Celebrity Life

‘రష్మిక’ అవకాశాలు వదులుకోవడానికి కారణం.. రెమ్యునరేషనా…?

Babu Koilada  |  Dec 9, 2019
‘రష్మిక’ అవకాశాలు వదులుకోవడానికి కారణం.. రెమ్యునరేషనా…?

రష్మిక మందాన (Rashmika Mandanna).. ‘గీత గోవిందం’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి. వరుసగా పెద్ద పెద్ద ఆఫర్లను చేజిక్కించుకుంటున్న ఈ కథానాయిక.. ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటించడానికి అవకాశమొచ్చినా.. తిరస్కరించి మళ్లీ వార్తలలో నిలిచింది. అయితే ఆమె ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం.. తను అనుకున్నంత రెమ్యునరేషన్‌ని నిర్మాతలు ఇవ్వకపోవడమే అని వార్తలొచ్చాయి. ఈ విషయంపై ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో పదే పదే గాసిప్స్ వస్తుండడంతో ఎట్టకేలకు.. ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చింది రష్మిక.

మహేష్ బాబు vs అక్కినేని అఖిల్.. ఈ ఇద్దరిలో రష్మిక ఓటు ఎవరికి?

“జెర్సీ నిజంగానే మంచి సినిమా. ఆ సినిమాలో ఆఫర్ రావడం నా లక్. అయితే ఆ చిత్రంలోని పాత్రకు చాలా షేడ్స్ ఉంటాయి. ఆ పాత్ర చేయడం చాలా కష్టం. బాగా ఇన్వాల్వ్ అయ్యి నటించాలి. అందుకే ఆ పాత్రకు న్యాయం చేయలేనని భావించి అవకాశాన్ని వదులుకున్నాను. అంతే కానీ.. రెమ్యూనరేషన్ ఇక్కడ మేటర్ కాదు. కొన్ని విషయాలను మనం డబ్బుతో ముడిపెట్టలేం. సినిమా అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు” అని వివరణ ఇచ్చింది రష్మిక. రష్మిక ప్రస్తుతం భీష్మ, సరిలేరు నీకెవ్వరు చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ముద్దుకు… కథకు సంబంధముంది: ‘డియర్ కామ్రేడ్’ కథానాయిక రష్మిక

నాని, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా నటించిన ‘జెర్సీ’ చిత్రం తెలుగులో హిట్ సినిమాగా నిలిచింది. ఇదే చిత్రం హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొలుత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించాలని ముందుకు వచ్చినా.. తర్వాత ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. ఈ రీమేక్ చిత్రానికి కూడా ‘జెర్సీ’ ఒరిజినల్ దర్శకుడు గౌతమ్ దర్శకత్వం వహించడం విశేషం. అలాగే ఇందులో క్రికెటర్‌గా నటిస్తున్న షాహిద్ కపూర్ కోచ్ పాత్రలో.. ఆయన తండ్రి పంకజ్ కపూర్ నటించడం గమనార్హం. ఇదే పాత్రను తెలుగులో సత్యరాజ్ పోషించారు. 

 

ఆగస్టు 2020 నెలలో ‘జెర్సీ’ హిందీ వెర్షన్ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షాహిద్ కపూర్ ఈ చిత్రంలో అర్జున్ పాత్ర కోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అందుకోసం క్రికెట్ కోచింగ్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ చిత్రంలో నటించడం ద్వారా.. బాలీవుడ్‌లో మంచి కెరీర్‌ను పొందే అవకాశం ఉన్నప్పటికీ.. రష్మిక ఆ ఛాన్స్ మిస్ చేసుకోవడం పట్లే పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె చెబుతున్న కారణం  సిల్లీగా ఉందని కూడా పలు పత్రికలు వార్తలు రాశాయి. కథానాయిక అన్నాక.. అన్ని రకాల పాత్రలను ఛాలెంజింగ్‌గా తీసుకొని చేయాలి కానీ.. చేయలేనని చెప్పడం వల్ల తన మీద నెగటివ్ ఇంప్రెషన్ పడే అవకాశముందని పలువురు అంటున్నారు. 

అలాంటి సినిమాలు నేను చేయను.. పాత్రల విషయంలో పక్కాగా ఉంటా: రష్మిక

కన్నడ చిత్రాలతో వెండితెరకు పరిచయమైనా.. తెలుగు చిత్రాలతోనే బాగా పాపులరైంది రష్మిక. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో తాను కలిసి నటించిన ‘గీత గోవిందం’ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. కన్నడంలో ఆమె నటించిన ‘కిరాక్ పార్టీ’ చిత్రం ఆమెకు ఉత్తమ నటిగా ‘సైమా’ అవార్డును సైతం కట్టబెట్టింది. ‘ఛలో’ రష్మి తెలుగులో నటించిన తొలి చిత్రం. ప్రస్తుతం సుల్తాన్ చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలో కూడా తన లక్ పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది రష్మిక.’ కిరాక్’ పార్టీ సినిమా నిర్మాత రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక.. ఆ తర్వాత తనతో పెళ్లికి నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ ఈ జంట ఆ తర్వాత.. అనుకోని కారణాల వల్ల విడిపోయింది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.                           

 

Read More From Celebrity Life