Bigg Boss

శ్రీముఖికి “బిగ్ బాస్ టైటిల్” తృటిలో ఎందుకు చేజారిపోయింది..? బలమైన కారణాలు ఇవే ..!

Sandeep Thatla  |  Nov 4, 2019
శ్రీముఖికి “బిగ్ బాస్ టైటిల్” తృటిలో ఎందుకు చేజారిపోయింది..? బలమైన కారణాలు ఇవే ..!

బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) సీజన్ 3లో దాదాపు చాలామంది శ్రీముఖిని (Sreemukhi) టైటిల్ (Bigg Boss Title) ఫేవరెట్‌గా అభివర్ణించారు. అదే సమయంలో ఆమె తోటి కంటెస్టెంట్స్‌తో కూడా చాలా కలిసిపోయి ఉండడం.. అలాగే వారికి ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా ముందుండి చేయడంతో.. ఆమె తన బిగ్ బాస్ ప్రయాణాన్ని కొనసాగించింది.

అలాగే బిగ్ బాస్ షోకి వెళ్లక ముందే సింగర్ రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి మంచి స్నేహితులు కావడం విశేషం. కాని బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళాక మాత్రం.. వారు దాదాపు సీజన్ మొత్తం ప్రత్యర్ధులుగానే ఉన్నారు. ఇంటిలో అందరితో బాగున్నప్పటికి.. ఒక్క రాహుల్ సిప్లిగంజ్‌తో మాత్రం ఆమె సఖ్యతగా ఉండలేకపోయింది. ఆఖరిలో మాత్రం వీరిద్దరూ మనసులోని కోపతాపాలు మర్చిపోయి.. మామూలుగా ఉండేందుకు ప్రయత్నించారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో పైన సామాన్య ప్రజలు ఇచ్చిన రివ్యూ ఏంటంటే

అలాగే కాకతాళీయంగా ఈ ఇద్దరు సభ్యులు టాప్ 2 కంటస్టంట్స్‌గా నిలవడం గమనార్హం. అయితే వీరిద్దరిలో రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) బిగ్ బాస్ టైటిల్ విజేతగా నిలవడం శ్రీముఖిని ఎక్కువగానే బాధపెట్టి ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే అసలు సీజన్ మధ్యలోకి వచ్చేసరికి.. కచ్చితంగా శ్రీముఖి బిగ్ బాస్ టైటిల్ గెలుస్తుందని అందరూ నమ్మడం.. అలాగే దాదాపు ఓటింగ్ శాతం కూడా ఆమెకి పెరుగుతూనే ఉండడంతో అందరూ ఆమె విజేతగా నిలుస్తుందని అనుకున్నారు.

అయితే ఇదే తరుణంలో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన వారు చేసిన కొన్ని కామెంట్స్.. ఆమె టైటిల్ రేసులో వెనక్కి వెళ్లేలా చేశాయన్నది ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం.

ఇంతకి ఆ కామెంట్స్ ఏంటంటే –

ఒక సోషల్ మీడియా ఛానెల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ‌లో అప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటస్టెంట్ హిమజ మాట్లాడుతూ.. “బిగ్ బాస్ టీం వారు శ్రీముఖికి మద్దతు ఇస్తున్నారు. అదే సమయంలో బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల విషయంలో కూడా.. శ్రీముఖి కెమెరాల వద్దకు వెళ్లి మాట్లాడడం వంటివి చేస్తోంది. ఇవి కూడా కొన్ని అనుమానాలకు తావు ఇస్తున్నాయి” అని చెప్పడం జరిగింది. అలాగే బిగ్ బాస్ దర్శకుల్లో ఇద్దరు తన స్నేహితులని శ్రీముఖి ఇంట్లో వాళ్లందరికీ చెప్పిందని హిమజ వెల్లడించింది. ఇదే శ్రీముఖి ప్రత్యర్థులకు  వరంగా మారింది. 

ఈ కామెంట్స్ తరువాత బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటస్టెంట్స్‌ని కలవడానికి వారి కుటుంబసభ్యులు రావడం జరిగింది. అలా శ్రీముఖి తల్లి లత వచ్చిన సమయంలో.. ఆమె రాహుల్ సిప్లిగంజ్‌తో మాట్లాడిన విధానం.. అలాగే రాహుల్ తల్లి సుధారాణి వచ్చిన సమయంలో తను శ్రీముఖితో మాట్లాడిన విధానం కథను మార్చేశాయి. ఈ ఇద్దరి కంటస్టెంట్స్ పై బయట  ఆడియన్స్‌కు ఉన్న అభిప్రాయంలో కూడా బాగా మార్పు వచ్చింది. ఒకరకంగా ఈ ఎపిసోడ్ తరువాతే రాహుల్ సిప్లిగంజ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ ఎపిసోడ్ “బిగ్ బాస్ తెలుగు సీజన్ 3” విజేత ఎవరని ఆలోచిస్తున్న ప్రేక్షకులను బాగా ప్రభావితం చేసిందనే అర్ధమవుతుంది.

గల్లీ పోరడు గుండెలని గెలిచాడు – బిగ్ బాస్ తెలుగు 3 విజేత రాహుల్ సిప్లిగంజ్

అలాగే ఇదే విషయానికి సంబంధించి ఆడియన్స్‌లో బలంగా వినిపించిన మరో కోణం ఏంటంటే – ఈ ప్రైజ్ మనీ‌తో తన తల్లిదండ్రులకి ఒక ఇల్లు కొనివ్వాలి అని అనుకుంటున్నానని.. అలాగే ఒక సెలూన్ కూడా పెట్టాలనుకుంటున్నానని రాహుల్ చెప్పడం వల్ల కూడా అతనికి ఒకరకంగా మంచి జరిగింది. “ఈ డబ్బు గెలిస్తే, కచ్చితంగా అది రాహుల్‌కి పనికొస్తుంది.. శ్రీముఖి కెరీర్ పరంగా కూడా మంచి స్థాయిలోనే ఉంది కాబట్టి.. ఆ డబ్బు  ఆమెకు పెద్ద లెక్క కాదు.. అంటూ” ఆడియన్స్ ఈ ఇద్దరినీ పోల్చి చూడడం కూడా మొదలుపెట్టారు.

ఇక ఆఖరి వారం ముందు జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఒక వీడియో చూపారు. అందులో శ్రీముఖి చేసిన కామెంట్స్ కొన్ని తీవ్ర దుమారాన్నే రేపాయి. ఆ కామెంట్స్‌లో భాగంగా బిగ్ బాస్ యాజమాన్యాన్ని తన గొడవలోకి లాగడం కూడా ఆమె విజయాన్ని ప్రభావితం చేశాయనే చెప్పాలి. అంతకుముందు రాహుల్‌ని బిగ్ బాస్ షోకి నామినేట్ చేసినట్లుగా శ్రీముఖి ప్రచారం చేస్తుందని.. ఆయన చెప్పడం కూడా శ్రీముఖి ఓట్ల శాతాన్ని దెబ్బతీసింది. తర్వాత అది నిజం కాదని వీడియోల్లో తేలినా.. చాలామంది అదే వాస్తవం అని భావించారు.

ఇవ్వన్ని కాకుండా “తనకి స్ట్రాటజీ అంటూ ఏమి లేదని.. తను ఏమైనా తప్పు చేస్తే బయటకి వెళ్తానని.. లేకపోతే ఇంటిలో ఉంటానని.. అలా ఉంటే టైటిల్ గెలుస్తానని”.. అలాగే తనకున్న నమ్మకాన్ని ఎప్పుడు అతివిశ్వాసంగా మార్చుకోలేదని రాహుల్ సిప్లిగంజ్ నిర్మొహమాటంగా చెప్పడం వల్లే తను విజేతగా నిలిచాడని చెప్పవచ్చు.

కానీ శ్రీముఖి మాత్రం టైటిల్ గెలవడానికి చేసిన ప్రయత్నాలు అతి విశ్వాసంగా కొందరికి అనిపించాయి. అవి ఒక పరిధి దాటి వెళ్లడమే.. ఆమెకి ఫైనల్‌లో ఎదురుదెబ్బ తగలడానికి మరో కారణమయ్యాయని చెప్పవచ్చు. 

ఏదేమైనా.. ఫైనల్‌లో మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టుగా శ్రీముఖి టైటిల్ గెలవకపోయినా.. ఎంతోమంది ప్రేక్షకుల ప్రేమని గెల్చుకుందని చెప్పవచ్చు. ఈ బిగ్ బాస్ తరువాత కూడా శ్రీముఖి తన కెరీర్‌లో మునుపటిలా దూసుకుపోవాలని మనసారా కోరుకుందాం.

బిగ్ బాస్ హౌస్ లో రీ-యూనియన్ రెట్రో పార్టీలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హంగామా

 

Read More From Bigg Boss