Bigg Boss

Bigg Boss Telugu 3: బిగ్ బాస్‌తో డీల్ కుదుర్చుకున్న వరుణ్, రాహుల్, రవికృష్ణ

Sandeep Thatla  |  Aug 27, 2019
Bigg Boss Telugu 3: బిగ్ బాస్‌తో డీల్ కుదుర్చుకున్న వరుణ్, రాహుల్, రవికృష్ణ

“బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3″లో ఆరవ వారం ప్రారంభమయ్యే సరికి.. ఇంటి సభ్యులు కూడా గేమ్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారని స్పష్టమైంది. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్‌లో .. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న హిమజ, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, మహేష్ విట్టా, పునర్నవి & రవిక్రిష్ణలకి బిగ్‌బాస్ (Bigg Boss) ఒక డీల్ ఇవ్వడం జరిగింది.

ఆ డీల్ “హౌస్”లో చాలా అరుదుగా ఇవ్వడం జరుగుతుంటుందని స్వయంగా బిగ్ బాస్ చెప్పడం విశేషం. ఇంతకీ ఆ డీల్ ఏమిటంటే.. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురు ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ముగ్గురు సభ్యులని ఎంపిక చేసుకోవాలి. ఆ ఆరుగురిలో ఎంపికైన ముగ్గురు సభ్యులే – వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్ & రవికృష్ణ.

బిగ్‌బాస్ హౌస్‌లోని వెన్నుపోటుదారుల గురించి తెలుసా..?

అలా ఎంపిక చేసిన ముగ్గురు సభ్యులకి బిగ్ బాస్ ఒక ప్రత్యేకమైన టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ప్రకారం, ముగ్గురు సభ్యులని యాక్టివిటీ రూమ్‌కి పిలిచి.. అక్కడ బోర్డు పైన ఉన్న 8 టాస్క్‌లలో.. ఓ రెండింటిని ఎంపిక చేసుకుని అవి విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. అలా చేస్తే నామినేషన్స్ నుండి సేఫ్ అవుతారని బిగ్ బాస్ చెప్పడం జరిగింది.

ఈ క్రమంలో తొలుత, రవికృష్ణ రెండు టాస్క్‌లని ఎంపిక చేసుకున్నాడు. ఆ టాస్క్‌ల ప్రకారం – ఒక ఇంటి సభ్యుని పైన షేవింగ్ ఫోమ్ వేయాలి.. అలాగే మరో ఇంటి సభ్యుని బెడ్‌ని పూర్తిగా నీటిలో తడపేయాలి. ఈ టాస్క్‌లో భాగంగా వితిక పైన షేవింగ్ ఫోమ్ వేసిన రవి… శివజ్యోతి బెడ్‌ని పూర్తిగా నీటిలో తడిపేసాడు.

రెండవ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్.. తాను ఎంపిక చేసుకున్న టాస్క్‌లలో భాగంగా తొలుత వరుణ్-వితికలకి చెందిన హార్ట్ పిల్లో‌ని పూర్తిగా పాడు చేయాలి. అలాగే ఎవరైనా ఇంటి సభ్యులని రెచ్చగొట్టి.. వారితో వాగ్వాదానికి దిగాలి. రాహుల్ సిప్లిగంజ్ ఈ టాస్క్‌లో భాగంగా.. ఇంట్లో  శ్రీముఖి, శివజ్యోతి, హిమజలని రెచ్చగొట్టి..  వారిని ఆలీతో వాగ్వాదానికి దింపగలిగాడు.

ముచ్చటగా మూడవ కంటెస్టెంటైన వరుణ్ సందేశ్ (Varun Sandesh).. తాను ఎంపిక చేసుకున్న టాస్క్‌లలో భాగంగా… వితిక పైన కోల్డ్ కాఫీ పోయగా.. వితికకి చెందిన ఒక డ్రెస్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేశాడు. ఈ రెండు టాస్క్‌లు చేసే సమయంలో వితిక చాలా కోపంతో ఉండగా… ఎన్నో తంటాలు పడి తనకిచ్చిన టాస్క్‌ని పూర్తి చేశాడు.

మరోసారి నామినేషన్స్‌లోకి పునర్నవి & హిమజ

అయితే ఈ బిగ్ బాస్ డీల్‌ని పూర్తి చేసే సమయంలో.. రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఇంటి సభ్యులతో కాస్త కటువుగానే ప్రవర్తించాడు. ఆ కారణంగా.. బిగ్ బాస్ హౌస్‌లోని ఆడవాళ్ల నుండి బ్యాడ్ కామెంట్స్ కూడా పొందాడు. ప్రధానంగా హిమజ, శివజ్యోతి, శ్రీముఖిలతో.. టాస్క్‌లో భాగంగా తాను ప్రవర్తించిన తీరుకి సారీ చెప్పాడు. అయితే మరోసారి శ్రీముఖి… రాహుల్ సిప్లిగంజ్ గురించి తాను అనుకున్న విషయాలన్నీ కుండబద్దలు కొట్టి చెప్పేసింది.  అదే సమయంలో క్షమాపణ కూడా తీసుకుంది.

అలా ఈ వారం నామినేషన్స్ నుండి వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణలు ఇమ్మ్యూనిటీ పొందగలిగారు. దీనితో ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళేందుకు హిమజ, పునర్నవి, మహేష్ విట్టాలు నామినేషన్స్‌లో నిలిచారు.

మరి ఈ ముగ్గురిలో ఎవరు ఈ వారం ఇంటి నుండి బయటకి వెళుతున్నారు అనేది.. మరో రెండు రోజుల్లో తెలుస్తుంది.                                                        

అషు రెడ్డి హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే..?

 

Read More From Bigg Boss