
(Interesting news on Ram charan, Jr NTR and SS Rajamouli’s RRR Movie Title)
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న రామ్ చరణ్ – ఎన్టీఆర్ – రాజమౌళిల ‘RRR’ చిత్రం గురించిన ఏ చిన్న విషయమైనా కూడా ఎంతో ఆసక్తిని రేపుతుంది. కారణం బాహుబలి సిరీస్ తరువాత.. రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడం.. అదే సమయంలో ఈ చిత్రంలో ఇద్దరు పెద్ద హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా చేస్తుండడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించి గతంలో ఓ వర్కింగ్ టైటిల్‌ను అనుకున్నారు. అదే తర్వాత ‘RRR’గా పేర్కొనబడింది. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి పేరులోని తొలి అక్షరంతో పాటు.. హీరో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని ఈ టైటిల్‌ను నిర్దేశించారు. అలాగే ఈ మూడు అక్షరాలకు కొనసాగింపుగా ఎలాంటి ఫుల్ ఫార్మ్ పెడితే బాగుంటుందో తెలియజేయమని.. ప్రేక్షకులకు కూడా ఓ అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఎందరో సినీ అభిమానులు.. ఈ ‘RRR’ టైటిల్‌కి సంబంధించి ఫుల్ ఫార్మ్స్‌ని పంపించడం జరిగింది.
రామ్‌చరణ్ – ఉపాసనల.. ప్రేమ బంధం వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకుందామా?
తాజాగా అందులో నుండి ఒక టైటిల్‌ని చిత్ర బృందం ఎంపిక చేసినట్లు సమాచారం. ‘రామ రౌద్ర రుషితం’ అనే టైటిల్‌ని ‘ఆర్ ఆర్ ఆర్’ (RRR) అనే అబ్రివేషన్‌కు కొనసాగింపుగా ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది! అయితే మిగతా భాషల్లో మాత్రం.. ఈ చిత్రానికి వేరే టైటిల్‌ని పెట్టే యోచనలో ఉన్నారట. బహుశా ‘Rise Revolt Revenge’ అనే టైటిల్ పెట్టే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుండగా.. రాజమౌళి & కో నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.
ఇక ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ విషయానికి వస్తే … RRR ప్రొడక్షన్ పనులు హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయి. అక్కడే జూనియర్ ఎన్టీఆర్ పై కూడా.. కొన్ని భారీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం.
ఈ సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలు కూడా.. ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ షెడ్యూల్‌లో ప్రస్తుతం రామ్ చరణ్ పాల్గొనడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిని (Megastar Chiranjeevi) హీరోగా పెట్టి తీసిన సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy) చిత్ర విడుదల ఉండడంతో.. రాజమౌళి అనుమతితో ఈ షెడ్యూల్ నుండి తప్పుకున్నాడు. త్వరలోనే మొదలయ్యే షెడ్యూల్‌లో రామ్ చరణ్ పాల్గొనబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా పాటల రికార్డింగ్ పూర్తయిందట. ఈ సమాచారాన్ని ఎం.ఎం కీరవాణి ఇప్పటికే ప్రేక్షకులకి తన ట్విట్టర్ ద్వారా తెలపారు. ప్రస్తుతం వాటిని చిత్రీకరించడం మాత్రమే మిగిలి ఉంది. అలాగే ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్.. రామ్‌చరణ్ సరసన నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటీమణి అనుకోని పరిస్థితుల కారణంగా చిత్రం నుండి తప్పుకుంది.
RRR టైటిల్ వేట.. ఆసక్తికరమైన ఎక్స్‌ప్యాన్షన్స్‌తో సినీ అభిమానుల ట్వీట్స్..!
ఇక RRR చిత్ర యూనిట్ జులై 30, 2020 తారీఖుని.. విడుదల తేదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కనుక ఈ తేదికల్లా.. ఎలాగైనా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకైతే అందుకనుగుణంగానే చిత్రీకరణ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే.. ప్రేక్షకులు అనుకున్న సమయానికే సినిమా విడుదలవుతుంది.
ఇక ఈ చిత్రంలోని రామ్ చరణ్ & ఎన్టీఆర్ లుక్స్ విడుదల కోసం.. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఈ RRR టైటిల్ విషయం తెరపైకి రావడం.. ఒకరకంగా అభిమానులకు దసరా పండుగ కానుకే అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి రాజమౌళి నుండి అధికారిక ప్రకటన వెలువడితే.. ఇక ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే ఉండవు.
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌కు గాయాలు.. RRR షూటింగ్ వాయిదా..!
Featured Image: Fan Made Poster