రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చిత్రం డియర్ కామ్రేడ్ ఇంకొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ చిత్రం పైన.. అటు ప్రేక్షకులతో పాటు ఇటు విజయ్‌కి కూడా చాలా అంచనాలే ఉన్నాయి. పైగా ఈ చిత్రం దక్షిణాదిలో తెలుగు, తమిళ, కన్నడ & మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది. ఒకరకంగా బాహుబలి చిత్రం తరువాత.. అన్ని దక్షిణాది భాషల్లో విడుదలవుతున్న తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. దీనితో ఇప్పటికే వార్తల్లో నిలిచిన ఈ చిత్రం గురించిన మరొక ఆసక్తికర విషయం బయటికొచ్చింది.
ఈ ముద్దుకు… కథకు సంబంధముంది: ‘డియర్ కామ్రేడ్’ కథానాయిక రష్మిక
అదేంటంటే – డియర్ కామ్రేడ్ (Dear Comrade) చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి.. ప్రముఖ నిర్మాత & దర్శకుడు కరణ్ జోహార్ ముందుకి వచ్చారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనని కరణ్ జోహార్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేయగా.. అంతకముందు విజయ్ తన డియర్ కామ్రేడ్ చిత్రం టీంతో కలిసి ముంబై వెళ్ళి.. ఆయనకీ ఈ సినిమాని చూపెట్టడం జరిగింది.
అలా ప్రివ్యూ చూసిన కరణ్ జోహార్‌కి (Karan Johar ), ఈ చిత్రం బాగా నచ్చడంతో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ రీమేక్‌లో విజయ్ దేవరకొండని హీరోగా నటించమని కోరగా.. దానికి విజయ్ సుముఖత వ్యక్తం చేయలేదట. భవిష్యత్తులో ఏదైనా తెలుగు-హిందీ బైలింగ్వల్‌లో నటించేందుకు ఇష్టమే కాని.. తన చిత్రం రీమేక్‌లో తానే నటించడం ఇష్టం లేదని చెప్పాడట.
ఇక ఇప్పటికే బాహుబలి 1 & 2, ఘాజీ వంటి చిత్రాలని హిందీలో విజయవంతంగా విడుదల చేసిన అనుభవంతో .. తెలుగులో వచ్చే మంచి చిత్రాలని హిందీలో రీమేక్ చేసేందుకు గత కొంతకాలంగా కరణ్ జోహార్ ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే ఈ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్ చేసేందుకు ముందుకి వచ్చారు. సినిమా విడుదలకి రెండు రోజుల ముందే.. ఈ చిత్ర రీమేక్ హక్కులు అమ్ముడవడంతో… డియర్ కామ్రేడ్ చిత్రం పైన ఉన్న అంచనాలు ఒక్కసారిగా పదింతలయ్యాయి. ఈ పరిణామం కచ్చితంగా సినిమా పైన పాజిటివ్ ప్రభావం చూపనుంది.
అలాగే నిన్న ముంబైకి వెళ్లిన సందర్భంలో.. అక్కడ మీడియా వారికి విజయ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో తన చిత్రం డియర్ కామ్రేడ్ గురించి, దానిని హిందీలో రీమేక్ చేయనుండడం వంటి వాటి గురించి వివరాలు చెప్పడం జరిగింది. తన బాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా కొన్ని ఆసక్తికర వివరాలు తెలియచేయడం జరిగింది. ఇవ్వన్ని కాకుండా.. తాజాగా కబీర్ సింగ్ పైన వచ్చిన విమర్శల పైన కూడా తనదైన శైలిలో సమాధానం చెప్పాడు విజయ్. అలాగే విజయ్‌ని.. కరణ్ జోహార్ మరో సినిమాలో హిందీలో లాంచ్ చేసే అవకాశాలున్నాయని.. పలు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
మీరు నన్ను భయపెట్టలేరు – ‘డియర్ కామ్రేడ్’లో విజయ్ దేవరకొండ
ఇదిలావుండగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు కలిసి ఇప్పటికే బెంగళూరు, కొచ్చిన్, చెన్నయ్ ప్రాంతాలకు వెళ్లి తమ చిత్రాన్ని ప్రమోట్ చేసి వచ్చారు. అదే విధంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి చేరువ చేయడానికి అన్ని విధాలుగా ప్రచార కార్యక్రమాలని డిజైన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
ఇక విజయ్ చేతిలో డియర్ కామ్రేడ్ చిత్రం తరువాత ముగ్గురు హీరోయిన్స్‌తో కలిసి చేస్తున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలోని చిత్రం ఉండగా… ఆనంద్ అన్నామలై అనే దర్శకుడు చేస్తున్న ‘హీరో’ అనే చిత్రం కూడా విజయ్ చేతిలో ఉంది. ఈ రెండు చిత్రాలలో ఒకటి 2019 చివరలో.. అలాగే ఇంకొక చిత్రం 2020లో విడుదలకానున్నాయి.
ఆఖరుగా మైత్రి మూవీ మేకర్స్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా దక్షిణాది భాషల్లో నిర్మించిన ఈ డియర్ కామ్రేడ్ చిత్రం జులై 26న విడుదల కాబోతుంది. దాదాపు ఇప్పటివరకు ఈ చిత్రం పై పాజిటివ్ టాకే ఉంది. మరి అది చిత్రం విడుదలయ్యాక కూడా ఉంటుంది అని ఆశిద్దాం. ఈ చిత్రం గనుక విజయవంతమైతే… విజయ్ దేవరకొండ స్టార్ డమ్ దక్షిణాది మొత్తం పాకిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
#Metoo తమిళ నటి పై లైంగిక వేధింపులు.. విజయ్ దేవరకొండ చిత్రంలో ఛాన్స్ ఇస్తానన్న దర్శకుడు