దాన్ని కప్పి ఉంచేలా హెయిర్ స్టైల్ ఉండాలి. దీనికోసం పక్క పాపిట తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ముఖం నాలుగు పలకలుగా కనిపించకుండా ఉంటుంది. పైగా అందంగానూ ఉంటుంది.
కోలముఖం కలిగిన వారికి
ఈ తరహా ముఖాకృతి కలిగిన వారు ఎలాగైనా పాపిట తీసుకోవచ్చు. పక్క పాపిట, డీప్ సైడ్ పార్టింగ్, మధ్య పాపిట.. ఏదైనా సరే వీరికి చాలా బాగుంటుంది. షార్ట్, మీడియం, లాంగ్ హెయిర్ స్టైల్స్ అయినా సరే.. వీరికి బాగా నప్పుతాయి.
డైమండ్ ఫేస్ షేప్ కలిగిన వారికి..
వీరికి నుదుటి భాగం, దవడల దగ్గరగా కాస్త షార్ప్‌గా ఉంటుంది. ఈ రెండింటినీ కవర్ చేస్తే.. ముఖం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వీరికి సైడ్ పార్టింగ్.. అదే పక్క పాపిట తీస్తే చాలా అందంగా కనిపిస్తారు. డైమండ్ ఫేస్ కలిగిన వారు.. పక్క పాపిట తీయడంతో పాటు లూజ్ హెయిర్ స్టైల్ తీసుకుంటే బాగుంటుంది. కర్ల్స్, వేవ్ హెయిర్ స్టైల్స్ కూడా వీరికి బాగుంటాయి.
పొడుగు ముఖం కలిగిన వారికి
నుదురు నుంచి గడ్డం వరకు ఒకే రీతిలో వీరి ముఖం ఉంటుంది. ఈ ముఖాకృతి కలిగినవారు అందంగా కనిపించాలంటే.. ముఖం కాస్త గుండ్రంగా కనిపించేలా చూసుకోవాలి. దీనికోసం మధ్య పాపిడి తీసి చెంపలను కవర్ చేసేలా హెయిర్ స్టైల్ చేసుకోవాల్సి ఉంటుంది.
హార్ట్ షేప్ ఫేస్ కలిగిన వారికి
Shutterstock
వీరికి ముఖం నుదురు దగ్గర విశాలంగా.. గడ్డం దగ్గర కాస్త సన్నగా ఉంటుంది. సైడ్ పార్టింగ్ లేదా డీప్ సైడ్ పార్టింగ్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ రెండు షార్ట్ హెయిర్ స్టైల్ ఉన్నవారికి బాగుంటాయి. ఒకవేళ మీకు పొడవు జుట్టు ఉండి ఉంటే.. మధ్య పాపిడి తీసుకోవచ్చు. ఏ రకమైన పాపిడి తీసుకున్నా.. జుట్టు చెంపల నుంచి జాలువారేలా స్టైల్ చేసుకుంటే బాగుంటుంది.
పియర్ షేప్ ముఖాకృతి కలిగిన వారికి
ఈ తరహా ముఖాకృతి కలిగిన వారికి నుదురు భాగం చిన్నగా, గడ్డం దగ్గర విశాలంగా ఉంటుంది. వీరికి డీప్ సైడ్ పార్టింగ్ చాలా బాగుంటుంది. మీ జుట్టును కర్ల్ చేసుకోవడం ద్వారా మరింత అందంగా కనిపించవచ్చు.
ఇవి కూడా చదవండి:
చిట్కాలు చిన్నవే.. కానీ జుట్టు పొడవుగా అయ్యేలా చేస్తాయి..
జుట్టు రాలకుండా ఉండాలంటే.. తలకు నూనె ఇలా రాసుకోవాలి
Feature Image: Shutterstock
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.