బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 (bigg boss telugu season 3) నిన్నటితో పూర్తయింది. దాదాపు 4 గంటలకు పైగా సాగిన ఈ ఫినాలే ఆధ్యంతం ఆహ్లాదంగా సాగింది. అలాగే నిన్నటి షో లో ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్సులు ఇవ్వగా వారితో పాటు ప్రముఖ తారలు క్యాథరిన్ ట్రెసా, అంజలి, నిధి అగర్వాల్ లు కిక్కేంచే డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నారు. ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి తన అద్భుతమైన పాటలతో అందరిని అలరించారు.
బిగ్ బాస్ హౌస్ లో రీ-యూనియన్ రెట్రో పార్టీలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హంగామా
ఇక వీరితో పాటుగా హీరో శ్రీకాంత్, హీరోయిన్ రాశి ఖన్నా, దర్శకుడు మారుతీ, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి టాప్ 5 లో ఎలిమినేట్ అయిన ముగ్గురిని తీసుకురావడం జరిగింది. వీరితో పాటు ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిథి గా విచ్చేసి నిన్నటి ఫైనల్ ఎపిసోడ్ కి మెగా టచ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆఖరులో రాహుల్ సిప్లిగంజ్ (rahul sipligunj) కి బిగ్ బాస్ టైటిల్ కి ప్రధానం చేసింది కూడా మెగాస్టారే.
ఇదిలావుండగా అసలు ఈ సీజన్ మొదలై దాదాపు 60 రోజులు గడిచేవరకు కూడా రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ టైటిల్ (title) గెలుస్తాడు అని ఎవ్వరూ ఊహించలేదు. అసలు తొలి రోజుల్లో బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కూడా చేయడానికి బద్ధకించేవాడు. అయితే మొదటి నుండి కూడా తన మనసులో ఏది అనిపిస్తే అది చెప్పేసేవాడు. దాని వల్ల తనకి చాలాసార్లు తోటి ఇంటిసభ్యులతో విబేధాలు కూడా వచ్చాయి.
ఈ తరుణంలో ఎప్పుడైతే, ఇంటిసభ్యులని కలవడానికి వారి కుటుంబసభ్యులు రావడం జరిగిందో.. అప్పటి నుండి అతనిలో టాస్కులు ఎలాగైనా ఆడాలి అని ఒక పట్టుదల పెరిగింది. దానికి తోడుగా రాహుల్ తల్లి సుధారాణి గారు ఇచ్చిన ప్రోత్సాహం కూడా అతనిలో చాలా ధైర్యాన్నిచ్చింది.
బిగ్ బాస్ హౌస్ లో తమ ప్రయాణం చూసి ఎమోషనల్ అవుతున్న కంటెస్టెంట్స్
ఇలా అప్పటివరకు కూడా బిగ్ బాస్ (bigg boss) హౌస్ లో ఒక బద్దకస్తుడిలా ఉన్న రాహుల్ సిప్లిగంజ్… క్రమక్రమంగా యాక్టివ్ అవుతూ ఈ సీజన్ లో ఫైనల్స్ కి అర్హత సాధించిన ఘనతతో పాటుగా ఫైనల్ లో హాట్ ఫెవరెట్ కంటెస్టెంట్ అయిన శ్రీముఖిని ఓడించి టైటిల్ ని గెలిచేశాడు. అయితే ఇతనికి ఇంతలా ప్రజల నుండి మద్దతు రావడానికి కారణాలు ఏంటంటే –
* తన కుటుంబ నేపధ్యం గురించి చెప్పుకోవడానికి రాహుల్ ఎక్కడా మొహమాట పడలేదు.
* ఈ ప్రైజ్ మనీతో తన తల్లిదండ్రులకు ఒక సొంత ఇల్లు కొన్నివ్వాలి, ఒక మంచి హెయిర్ సెలూన్ కూడా నెలకొల్పాలి అంటూ చెప్పడం..
* టాస్కులు ఆడినా, ఆడకపోయినా నిజాయతీగా ఉండడం.. మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, సందర్భానుసారంగా పాటలు పాడుతూ ఆకట్టుకోవడం..
ఈ పైన చెప్పిన మూడు కారణాలతో ప్రజలు బాగా కనెక్ట్ అవ్వడం & అదే సమయంలో తన వృత్తిని ఎక్కడా కూడా తక్కువగా చూడకుండా… ఆ విషయాలని చెబుతూ ఇంటిసభ్యులతో (ఒక్క శ్రీముఖితో తప్ప) కలిసి మెలిసి ఉండడం బాగా కలిసొచ్చింది రాహుల్ సిప్లిగంజ్ కి…
వీటికి తోడు అతను హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ లో పుట్టి పెరగడం & మంచి మాస్ ఫాలోయింగ్ కూడా ఉండడంతో.. ఈ గల్లీ పోరడు ఎంతోమంది గల్లీలల్లో ఉండే వారి హృదయాలని గెల్చుకోవడం జరిగింది. ఇక అతను టైటిల్ గెలిచావు అని చెప్పిన తరువాత ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తన కృతజ్ఞతలు తెలపడంతో పాటుగా తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి కూడా ధన్యవాదాలు తెలపడం జరిగింది.
మొత్తానికి నాగార్జున ఈ సీజన్ తొలిరోజు బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే సమయంలో రాహుల్ సిప్లిగంజ్ ని ‘పాట’గా అభివర్ణించి పంపితే.. చివరికి ఆ పాట ఎంతోమంది హృదయాలని గెల్చుకుని విజేతగా (winner) నిలిచి బిగ్ బాస్ టైటిల్ సొంతం చేసుకుంది.
బాబా భాస్కర్ సూపర్ స్టార్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్.. మరి, శ్రీముఖి ఏంటి?