Beauty

క‌ళ్ల కింది న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను.. రెడ్ లిప్ స్టిక్‌తో క‌వర్ చేసేద్దాం..!

Lakshmi Sudha  |  Jan 29, 2019
క‌ళ్ల కింది న‌ల్ల‌టి వ‌ల‌యాల‌ను.. రెడ్ లిప్ స్టిక్‌తో క‌వర్ చేసేద్దాం..!

నిద్ర సరిగ్గా లేకపోయినా.. అనారోగ్యం బారిన పడినా.. పని ఒత్తిడి ఎక్కువైనా.. కళ్ల కింద నల్లటి వలయాలు (dark circles) ఏర్పడతాయి. వీటిని తగ్గించే విషయంలో మీకు మేము సాయం చేయలేకపోవచ్చు. కానీ వాటిని కవర్ చేసుకొనే విషయంలో మీకు హెల్ప్ చేస్తాం. మేం చెప్పే టిప్స్ ఫాలో అయితే.. అలసిన మీ కళ్లను తాజాగా కనిపించేలా చేసుకోవచ్చు.

డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడానికి మీరు ఎన్ని రకాల కన్సీలర్లు ఉపయోగించారు? కళ్లను తాజాగా క‌నిపించేలా తీర్చిదిద్దుకోవ‌డానికి ఎన్ని ఐక్రీంలను ఉపయోగించి ఉంటారు? వాటి కోసం ఎంత డబ్బు ఖర్చుపెట్టి ఉంటారు? కానీ ఇప్పుడు మేం చెప్పే మేకప్ టిప్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.

పైగా డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడంలో మేం చెప్పే ఈ చిట్కాని మీరు కచ్చితంగా ఫాలో అవుతారు. బ్యూటీ వ్లోగర్ దీపికా ముత్యాల డార్క్ లిప్ స్టిక్‌ను కన్సీలర్‌గా ఎలా ఉపయోగించుకోవాలో చెబుతున్నారు. కళ్ల కింద నల్లటి వలయాలనే కాదు.. ముఖంపై ఉన్న మచ్చలను కవర్ చేయడానికి కూడా ఈ చిట్కాను పాటించవచ్చు.

ఇండియన్ స్కిన్ టోన్స్‌కి రెడ్ లిప్ స్టిక్ బాగా సూటవుతుంది. మీది తెల్లని మేనిఛాయ అయితే పింకిష్ రెడ్ లిప్ స్టిక్ ఎంచుకోండి. డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడానికి ఏం చేయాలో తెలుసుకొందాం.

దీనికోసం కావాల్సినవి:

స్టెప్ 1: ఐషాడో బ్రష్‌ను లిప్ స్టిక్‌లో అద్ది దాన్ని మీ కళ్ల కింద అప్లై చేయాలి. రెండు కళ్ల కింద సమానంగా ఉండేలా దీన్ని అప్లై చేయాలి.

స్టెప్ 2: లిప్ స్టిక్ అప్లై చేసుకొన్న తర్వాత చూడటానికి అంత బాగా లేదనిపించవచ్చు. ఇదేంటి ఇలా చేశారని కంగారు పడొద్దు. ఎందుకంటే మనం చెయ్యాల్సింది ఇంకా ఉంది. లిప్ స్టిక్ అప్లై చేసుకొన్న చోట కన్సీలర్ అప్లై చేయండి. దీని కోసం బ్రష్ లేదా స్పాంజ్ ఉపయోగించండి.

స్టెప్ 3: ఇక మిగిలిన మేకప్ మీకు నచ్చినట్టుగా వేసుకోండి.

ఈ మేకప్ విధానం మీకు మరింత బాగా అర్థం కావాలంటే ఈ వీడియో వీక్షించండి.

Images: Pexels

Also Read:

ఈ సరికొత్త బ్యూటీ ప్రొడక్ట్స్ పై ఓ లుక్కేయండి

పర్ఫెక్ట్ పౌట్ లిప్స్ కోసం లిప్స్టిక్ ఇలా వేసుకోండి

 

Read More From Beauty