Lifestyle

ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన జేసీబీ.. ఎందుకో తెలుసా?

Soujanya Gangam  |  May 29, 2019
ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన జేసీబీ.. ఎందుకో తెలుసా?

ట్విట్టర్ (Twitter).. మన అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవడానికి ఒక చక్కటి వేదిక. అయితే ఒక్కోసారి ట్విట్టర్ పుణ్యమా అని అనుకోని అంశాలు కూడా ట్రెండింగ్‌గా మారిపోతుంటాయి. మీరు ఒకవేళ ట్విట్టర్ ఉపయోగిస్తూ ఉంటే గత రెండు రోజుల నుంచి జేసీబీ (JCB) గురించి మీమ్స్, జేసీబీ ఫొటొలు, వీడియోలు ట్రెండింగ్‌గా మారిన సంగతి మీరు కూడా గమనించే ఉంటారు. #JCBKiKhudayi పేరుతో జేసీబీ మట్టిని తవ్వుతున్న వీడియోలు, జేసీబీతో పాటు దిగిన ఫొటోలు వంటివి వైరల్‌గా మారుతున్నాయి. ఎంతగా అంటే జేసీబీ మట్టిని తవ్వుతున్న మామూలు వీడియోలకు కూడా వేల సంఖ్యలో వ్యూస్ వచ్చేంతలా..

జేసీబీ వీడియోలకు ఇన్ని వ్యూస్ రావడంతో ప్రతి అంశంలాగే దీని గురించి కూడా ట్విట్టర్‌లో మీమ్స్ ప్రారంభమైపోయాయి. ఇది సామాన్యుల వరకే కాదు.. సన్నీ లియోనీ లాంటి సెలబ్రిటీలు కూడా జేసీబీపై ఫోటో దిగి పోస్ట్ చేసేంత పాపులర్‌గా అయిపోయాయి. అయితే రెండు రోజుల నుంచి ఈ మీమ్స్ అన్నింటినీ చూస్తుంటే అబ్బా.. అసలు ఈ మీమ్స్ అన్నీ సరే.. కానీ వీటిని ఎందుకు పోస్ట్ చేస్తున్నారు.. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అన్న సందేహం రావడం సహజం.

చాలామంది ట్విట్టర్ యూజర్లకు కూడా ఇదే అనుమానం వచ్చింది. #JCBKiKhudayi హ్యాష్ ట్యాగ్ ఎందుకు ట్రెండింగ్‌లో ఉంది అని చాలామంది యూజర్లు ప్రశ్నించారు. దీనికి ఓ ట్విట్టర్ యూజర్ మొట్టమొదట పోస్ట్ అయిన జేసీబీ వీడియోను పంచుకున్నాడు. ఇందులో భాగంగా ఓ వరుడు గుర్రంపై కాకుండా జేసీబీ ముందు భాగంలో కూర్చొని పెళ్లి మండపానికి వెళ్లడం కనిపిస్తుంది. గత నెలలో వరంగల్‌లో ఓ జంట కూడా కారుకి బదులు జేసీబీ‌లో కూర్చొని వెళ్లడం మనం చూశాం. దీంతో పాటు ఓ రైతు తనకున్న ట్రాక్టర్‌కే ఇనుప మంచాన్ని జోడించి జేసీబీలా మార్చాడు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేయడం విశేషం.

ఇవన్నీ చూసి జేసీబీ సంస్థ ట్విట్టర్‌లో అందరికీ ధన్యవాదాలు చెప్పింది. తమపై ఆసక్తి చూపిన అభిమానులకు, #JCBKiKhudayi హ్యాష్ ట్యాగ్‌తో తమపై ప్రేమ చూపించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పుకొచ్చింది.

నటి సన్నీ లియోనీ కూడా జేసీబీ ఫొటో షేర్ చేస్తూ కెరీర్ ఛేంజ్ ? అంటూ ప్రశ్నించింది. ఈ ట్రెండ్‌ని ప్రారంభించింది ఎవరో తెలీదు కానీ.. మీమ్స్ తయారుచేసేవాళ్లకు మాత్రం పంట పండిందనే చెప్పాలి. దీనికి సంబంధించి లెక్కలేనన్ని మీమ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అందులో కొన్నింటిని మనమూ చూద్దాం రండి.

1. అమ్మాయిల కంటే అదే అద్భుతమైన కల మరి..

 

2. మట్టి తవ్వుతున్న జేసీబీ చూసేందుకు.. అంత ఎక్సైట్ మెంట్ ఎందుకో మరి..

3. కోపం రావడం సహజం. ఎందుకంటే జేసీబీ పై అంత నమ్మకం మరి..

 

4. రన్ రాజా రన్..

 

5. మిగిలినవన్నీ ఏమైపోయినా పర్లేదు. ముందు వీడియో చూడాలంతే..

 

6. క్లాసులు బంక్ కొట్టి మరీ వీడియోలు చూస్తారట.

 

7. అవును. నిజంగా లక్కీనే..

8. రాహుల్ ప్లీజ్ మళ్లీ రావా?

9. ఇలాంటివి కూడా ఉంటాయా?

 

10. అవును.. ఎప్పుడూ వీడియోలు చూస్తే అంతే..

11. అందరికీ ఒక సమయం వస్తుంది మరి.

12. సంజూ బాబాకి కూడా ఇష్టమే.

13. ఆఫీస్ పని ముఖ్యం కదా..

14. జేసీబీని చూసేందుకు మార్చ్ అట.

Images : Twitter.

 మీ అక్క కూడా అమ్మకు మరో రూపమా? అయితే ఈ మీమ్స్ మీ ఇద్దరి కోసమే..!

వాట్సాప్ వల్ల మీ ఫోన్ హ్యాక్ కాకుండా.. ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా?

 #ToMaaWithLove అమ్మ సోషల్ మీడియాలో ఉంటే.. ఎలా ఉంటుందంటే..?

Read More From Lifestyle