ADVERTISEMENT
home / Celebrity Life
20 ఇయర్స్ ఇండస్ట్రీ.. అలుపెరగని సంగీత ప్రయాణం: దేవీశ్రీ ప్రసాద్ బర్త్ డే స్పెషల్

20 ఇయర్స్ ఇండస్ట్రీ.. అలుపెరగని సంగీత ప్రయాణం: దేవీశ్రీ ప్రసాద్ బర్త్ డే స్పెషల్

1999 లో కోడి రామక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన “దేవీ” చిత్రం విడుదలైనప్పుడు.. ఆ కుర్రాడి వయసు కేవలం 20 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆ సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన ఆ కుర్రాడు.. తర్వాతి కాలంలో ఇండస్ట్రీకి మరిచిపోలేని హిట్స్ ఇచ్చాడు. మాస్, ఫాస్ట్ బీట్, మెలోడీ.. ఇలా ఎలాంటి పాటకైనా సులభంగా బాణీలు (music) సమకూర్చడంలో దేవీ ప్రసాద్ దిట్ట. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా.. మనం కూడా ఈ టాలీవుడ్ రాక్ స్టార్ గురించి.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా..?

పాతికేళ్లు కూడా నిండని వయసులోనే.. దేవీశ్రీ ప్రసాద్ (Devisri Prasad) ఆనందం, ఖడ్గం, కలుసుకోవాలని, మన్మధుడు, వెంకీ, వర్షం, ఆర్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, మాస్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించాడు. తర్వాత సింగర్‌గానూ రాణించాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా మ్యూజిక్ అందించి.. దక్షిణాదిలోనే మోస్ట్ స్టైలిష్ మ్యూజిషియన్‌గా కితాబునందుకోవడం దేవీశ్రీ ప్రసాద్‌కే చెల్లింది. అలాగే హిందీలో.. అదీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ నటించిన “రెడీ” సినిమాలోని “డింక్‌చికా” సాంగ్‌కి.. మ్యూజిక్ కంపోజ్ చేసి ఉత్తరాది వారిని కూడా ఆకట్టుకున్నాడు దేవీశ్రీ ప్రసాద్. 

ఈ అమ్మాయిలు నడిపే రాక్ బ్యాండ్ చాలా స్పెషల్.. ఎందుకంటే..?

ఇక దేవీశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తిని గురించి చాలానే చెప్పుకోవాలి. ఒకప్పుడు ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీకి కథా రచయితగా ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. పాటల రచయితగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. తర్వాత దేవత, ఖైదీ నెంబర్ 786, పెదరాయుడు, అభిలాష, పోలీస్ లాకప్, శత్రువు, బంగారు బుల్లోడు.. లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఆయన కథలను అందించారు. దేవీశ్రీ ప్రసాద్ తాను కంపోజ్ చేసిన “నాన్నకు ప్రేమతో” టైటిల్ సాంగ్‌ను తన తండ్రికే అంకితమివ్వడం విశేషం. 

ADVERTISEMENT

టాలీవుడ్ సంగీత దర్శకులు – మణిశర్మ హిట్ సాంగ్స్ 

గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేదీ, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో.. సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డులను కైవసం చేసుకున్న దేవీశ్రీప్రసాద్.. తన కెరీర్‌లో తొలి నంది పురస్కారాన్ని “అత్తారింటికి దారేదీ” చిత్రానికి గెలుచుకున్నారు. జనతా గ్యారేజ్ సినిమాకు కంపోజ్ చేసిన మ్యూజిక్‌కు గాను సైమా పురస్కారాన్ని కూడా అందుకున్నారు దేవీశ్రీ ప్రసాద్. దేవీశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ కూడా ప్లేబ్యాక్ సింగర్‌గా బాగా సుపరిచితులు

ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్‌కు.. దేవీశ్రీ ప్రసాద్ ప్రియ శిష్యుడు. అలాగే మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకి పెద్ద ఫ్యాన్ కూడా. డ్యాన్స్ చేయడం అంటే కూడా దేవీశ్రీప్రసాద్‌‌కు ఎంతో ఇష్టం. కుమారి 21 ఎఫ్ చిత్రంలో సరదాగా.. ఓ పాటకు కొరియోగ్రాఫీ కూడా చేశారు. తమిళంలో కూడా పులి, సామి 2, వీరమ్, కంద స్వామి, సింగమ్ లాంటి సినిమాల సంగీత దర్శకుడిగా దేవిశ్రీకి మంచి పేరు తీసుకొచ్చాయి. లెజెండరీ నటుడు కమల్ హసన్ సైతం దేవీశ్రీ మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టపడతారట. అందుకే దశావతారం చిత్రానికి ఆయన చేత.. ప్రత్యేకంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించారు. 

ఇలా దేవీశ్రీ ప్రసాద్ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు. అలాగే జానపద గాయకులకు అప్పుడప్పుడు.. తన సినిమాలలో అవకాశం ఇవ్వడం ద్వారా కూడా తన ఉదాత్తతను చాటుకున్నారు దేవీశ్రీప్రసాద్. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న “సరిలేను నీకెవ్వరూ” చిత్రంతో పాటు.. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషనులో వస్తున్న చిత్రానికి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు దేవీశ్రీ ప్రసాద్.

ADVERTISEMENT

నటనతోనే కాదు.. పాటతోనూ మెప్పించిన కథానాయికలు వీరే..!

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

 

ADVERTISEMENT

 

02 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT