ADVERTISEMENT
home / Bollywood
కొనసాగుతున్న RRR టైటిల్ వేట.. ఆసక్తికరమైన ఎక్స్‌ప్యాన్షన్స్‌తో సినీ అభిమానుల ట్వీట్స్..!

కొనసాగుతున్న RRR టైటిల్ వేట.. ఆసక్తికరమైన ఎక్స్‌ప్యాన్షన్స్‌తో సినీ అభిమానుల ట్వీట్స్..!

బాహుబలి (Baahubali) చిత్రంతో భారతీయ చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతులను ఖండాంతరాలు దాటించిన దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli). అంతటి గొప్ప దర్శకుడి నుంచి ఏదైనా ఒక చిత్రం వస్తుందంటే దానిపై భారీ అంచనాలు ఉండడం సహజమే. అలాంటిది ఆ చిత్రంలో ఇద్దరు అగ్ర హీరోలు నటిస్తే ?? ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి క్రేజ్‌ని సొంతం చేసుకున్న చిత్రం #RRR.

అయితే ఈ సినిమా ప్రారంభమయ్యాక..  ప్రాజెక్టుకి సంబంధించి ఏ వార్త కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు జక్కన్న. ఆ తర్వాత మార్చి నెలలో హీరోలు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్‌లతో (Ram Charan) కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ.. సినిమాకు సంబంధించిన అన్ని వివరాలనూ వెల్లడించారు రాజమౌళి.

ఆ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా పెట్టిన #RRR నే ప్రధాన టైటిల్‌గా నిర్ణయించామని తెలిపారు. ఈ క్రమంలో #RRR టైటిల్‌ను విశదీకరించే అవకాశం (Title Expansion) ప్రేక్షకులకు కల్పిస్తున్నామని.. మంచి టైటిల్స్‌‌ను ప్రేక్షకులు సూచించవచ్చని ప్రకటించారు. 

 

ADVERTISEMENT

రాజమౌళి ఆహ్వానం మేరకు సినీ ప్రేమికుల నుండి.. ఈ టైటిల్‌కి వచ్చిన ఎక్స్‌ప్యాన్షన్స్‌కు చక్కని స్పందన లభిస్తోంది. ఇది చిత్రసీమలో చక్కర్లు కొడుతున్న వార్తో లేక విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారమో అనుకుంటే పొరపడినట్లే.

ఎందుకంటే #RRR టీమ్ తమ అధికారిక ట్విట్టర్ పేజీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు.. వారికి అందిన ఎక్స్‌ప్యాన్షన్స్‌లో ఆసక్తికరంగా ఉన్న కొన్నింటిని ట్విట్టర్ వేదికగా అందరితోనూ పంచుకున్నారు కూడా. వాటిని పంచుకుంటూనే ప్రేక్షకులను మరిన్ని ఆసక్తికరమైన ఎక్స్ ప్యాన్షన్స్ పంపించాలంటూ కోరారు. తద్వారా అభిమానుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.

#RRR టీమ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన ఎక్స్‌ప్యాన్షన్స్‌ని మనమూ చూద్దామా..

REBEL REVOLT REPEAT

ADVERTISEMENT

RISE ROAR REVOLT

RISE RETALIATE REVOLUTION

RAGHUPATI RAGHAVA RAJARAM

REVOLUTION OF RAMA RAJU

ADVERTISEMENT

RECON OF RR

RANAM ROWDRAM RAJASAM

RUDRA RAGAHAV RATHAM

राग रंग रण

ADVERTISEMENT

रक्त राम राज्य

रूद्र रण रूपम

రాముడు రుద్రుడు రణరంగం

రామ రాజ్య రక్షక

ADVERTISEMENT

రాజ్యం రణం రక్తం

రణమున రగిలిన రుధిరం

కేవలం తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాదు.. ఉర్దూ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ అనేక ఎక్స్‌ప్యాన్షన్స్‌ని సినీ అభిమానులు పంపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాము పంపిన ఎక్స్‌ప్యాన్షన్ సినిమా టైటిల్‌గా నిలవనుందనే ఆశ, ఆత్రంతో మరింత మంది అభిమానులు దీనికి టైటిల్స్ పంపడంలో ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. సో.. మీరూ ఇందులో భాగం కావాలనుకుంటే మీ క్రియేటివిటీకి కాస్త పదును పెట్టి ఆసక్తికరమైన ఎక్స్‌ప్యాన్షన్ రాసి #RRR టీంకి పంపించండి.

 

ADVERTISEMENT

ఇక #RRR షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ త్వరలోనే మరో షెడ్యూల్‌ను మొదలుపెట్టనుంది. రాజమౌళి ప్రెస్ మీట్ రోజున చెప్పినట్టుగానే వచ్చే ఏడాది జులై 20న ఈ చిత్రాన్ని విడుదలచేసేందుకు యూనిట్ మొత్తం శక్తి వంచన లేకుండా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

అయితే ఈ చిత్రంలో నటించేందుకు సైన్ చేసిన హాలీవుడ్ నటీమణి డైసీ ఎడ్గర్ జోన్స్ (Daisy Edgar Jones) పలు కారణాల రీత్యా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం విదితమే. కనుక ఆమె స్థానంలో ఇప్పుడు మరొక హీరోయిన్ కోసం వెతుకుతోందీ టీం. త్వరలోనే ఆ ఎంపికను కూడా పూర్తి చేసి చిత్ర షూటింగ్‌ని అనుకున్న సమయానికి పూర్తి చేయాలని భావిస్తోంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించేందుకు అలియా భట్‌ని (Alia Bhatt)  ఎంపిక చేసిన విషయం విదితమే.

ఇవి కూడా చదవండి

ADVERTISEMENT

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’.. ట్రైలర్ టాక్ ప్రత్యేకతలివే..!

సల్మాన్ ఖాన్ కోసం.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక నిర్ణయం..!

మెగాస్టార్ చిరంజీవి సరసన.. మరో హీరోయిన్ వేటలో సైరా టీం!

02 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT