Fashion

క‌ళ్లు చెదిరే అంద‌మే కాదు.. చ‌క్క‌ని ఫ్యాష‌న్ సెన్స్ కూడా పాయ‌ల్ సొంతం..!

Sridevi  |  Mar 18, 2019
క‌ళ్లు చెదిరే అంద‌మే కాదు.. చ‌క్క‌ని ఫ్యాష‌న్ సెన్స్ కూడా పాయ‌ల్ సొంతం..!

పాయ‌ల్ రాజ్ పూత్ (Paayal rajput).. ఈ పేరు చెబితే ఆమెను గుర్తుప‌ట్టేవారు కాస్త త‌క్కువ‌గానే ఉండ‌చ్చు. కానీ తెలుగులో చిన్న సినిమాగా వ‌చ్చి బాక్సాఫీస్‌నే గ‌డ‌గ‌డ‌లాడించిన “ఆర్ ఎక్స్ 100” సినిమాలోని “ఇందు” పాత్ర పేరు చెప్ప‌గానే ఈ అందాల భామ రూపం అంద‌రి క‌ళ్ల ముందు క‌ద‌లాడుతుంది. కేవ‌లం క‌ళ్లు చెదిరే అందం మాత్ర‌మే కాదు.. అంత‌కుమించిన చ‌క్క‌ని ఫ్యాష‌న్ సెన్స్ (Fashions) కూడా ఈ అమ్మ‌డి సొంతం.

కేవ‌లం సినిమాల‌కు సంబంధించిన వేడుక‌ల‌కే కాకుండా ఈ అమ్మ‌డు హాజ‌ర‌య్యే ప్రైవేట్ ఫంక్ష‌న్స్, కార్య‌క్ర‌మాల‌కు ఆయా సంద‌ర్భాల‌కు త‌గిన‌ట్లుగా చ‌క్క‌గా డ్ర‌స్ చేసుకుని అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తుందీ అందాల బొమ్మ‌. తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు ఆర్ ఎక్స్ 100, ఎన్టీఆర్ క‌థానాయకుడులో జ‌య‌సుధ‌గా న‌టించి మెప్పించిన ఈ భామ మూడు తెలుగు సినిమాలు, మ‌రొక త‌మిళ చిత్రంలో న‌టిస్తూ ఫుల్ బిజీ అయిపోంది. మ‌రి, ఈ అమ్మ‌డికి ఉన్న ఫ్యాష‌న్ సెన్స్ గురించి మ‌న‌మూ ఓసారి చూద్దాం రండి..

డెనిమ్ జీన్స్ లేదా జాకెట్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రుంటారు చెప్పండి? అందుకేగా మ‌న వార్డ్ రోబ్‌లో ఒక డెనిమ్ టాప్‌ని, త‌ప్ప‌కుండా భాగం చేసుకునేది అంటారా?? నిజ‌మే కానీ.. ఆ డెనిమ్ ఫ్యాష‌న్‌నే ఇంకాస్త ప్ర‌త్యేకంగా క‌నిపించేలా చేయ‌డం ఎలాగో మీకు తెలుసా?? మ‌న పాయ‌ల్ రాజ్ పూత్‌ని ఒక‌సారి చూడండి. డెనిమ్ బాట‌మ్‌కు బ్లూ & వైట్ మిక్స్డ్.. డెనిమ్ టాప్ ని జ‌త చేసి సింపుల్‌గా టాప్ నాట్ హెయిర్ స్టైల్‌తో ఎంత అందంగా మెరిసిపోతోందో..!

ఫ్యాష‌న్స్‌లో ఎన్ని కొత్త ట్రెండ్స్ వ‌చ్చినప్ప‌టికీ ఫ్లోర‌ల్ ప్రింట్స్ వంటివి ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ అనే చెప్పుకోవాలి. అందుకే ఫ్లోర‌ల్ ప్రింటెడ్ టాప్, ఫ్రాక్ లేదా కార్డిగాన్.. ఇలా ఏదో ఒక‌టి అమ్మాయిల వార్డ్ రోబ్‌లో క‌చ్చితంగా ఉంటుంది. మ‌న పాయ‌ల్ కూడా అందుకు అతీతం ఏమీ కాదు. చూడండి.. లైట్ బ్లూ షేడ్‌లోని ఫ్లోర‌ల్ టాప్‌కు రెడ్ క‌ల‌ర్ లిప్ స్టిక్ జ‌త చేసి సింపుల్‌గా త‌న ఫ్యాష‌న్ సెన్స్‌ను చాటుకుంది.

ఫ్లోర‌ల్ ప్రింట్స్ అంద‌రి దగ్గ‌రా ఉంటాయి. కానీ వాటిని ధ‌రించే శైలి బ‌ట్టే లుక్ కూడా ఆధార‌ప‌డి ఉంటుంది. పాయ‌ల్‌ను చూడండి. త్రీ ఫోర్త్ బాట‌మ్‌కు ఫ్లోర‌ల్ ప్రింటెడ్ తెలుపు రంగు టాప్ జ‌త చేసి ప‌ర్ఫెక్ట్ బీచ్ లుక్ సొంతం చేసుకుంది. ఇలా డ్ర‌స్ చేసుకున్న త‌ర్వాత చూసిన వారు ఎవ‌రైనా చూపు తిప్పుకోగ‌ల‌రంటారా??

చుడీదార్ .. ఇది కూడా ప్ర‌తి అమ్మాయి వార్డ్ రోబ్‌లో త‌ప్ప‌కుండా భాగ‌మ‌య్యే అవుట్ ఫిట్. కాక‌పోతే కొంద‌రు డిజైన‌ర్ త‌ర‌హావి ఎంచుకుంటే; ఇంకొంద‌రు ప్లెయిన్ చుడీదార్స్ ఎంపిక చేసుకుంటారు. కానీ పాయ‌ల్‌ని చూడండి. లేటెస్ట్ ట్రెండ్స్‌లో ఒక‌టైన స్మైలీ ప్రింట్‌తో ఉన్న చుడీదార్‌ని ధ‌రించి స‌మ్‌థింగ్ స్పెష‌ల్ అనిపించేలా క‌నిపిస్తోంది క‌దూ!

సింపుల్ డ్ర‌స్సింగ్‌తోనే హాట్ లుక్స్ సొంతం చేసుకోవాలంటే పాయ‌ల్‌ని ఫాలో కావాల్సిందే. చూడండి.. ప్లెయిన్ బ్లాక్ క‌ల‌ర్ టాప్ అండ్ బాట‌మ్‌కు ఒక ప్రింటెడ్ ఓవ‌ర్ కోట్ జ‌త చేసి కాలేజ్ గ‌ర్ల్‌లా ఎలా మెరిసిపోతోందో..!

లెహెంగా.. ఈ రోజుల్లో ఈ ఫ్యాష‌న్‌ను కూడా చాలామంది అమ్మాయిలు అనుస‌రిస్తున్నారు. మ‌రి, అందులో మీ స్పెషాలిటీ కాస్త క‌నిపించాలి క‌దా..! అందుకే మ‌న పాయ‌ల్ శైలిలో వాటితో ప్ర‌యోగాలు చేసి చూడండి. ప‌సుపు, ఎరుపు రంగు కాంబినేష‌న్‌లో రూపొందించిన వ‌న్ షోల్డ‌ర్ లెహెంగాతో సింప్లీ సూప‌ర్బ్ అనిపించింది.

ఈ రోజుల్లో రాత్రి వేళల్లో జ‌రిగే పార్టీలు, వేడుక‌ల‌కు చాలామంది షిమ్మ‌రీ అవుట్ ఫిట్స్‌నే ఎంపిక చేసుకుంటున్నారు. మీరు కూడా అంతేనా?? అయితే పాయ‌ల్ ధ‌రించిన ఈ లాంగ్ ఫ్రాక్ చూడండి. లైట్ పింక్ షేడ్ డిజైన‌ర్ ఫ్రాక్‌కు షిమ్మ‌రీ మేక‌ప్ జ‌త చేసి అప్స‌ర‌స‌లా మెరిసిపోతుంది.

పాయ‌ల్ ధ‌రించిన ఈ లైట్ బ్లూ క‌ల‌ర్ షేడ్ అవుట్ ఫిట్ కూడా కాలేజీ అమ్మాయిల‌కు మంచి ఎంపిక అని చెప్ప‌వ‌చ్చు. దీనిపై ఉన్న సిల్వ‌ర్ వ‌ర్క్ ఆ డ్ర‌స్ అందాన్ని మ‌రింత పెంచుతోంది. కాదంటారా?? మీరే చెప్పండి..!

ఇవి కూడా చ‌ద‌వండి

శ్రీ‌ముఖి ఫ్యాష‌న్స్.. భిన్న‌మే కాదు.. భ‌లే అందంగా కూడా ఉంటాయి..!అందాల అన‌సూయ ఫ్యాష‌న్స్‌తో.. స‌మ్మ‌ర్‌లోనూ కూల్ లుక్స్‌తో మెరిసిపోవ‌చ్చు..!

ర‌ష్మీ గౌత‌మ్ ఫ్యాష‌న్స్ .. సింపుల్ & స్టైలిష్.. మీరూ చూడండి..!

Read More From Fashion