Beauty

రిప‌బ్లిక్ డే స్పెష‌ల్.. ట్రై క‌ల‌ర్ నెయిల్ ఆర్ట్స్ మీరూ ప్ర‌య‌త్నించండి..!

Lakshmi Sudha  |  Jan 21, 2019
రిప‌బ్లిక్ డే స్పెష‌ల్.. ట్రై క‌ల‌ర్ నెయిల్ ఆర్ట్స్ మీరూ ప్ర‌య‌త్నించండి..!

ఓ భారతీయురాలిగా నా దేశాన్ని నేను ఎంత‌గానో ప్రేమిస్తాను. ఈ ప్రపంచానికి ఎన్నో అందించిన నా దేశం పట్ల గర్వంతో ఉప్పొంగుతాను. సున్నా విలువ ప్రపంచానికి చెప్పింది భారత దేశం. చదరంగాన్ని ఇతర దేశాలకు నేర్పింది మన దేశం. ప్రపంచం మెచ్చుకోదగ్గ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను అందించింది. అవును భారతీయులు అందమైనవారు.. తెలివైనవారు కూడా. ఎలానూ అందం ప్ర‌స్తావ‌న వ‌చ్చింది క‌దా.. ఈ రిప‌బ్లిక్ డే కోసం నా దగ్గర ఓ మంచి ఐడియా ఉంది. కాషాయం, తెలుపు, పచ్చ రంగులతో నెయిల్ ఆర్ట్ వేసుకోవ‌డం ద్వారా నా దేశభక్తిని అంద‌రికీ తెలియ‌జేయాల‌ని అనుకుంటున్నాను. దాని కోసం నా దగ్గర కొన్ని డిజైన్లు కూడా ఉన్నాయి.

సరిహద్దుల్లో తమ ప్రాణాలు ఫణంగా పెట్టి మ‌రీ మనల్ని రాత్రింబ‌వ‌ళ్లు రక్షిస్తున్న జవాన్ల త్యాగానికి గుర్తుగా నెయిల్ ఆర్ట్ ఇలా వేసుకుంటే ఎంత బాగుంటుందో క‌దూ!.

ఈ నెయిల్ ఆర్ట్ చూడండి.. త్రివర్ణ పతాకాన్ని గోళ్ల‌పై ఎంత అందంగా తీర్చిదిద్దారో..! ఈ గ‌ణతంత్ర దినోత్స‌వానికి నేను ఈ నెయిల్ ఆర్ట్ వేసుకోవాలనుకొంటున్నా. 

జాతీయ పుష్పం, జాతీయ పక్షి, రూపాయి గుర్తు, ఇవన్నీ మన దేశానికే ఎంతో ప్రత్యేకం. మరి వాటినే నెయిల్ ఆర్ట్‌గా వేసుకొంటే ఎలా ఉంటుంది? మీరే చూసి చెప్పండి. 

రిపబ్లిక్ డే నెయిల్ ఆర్ట్ సింపుల్‌గా ఉండాలనుకొంటే ఇలా నెయిల్ పెయింట్ వేసుకున్నా సరిపోతుంది. 

ఈ నెయిల్ ఆర్ట్ కూడా చాలా చూడముచ్చటగా ఉంది కదా..

చూశారుగా.. Republic day సంద‌ర్భంగా ఎలాంటి నెయిల్ ఆర్ట్స్ (Nail arts) వేసుకోవ‌చ్చో! వీటిలో నుంచి మీకు న‌చ్చిన డిజైన్ల‌ను సెల‌క్ట్ చేసుకోండి.. మీ అంద‌మైన గోళ్ల‌పై వేసుకోవ‌డం ద్వారా మీ దేశ‌భ‌క్తిని అంద‌రికీ చాటి చెప్పండి. మ‌రి, గణతంత్ర దినోత్సవానికి పర్ఫెక్ట్ నెయిల్ ఆర్ట్ వేసుకోవడానికి.. దానికి తగిన నెయిల్ పాలిష్ కూడా ఉండాలి కదా.. అందుకే ఈ నెయిల్ పాలిష్‌లను ఓ సారి ప్ర‌య‌త్నించి చూడండి

1. కలర్ బార్ లక్స్ నెయిల్ లాక్కర్-టాంజెరిన్ మోజిటో 095 (రూ. 200)

2. నైకా మాట్ట్ నెయిల్ లాక్కర్-వైట్ చాక్లెట్ గానాచ్ 07(రూ. 199)

3. కైనెటిక్ సోలార్ జెల్ నెయిల్ పాలిష్-#193 Oops గ్రీన్(రూ. 190) 

ఇవి కూడా చ‌ద‌వండి

టీనేజ్ అమ్మాయిలను ఫిదా చేస్తున్నా.. దీపిక స్టైల్ “స్మోకీ ఐ మేకప్”

ఈతరం అమ్మాయిలకు ఉప‌క‌రించే.. బామ్మగారి సౌందర్య చిట్కాలు..

అదిరేటి లుక్ కావాలంటే.. ఆరెంజ్ బ్లష్ అప్లై చేయాల్సిందే..

Featured Image: Instagram

Read More From Beauty