బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో పైన సామాన్య ప్రజలు ఇచ్చిన రివ్యూ ఏంటంటే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 షో పైన సామాన్య ప్రజలు ఇచ్చిన రివ్యూ ఏంటంటే

సాధారణంగా మన జనసామాన్యంలో మన పక్కింటిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం చాలామందికే ఉంటుంది. అలా ప్రజల్లో ఉన్న ఆసక్తిని మరింత పెంచేందుకు ఆకర్షించేందుకు మరింత ఆసక్తిగా రూపొందించిన కాన్సెప్ట్ 'బిగ్ బాస్'. అసలు ఒకరితో మరొకరికి ఎటువంటి సంబంధం లేని కొంతమందిని.. బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఒక చోట ఉంచడమే ఈ గేమ్ షో జరిగే తీరు. 

గల్లీ పోరడు గుండెలని గెలిచాడు - బిగ్ బాస్ తెలుగు 3 విజేత రాహుల్ సిప్లిగంజ్

అయితే బిగ్ బాస్ హౌస్ అనే ఇంటిలో బయట ప్రపంచం నుండి ఎటువంటి సమాచారం లేదా ఇంకే ఇతర సంబంధాలు లేకుండా ఉంచుతూ ఆ ఇంటిలో ఉన్న సభ్యుల మధ్య పోటీ రగల్చడానికి వివిధరకాల టాస్కులు ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ గేమ్ కొనసాగే నేపథ్యంలో వారికి బిగ్ బాస్ ఇచ్చి పరిమితమైన వనరులతో... పక్కన ఉన్న వారితో వాటిని పంచుకుంటూ ఎలా ఉంటారు అనేది ఈ షో చూస్తే తెలుస్తుంది.

అయితే ఈ గేమ్ షో లో గెలవాలంటే, పక్కన ఉన్నవారితో సర్దుకుపోవడం వచ్చి ఉండాలి. అదే సమయంలో ఎదుటి వారు కావాలని రెచ్చగొడుతున్నా కూడా సహనం కోల్పోకుండా ఉండగలగాలి. ఇలా పలురకాల మానసిక ఒత్తిళ్లు, శారీరక ఇబ్బందులు జయిస్తేనే ఈ బిగ్ బాస్ టైటిల్ ని గెల్చుకుంటారు.

మన దేశంలో ఈ బిగ్ బాస్ (bigg boss) షో మొదలయ్యి 13 సంవత్సరాలు అవుతున్నా తెలుగు భాషలో మాత్రం నిన్న పూర్తైన ఎపిసోడ్ మూడో సీజన్ మాత్రమే. అలా మన తెలుగులో బిగ్ బాస్ మొదలై ఈ ఏడాదికి మూడు సంవత్సరాలు గడిచిందన్నమాట. ఇదిలావుండగా నిన్న ముగిసిన సీజన్ ని గత రెండు సీజన్ల తో పోలిస్తే చాలా విజయవంతమైన సీజన్ గా పేర్కొనవచ్చు.

అందుకు కారణాలు ఏంటంటే - ఈ బిగ్ బాస్ 3 (bigg boss 3) లో ఆఖరి వరకు ఎవరు గెలుస్తారు అనే దాని పైన ఒక వంద శాతం అంచనా లేదు. గత రెండు సీజన్స్ లో అలా కాదు, సదరు సీజన్ ముగియ్యడానికి రెండు నుండి మూడు వారాల ముందే ఎవరు బిగ్ బాస్ టైటిల్ గెలవబోతున్నారు అన్న దాని పైన ఒక అంచనా వచ్చేసింది.

ఇక ఈ సీజన్ ప్రత్యేకతల విషయానికి వస్తే,

* బుల్లితెర పైన షోలకి వ్యాఖ్యతగా వ్యవహరించిన అనుభవం ఉన్న నాగార్జున ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా ఉండడం.

* తొలిసారిగా తెలుగులో ఒక ట్రాన్స్ జెండర్ ని కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం జరిగింది.

* మొదటిసారి భార్యాభర్తలు అయిన వితిక - వరుణ్ సందేశ్ లని జంటగా ఈ షోలో కంటెస్టెంట్స్ గా వెళ్లారు.

* సీజన్ మొత్తానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే, ఒక్క వారానికి మాత్రం నాగార్జున అందుబాటులో లేని కారణంగా నటి రమ్యకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించడం జరిగింది. బిగ్ బాస్ షో చరిత్రలో ఏ ఇతర భాషలో కూడా ఒక మహిళా వ్యాఖ్యాతగా లేకపోవడంతో ఈ అరుదైన ఘనత బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి దక్కింది అని చెప్పాలి.

బిగ్ బాస్ హౌస్ లో రీ-యూనియన్ రెట్రో పార్టీలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హంగామా

ఈ నాలుగు ప్రత్యేకతలు బిగ్ బాస్ తెలుగు (bigg boss telugu) సీజన్ 3లో ఉండగా.. గత రెండు సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా పరిణితితో వ్యవహరించారు అనే చెప్పాలి. అలాగే గత సీజన్ లో ఇంటిలో సభ్యుల పేర్లని ఉపయోగించి సోషల్ మీడియాలో చేసిన వికృత చేష్టలు ఈ సీజన్ లో కనిపించలేదు.

ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ బ్యాగ్రౌండ్ ఒకసారి పరిశీలిస్తే, ఒక న్యూస్ రిపోర్టర్, న్యూస్ రీడర్, సినిమా హీరో, డ్యాన్స్ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా సెలబ్రిటీ, ట్రాన్స్ జెండర్, నేపథ్య గాయకుడు, ఇద్దరు టెలివిజన్ యాంకర్లు, ఒక హీరో, ఇద్దరు సీరియల్ హీరోలు, ఒక కమెడియన్, ఇద్దరు సీరియల్ హీరోయిన్స్ & ఇద్దరు సినిమా హీరోయిన్స్ పాల్గొనడం జరిగింది.

ఈ కంటెస్టెంట్స్ ని ఒకసారి పరిశీలిస్తే, ఎక్కువమంది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచే ఉన్నారు అని అర్ధమవుతుంది. గత సీజన్స్ లో కూడా ఇలాంటి ఫార్మేట్ లోనే కంటెస్టెంట్స్ ఎంపిక జరిగింది. అయితే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో సినిమాలలో చూసే ఒక చక్కటి ఫాంటసీ లవ్ స్టోరీ కూడా చూడడానికి సాధ్యమైంది. అలాగే ఇద్దరు కంటెస్టెంట్స్ బయట స్నేహితులైనప్పటికి.. ఈ ఇంటిలోకి వచ్చాక బద్ద శత్రువులుగా మారడం జరిగింది, కాకతాళీయంగా వారిద్దరే టైటిల్ పోరులో చివరికి మిగిలిన ఇద్దరు కావడం విశేషం.

ఇవ్వన్ని పక్కకి పెడితే, ఈ సీజన్ లో అభ్యంతరకరమైన, అశ్లీలమైన అంశాలు ఏవి లేకుండా దాదాపు ఇంటిల్లిపాది కూడా చూసిన మంచి సీజన్ గా ఈ బిగ్ బాస్ తెలుగు 3 నిలిచింది అని చెప్పవచ్చు. ఇక ఈ సీజన్ ముగియడం కూడా ఒక మెగా టచ్ తో ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా విచ్చేసి ఈ సీజన్ క్లైమాక్స్ కి ఓ మంచి గ్రాండ్ టచ్ ఇచ్చారు.

ఆఖరుగా 105 రోజుల పాటు 17మంది కంటెస్టెంట్స్ తో సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 (bigg boss telugu 3 review) ఎలా ఉంది అని రివ్యూ (review) చెప్పమంటే - "తెలుగులో వచ్చిన బిగ్ బాస్ షోలలో ఇదే బెస్ట్" అని ప్రేక్షకులు చెప్పడం విశేషం. 

బిగ్ బాస్ హౌస్ లో తమ ప్రయాణం చూసి ఎమోషనల్ అవుతున్న కంటెస్టెంట్స్