Bollywood

#JoinRishi అంటూ ‘ఉగాది’ని స్టైలిష్‌గా మార్చేసిన… మహేష్ బాబు ‘మహర్షి’ టీజర్

Sandeep Thatla  |  Apr 5, 2019
#JoinRishi అంటూ ‘ఉగాది’ని స్టైలిష్‌గా మార్చేసిన… మహేష్ బాబు ‘మహర్షి’ టీజర్

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సినీ కెరీర్‌లో 25వ చిత్రంగా (#SSMB25) మన ముందుకి వస్తున్న మహర్షి (Maharshi) చిత్రానికి సంబందించిన మొదటి ఝలక్‌ను (#JoinRishi ) ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్.. కొద్దిసేపటి క్రితమే ప్రేక్షకులకి అందించింది. అభిమానుల కేరింతల మధ్య ఈ సినిమా టీజర్ విడుదలైంది.

ఇంతకీ టీజర్ ఎలా ఉందంటే –

టీజర్ మొదలవుతూనే హెలికాప్టర్ నుండి మహేష్ బాబు దిగే.. స్టైలిష్ షాట్ ప్రేక్షకులకు కనువిందు చేయగా

“రిషి కుమార్ సక్సెస్ స్టోరీ ఇక్కడితో ఆగిపోయినట్టేనా?” అన్న ప్రశ్నకి

“సక్సెస్ స్టోరీ‌లో ఫుల్ స్టాప్స్ ఉండవు… కామాస్ మాత్రమే ఉంటాయి…

సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్ … సక్సెస్ ఈజ్ ఏ జర్నీ….” (Success is not a destination…. Success is a Journey)

అనే Inspiring Quotation ను మహేష్ బాబు చేత చెప్పించడం విశేషం.

దీనితో మనకి ఈ సినిమా కథ రిషి అనే ఓ యువకుడి ప్రయాణం అని అర్ధమైపోగా.. ఆ తరువాత వచ్చే డైలాగ్‌తో రిషి (Rishi) మనస్తత్వాన్ని కూడా మనకి దర్శకుడు పరిచయం చేసే ప్రయత్నం చేశాడు.

 

ఆ డైలాగ్ కూడా చదివేయండి మరి –

నాకొక ప్రాబ్లెమ్ ఉంది సార్… ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే.. గెలిచి చూపించడం నాకు అలవాటు!! అనే డైలాగ్‌కు కూడా ప్రస్తుతం అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ విధంగా 80 సెకన్ల టీజర్‌లో.. చిత్రంలో కథానాయకుడి వ్యక్తిత్వం గురించి దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించడం జరిగింది. దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) ఈ చిత్రంలో మహేష్  బాబు‌ని స్టైలిష్‌గా చూపెట్టాడనే విషయం.. ఇటీవలే విడుదలైన పోస్టర్స్‌లో కనిపిస్తే.. ఈ టీజర్ చూసాక ఆ స్టైల్ ఏ రేంజ్‌లో ఉందనే విషయం మనకి అర్ధమవుతుంది.

ఇక మహర్షి చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలైన పూజ హెగ్డే (Pooja Hegde) & అల్లరి నరేష్‌ల (Allari Naresh) గురించి రాబోయే టీజర్స్‌లో చెప్పే ఉద్దేశ్యంతో.. ఈ టీజర్‌ని మహేష్ బాబు‌కి మాత్రమే పరిమితం చేశారు.

ఈ టీజర్ చూసాక మనకి కూడా ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందనే విషయం అర్ధమైపోయింది కదా. మే 9న విడుదలకాబోయే ఈ చిత్రం అటు ప్రేక్షకులని.. ఇటు అభిమానులని అలరిస్తుంది అని ఈ టీజర్ మనకి హింట్ ఇచ్చేసింది.

 

ఇక ఈ చిత్రానికి మంచి సాంకేతిక వర్గాన్నే ఎంపిక చేశారు నిర్మాతలు. సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహకుడిగా మోహనన్ మహర్షి చిత్రానికి పనిచేస్తుండగా..  మహేష్ బాబు‌కి ఇష్టమైన యాక్షన్ డైరెక్టర్స్ రామ్-లక్ష్మణ్‌లు ఈ చిత్రానికి వర్క్ చేయడం గమనార్హం.

తెలుగు చిత్రపరిశ్రమలో మూడు భారీ నిర్మాణ సంస్థలుగా పేరెన్నిక గల దిల్ రాజుకి (Dil Raju)  చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ, అశ్వినిదత్ సంస్థ వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) &  పీవీపీ సినిమాలు (PVP Cinema) కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఆ అంచనాలని పెంచే విధంగానే సినిమాని తీశారని తెలుస్తోంది. 

ఇంకొక నెల రోజుల్లో రిషి తన స్నేహితులతో కలిసి మహర్షిగా మన ముందుకి రాబోతున్నాడు…

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు వర్సెస్ మహేష్ బాబు: క్రేజీ ఫ్యాన్స్ సమక్షంలో.. ప్రిన్స్ విగ్రహం ఆవిష్కరణ..!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన… బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ నటిస్తోందా..?

ఇండియన్ సూపర్ స్టార్స్ సరసన.. మహేష్ బాబుకి దక్కిన అరుదైన అవకాశం..!

Read More From Bollywood