Beauty

జస్ట్.. ఒక్క నిమిషంలో.. అందమైన ఐబ్రోస్ కావాలంటే ఏం చేయాలి..?

Lakshmi Sudha  |  Jan 18, 2019
జస్ట్.. ఒక్క నిమిషంలో.. అందమైన ఐబ్రోస్ కావాలంటే ఏం చేయాలి..?

ఐబ్రోస్ పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారా? నేనూ అంతే. కానీ ఏం చేస్తాం. మన దగ్గర ప్రశాంతంగా భోం చేయడానికే సమయం ఉండటం లేదు.. ఇక కనుబొమ్మలు అందంగా క‌నిపించేలా దిద్దుకోవడానికి సమయం ఎక్కడుంటుంది? పోనీ.. మేకప్ వేసుకోవడానికి ఓ పది నిమిషాలు కేటాయించుకొన్నామంటే.. ఫౌండేషన్, కన్సీలర్, మస్కారా వేసుకొనేట‌ప్పటికే ఉన్న సమయం కాస్తా అయిపోతుంది. ఇక ఐబ్రోస్ షేప్ అందంగా ఎలా మలచుకొనేది? అయితే కొన్నేళ్ల నుంచి ఇలాగే చేస్తూ ఉండటం వల్ల ఐబ్రో పెన్సిల్ ఉప‌యోగించి తక్కువ సమయంలో క‌నుబొమ్మ‌ల‌ (Eyebrows)ను తీర్చిదిద్దుకునే విషయంలో నేను కొన్ని కిటుకులు తెలుసుకొన్నాను. వాటితో నా కనుబొమ్మలను ఒత్తుగా, నల్లగా క‌నిపించేలా చేసుకోగలుగుతున్నాను. ఆ కిటుకులేంటో మీకూ తెలుసుకోవాలనుంది కదా..

అసలు కనుబొమ్మలను ఒక్క నిమిషంలో ఎలా తీర్చిదిద్దుతారు?

ఏంటీ? ఐబ్రోష్ తక్కువ సమయంలో తీర్చిదిద్దుకోవడం సాధ్యమవుతుందా? అదీ ఒక్క నిమిషంలోనా అని సందేహిస్తున్నారా? అయితే ముందు మీరు త్వరగా ఇది చదవండి..

Image: Jahnvi Kapoor on Instagram

1. బ్రౌన్ ఐ షాడో, మస్కారా

మీ కనుబొమ్మలు పలుచగా ఉంటే.. బ్రౌన్ రంగులోని ఐషాడో, మస్కారా ఉపయోగిస్తే చాలు.. మీ ఐబ్రోస్ ఒత్తుగా కనిపిస్తాయి. ముందుగా చిన్న బ్రష్ సాయంతో ఐషాడో వేసుకోవాలి. ఇది పూర్తయిన తర్వాత స్పూలీ బ్రష్ తో ఐ బ్రోస్ ను దువ్వుకోవాలి. ఆ తర్వాత ఐబ్రో మస్కారా అప్లై చేసుకోవాలి.

దానికోసం ఎన్ వై ఎక్స్ ప్రొఫెషనల్ మేకప్ టింటెడ్ బ్రో మస్కారా (రూ. 480), వెట్ అండ్ వైల్డ్ అల్టిమేట్ బ్రో కిట్ (రూ. 399) ప్రయత్నించి చూడండి.

క్విక్ టిప్: ప్రత్యేకంగా ఐబ్రో మస్కారా (mascara) కొనడానికి మీకు ఆసక్తి లేకపోతే.. మీ దగ్గర పాతది లేదా ఆరిపోయిన మస్కారా ఉంటే దాన్ని ఐబ్రో మస్కారాగా వాడొచ్చు.

2. కన్సీలర్

మీ కనుబొమ్మలు ఒత్తుగా, నల్లగా ఉంటే మీరు చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. కనుబొమ్మలు తీర్చిదిద్దుకోవడానికి పెద్దగా సమయం కేటాయించాల్సిన అవసరం ఉండ‌దు. లైట్ షేడ్ లోని కన్సీలర్ ను కనుబొమ్మల కింద అప్లై చేసుకోవాలి. దీని వల్ల ఐబ్రోస్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆపై బ్రష్ సాయంతో కనుబొమ్మలు దువ్వుకోవాలి. కావాలనుకొంటే.. ఐబ్రో మస్కారా అప్లై చేసుకోవచ్చు.

దీనికోసం మేబీలీన్ న్యూయార్క్ ఫిట్ మీ కన్సీలర్ (రూ. 380) ఓ సారి ప్రయత్నించండి.

3. ఐబ్రో పెన్సిల్, పౌడర్

ఇటీవలి కాలంలో మార్కెట్లోకి వస్తున్న ఐబ్రో సంబంధిత ఉత్పత్తులు డబుల్ సైడెడ్ టిప్ తో వస్తున్నాయి. అంటే ఓ వైపు పెన్సిల్ మరో వైపు ఐబ్రో పౌడర్ ఉంటుంది. పెన్సిల్ తో కనుబొమ్మల ఆకృతిని అందంగా తీర్చిదిద్ది.. ఎక్కడైనా ఖాళీలు కనిపిస్తే వాటిని పౌడర్ తో సరిచేసుకోవచ్చు. అలాగే కనుబొమ్మలు డార్క్ గా కనిపించడానికి ఈ పౌడర్ ను ఉపయోగిస్తారు. ఇలా చేయడం పూర్తయిన తర్వాత మస్కారా స్పూలీ లేదా ఐబ్రో దువ్వెన(eye brow comb) సాయంతో దువ్వితే మరింత అందంగా కనిపిస్తాయి.

మేబీలీన్ ఫ్యాషన్ బ్రో డ్యుయో షేపర్ (రూ. 225)ను ప్రయత్నించండి.

ఒక్క నిమిషంలో ఐబ్రోస్ ను అందంగా ఎలా తీర్చిదిద్దుకోవచ్చో చూశారుగా. ఇలా చేయడం కోసం మేకప్ ఆర్టిస్ట్ కి ఉన్న నైపుణ్యాలు మ‌న‌కి తెలియాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలతోనే బ్రైట్ లుక్ సొంతం చేసుకోవచ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి

చిట్కాలు చిన్నవే.. కానీ జుట్టు పొడవుగా అయ్యేలా చేస్తాయి..

పర్ఫెక్ట్ పౌట్ లిప్స్ కోసం.. లిప్ స్టిక్ ఇలా వేసుకోండి..

ఫ్రెండ్ పెళ్లికి వెళుతున్నారా? బొట్టు ఇలా పెట్టుకోండి..

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

https://www.popxo.com/shop/

 

Read More From Beauty