Celebrity Life

సీతారామయ్య గారి ‘మనవరాలి’కి.. పుట్టినరోజు శుభాకాంక్షలు ..!

Babu Koilada  |  Sep 16, 2019
సీతారామయ్య గారి ‘మనవరాలి’కి.. పుట్టినరోజు శుభాకాంక్షలు ..!

సీతారామయ్య గారి మనవరాలు.. ఈ సినిమా ఎవరికైనా గుర్తుందా.? 1991లో  విడుదలైన ఈ చిత్రంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో సరిసమానంగా నటించి ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా కొట్టేసిన.. ఆ 16 ఏళ్ల అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె పేరే మీనా (Meena).

కేవలం ఒక్క సినిమాతోనే.. స్టార్ హోదా సంపాదించుకున్న.. ఆమె నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దాదాపు అగ్రహీరోలు అందరితోనూ నటించిన మీనా పుట్టినరోజు సందర్భంగా.. ఆమె జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను మనమూ తెలుసుకుందామా

తమిళనాడులోని చెన్నైలో జన్మించిన మీనా 1982లోనే చైల్డ్ ఆర్టిస్టుగా సినీ తెరకు పరిచయమైంది. ఆమె తండ్రి ఓ తమిళియన్. అలాగే తల్లి మలయాళీ. కాబట్టి ఆమెకు రెండు భాషల్లోనూ పట్టు ఏర్పడింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఆమె బిజీగా ఉండడంతో.. ప్రైవేటుగానే ట్యూషన్ చెప్పించుకొని స్కూలు పరీక్షలకు హాజరయ్యేవారామె.

అతిలోకసుందరి శ్రీదేవి జయంతి సందర్భంగా.. ఆమె గురించి కొన్ని విశేషాలు..!

శివాజీ గణేషన్, రజనీకాంత్, శోభన్ బాబు లాంటి దిగ్గజాల పక్కన చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేసిన మీనా.. దాదాపు 42 చిత్రాలలో బాలనటిగా యాక్ట్ చేయడం విశేషం. ఒకప్పుడు రజనీకాంత్ పక్కన బాలనటిగా నటించిన మీనా.. ఆ తర్వాత ఆయన పక్కన హీరోయన్‌గా కూడా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరామె.

“సీతారామయ్య గారి మనవారాలు” చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు మీనా కథానాయికగా పరిచయమయ్యాక.. ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. చంటి, సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అశ్వమేథం, ముఠామేస్త్రీ, అబ్బాయి గారు, అల్లరి అల్లుడు, బొబ్బిలి సింహం, సూర్యవంశం, స్నేహం కోసం మొదలైన చిత్రాలలో స్టార్ హీరోలు అందరితోనూ నటించిందామె.

తన పుట్టినరోజున నేనిచ్చిన సర్ ప్రైజ్ చూసి.. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఫీలయ్యాడంటే..!

2009లో బెంగుళూరుకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను వివాహమాడిన మీనా.. తర్వాత కొన్నాళ్లు సినిమాలకు స్వస్తి పలికారు. ఆ తర్వాత పలు చిన్న చిత్రాలలో నటించారు. వెంకటేష్ నటించిన “”దృశ్యం” చిత్రంతో ఆమె తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారని చెప్పవచ్చు. ఇదే చిత్రం మలయాళం వెర్షన్‌లో కూడా మోహన్ లాల్ సరసన మీనా నటించారు. 

అలాగే దాదాపు అన్ని భాషల టీవీ ఛానల్స్‌లో కూడా వ్యాఖ్యాతగా మీనా రాణించారు. న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. నా కొంగు బంగారం కాను, సూపర్ కుటుంబం, ఎక్స్‌‌ట్రా జబర్దస్త్ లాంటి తెలుగు టీవీషోలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.                                                                                

 

మీనా తన నటనకు గాను అందుకున్న పురస్కారాలెన్నో. భారతి కన్నమ్మ (తమిళం), స్వాతి ముత్తు (కన్నడం) చిత్రాలకు ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను కైవసం చేసుకున్నారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం ఆమెను “కళైమామణి” పురస్కారంతో సత్కరించింది. 

తమిళంలో అవ్వాయ్ షణ్ముఖి, నట్టమై, ముత్తు, రిథమ్ లాంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే తెలుగులో మీనా నటించిన “తరిగొండ వెంగమాంబ” చిత్రానికి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

20 ఇయర్స్ ఇండస్ట్రీ.. అలుపెరగని సంగీత ప్రయాణం: దేవీశ్రీ ప్రసాద్ బర్త్ డే స్పెషల్

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

 

Read More From Celebrity Life