ధోనీ, భరత్ అనే నేను, వినయ విధేయ రామ.. చిత్రాల్లో నటించి కథానాయికగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొంది కియారా అద్వానీ (Kiara Advani). లస్ట్ స్టోరీస్ వంటి వైవిధ్యభరితమైన చిత్రంతోనూ మెప్పించింది. ప్రస్తుతం ‘ఇందూ కీ జవానీ’ అనే మరో హిందీ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది కియారా. డేటింగ్ యాప్స్ లో అబ్బాయిల ప్రొఫైల్స్ ను చూసి వారితో డేటింగ్ చేయాలనుకొనే అమ్మాయి కథ ఇది. ఈ సినిమాలో నటిస్తున్నందుకు కియారా తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేసింది. ‘ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి మద్ధతు నాకు అందిస్తారని కోరుకొంటున్నా’ అని ట్వీట్ చేసింది కియారా.
అయితే ఈ సినిమా విషయంలో కంగన సోదరి రంగోలీ(Rangoli) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇలాంటి సినిమా ఎవరైనా తీస్తారా?’ అని ప్రశ్నించింది. ‘ఇందూ కీ జవానీ అనే పేరుతో ఎవరైనా సినిమా రూపొందిస్తారా? ఓ పక్క మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుకొంటున్నాం. మరో పక్క మహిళలను బొమ్మలుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమాను సెన్సార్ బోర్డ్ అప్రూవ్ చేసిందంటే అది మన చెంప మీద చాచి కొట్టినట్టే. అమ్మాయిలను అవమానించినట్టే. భవిష్యత్తులో బాలికలు తలదించుకోవాల్సి ఉంటుంది. మనబకోసం మనమే ధైర్యంగా నిలబడలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటి సినిమాలు చేయడానికి సిగ్గనిపించడం లేదా? ఈ చిత్రాలను రూపొందించిన బాలీవుడ్ దర్శక, నిర్మాతలు వారి కుమార్తెల కళ్లల్లోకి చూడగలరా?’ అంటూ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేసింది.
రంగోలీ చేసిన కామెంట్లపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇందూ కీ జవానీ గురించి మాట్లాడుతున్న రంగోలీకి తన అక్క నటించిన రివాల్వర్ రాణి, రజ్జో, మెంటల్ హై క్యా, రాస్కెల్స్, తేజ్ సినిమాలు కనిపించలేదా? వాటి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఎదుటి వారి వ్యక్తిగత ఇష్టాలను గౌరవించాలని హితవు పలుకుతున్నారు. జవానీ అంటే యవ్వనమని అర్థమని.. అదేమీ అనకూడని పదమేమీ కాదని అంటున్నారు ట్విట్టరాటీస్. అంతేకాదు.. ఎదుటివారి పర్సనల్ ఛాయిస్ ను గౌరవించడం నేర్చుకోమని రంగోలీకి హితవు పలుకుతున్నారు. మరి వీటికి రంగోలీ ఎలాంటి బదులిస్తుందో చూడాలి.
రంగోలీ కామెంట్లపై కియారా ఇంకా స్పందించలేదు. కానీ ట్విట్టర్లో ఆమెకు మాత్రం మద్ధతు వెల్లువెత్తుతోంది. ప్రస్తుతం కియారా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్, కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్, గుడ్ న్యూస్, షేర్ షా సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. ఇందూ కీ జవానీ సినిమాను ఎమ్మీ ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తుండగా, అబీర్ సేన్ గుప్తా దర్శకత్వం వహించనున్నారు.
Image: Instagram
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.
ఇవి కూడా చదవండి:
నీకెంత మంది ప్రపోజ్ చేశారు? అభిమాని ప్రశ్నకు రకుల్ ఎలాంటి జవాబిచ్చిందంటే..?
నాతో సహజీవనం చేయడం కోసం.. సైఫ్ మా అమ్మని పర్మిషన్ అడిగాడు: కరీనా